S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/13/2016 - 23:55

ప్రశ్న: నగదు రహిత లావాదేవీలతో లాభమేమి? వివరింపుము.

12/10/2016 - 01:01

అయిదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ఉరుము లేని పిడుగులా జనాన్ని తాకింది. గత నెలరోజులుగా ఎక్కడ చూసినా నగదు కోసం ప్రజలకు నరకయాతనే. పరిమితికి లోబడి ఇచ్చే కాస్తంత నగదు కోసం బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద పడిగాపులు. పాతనోట్లు చెల్లక, ఆశించిన నగదు లభించక- ‘డబ్బులేనివాడు ఎందుకూ కొరగాడు’ అంటే ఏమిటో అందరికీ తెలిసొచ్చింది.

12/07/2016 - 02:49

ఆధునిక యుగంలో జల,వాయు కాలుష్యాలతోపాటు శబ్దకాలుష్యం అనూహ్యంగా పెరిగిపోతోంది. చట్టాలెన్ని ఉన్నప్పటికీ దీనికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. బస్సుల్లో రాత్రివేళ ప్రయాణీకుల కాలక్షేపానికి టీవీలు పెరిగిపోయాయి. ప్రయాణంలో కూడా టీవీ చూడాలా? బస్సు హారన్లు ఎలాగూ తప్పవు. వీటికి తోడు టీవీ ధ్వని. ఇక పగటిపూట బస్సులలో పెద్ద శబ్దంతో పాటలు పెడుతున్నారు.

12/02/2016 - 23:01

మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన దేశాన్ని సుభిక్షంగా, స్వాభిమానంగా తీర్చిదిద్దాలని మనం భావించాం. ఎనె్నన్నో కలలు కన్నాం. కానీ, బాధాకరమైన విషయం ఏమంటే ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. అవి నెరవేరలేదు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని అనుకున్నాం.

11/23/2016 - 00:51

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న హెచ్‌ఐవి బిల్లుపై హెచ్‌ఐవి బాధితులు, ఆ వ్యాధి నివారణకు కృషి చేస్తున్న ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స విషయంలో తాము కొన్ని హక్కులను కోల్పోతామన్న ఆందోళన హెచ్‌ఐవి పీడితుల్లో కనిపిస్తోంది. మొదట రూపొందించిన ఈ బిల్లును కాస్తంత తేలికపరిచారు.

11/18/2016 - 22:41

ప్రజాస్వామ్య వ్యవస్థలో అసలు ప్రభుత్వం అంటే ఏమిటి? అది దేనికి? అది ఎవరి కోసం? ప్రాచీనకాలంలో మానవ సమూహాలు, మానవ గణాలు సమాజంగా పరిణామం చెంది స్థిరీకరణ జరుగుతున్న కా లంలో ఆ సమాజ సూత్రీకరణను అమలు పరచడానికి ఒక అధికార కేంద్రం అవసరం ఏర్పడింది. సమాజ విస్తృతిని బట్టి ‘రాజ్యం’ (స్టేట్) ఏర్పడింది. ఈ రాజ్యం కొన్ని ప్రాదేశిక పరిమితుల్లో వుంటుంది.

11/15/2016 - 22:41

మన తెలుగు వారిది చిన్నపిల్లల మనస్తత్వం అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఏమికావాలో మనకే తెలియదు. ఇంకొకరు చెబితేనే మనం ఉత్సాహం చూపిస్తాం. అంతవరకూ స్వంతంగా ఆలోచించం. మన గురించి ఎవరో ఒకరు మనకు చెప్పాలి. ‘ముత్యాలముగ్గు’ సినిమాలో విలన్ రావుగోపాలరావు చెప్పిన దానికి విరుద్ధంగా ‘తిని తొంగుంటూ మనిషికి, గొడ్డుకీ తేడా లేకుండా’ బతికేస్తాం!

11/06/2016 - 01:51

మానవాళి తప్పిదాలతో వాతావరణ మార్పులు ముమ్మరించి, భూతాపం గణనీయంగా పెరిగి ప్రకృతి వికృత రూపం దాల్చుతోంది. పారిశ్రామిక విప్లవానికి ముందు నాటికంటే రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు పెరగకుండా చూడాలని గత సంవత్సరం జరిగిన పారిస్ సదస్సులో ప్రపంచ దేశాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి.

11/03/2016 - 03:47

ఎస్సెస్‌మెంట్‌లో ఒక భాగం ప్రతిరోజూ పునశ్చరణ చే యడం. అది ప్రతిరోజూ లేదా వారానికి ఒకరోజు జరగవచ్చు. నెలకు ఒకసారి కూడా జరగవచ్చు. అది వౌఖికంగా కొన్నిసార్లు, కొన్ని సమయాల్లో రాతపూర్వకంగా వుంటుంది. పునశ్చరణ వౌఖికంగా జరిగినా టీచర్ దాన్ని రికార్డు చేసుకోవాల్సి వుంటుంది. రాతపూర్వకంగా జరిగితే ప్రతివాక్యం చదవాలి. ఈ పునశ్చరణ పద్ధతులే ఉపాధ్యాయులలో కొత్త భావాలకు మూలాధారం అవుతాయి. కరెక్టుగా రాసిన వారుంటారు.

06/04/2016 - 06:43

దేశంలో రోజురోజుకి జనాభా ఏ విధంగా పెరిగిపోతున్నదో అంతే త్వరగా నిరుద్యోగం కూడా ఎక్కువవుతున్నది. కారణం నేటి సమాజ అవసరాలకు తగినట్లుగా మన దేశ యువతకు చదువులేదు. ఎన్ని చదువులు చదివినా ఎన్ని డిగ్రీలు పొందిన ఉద్యోగం చేయలేని పరిస్థితి ఏర్పడుతున్నది. మరి ఇలాంటి పరిస్థితిలో సతమతమవుతున్న సాటి నిరుద్యోగి పాలిట కొంతమంది చదువుకున్న వ్యక్తులే దోపిడి దొంగలుగా మారారు. నిరుద్యోగి జీవితాలను కొల్లగొడుతున్నారు.

Pages