S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/11/2018 - 00:11

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని నిరసన వ్యక్తం చేస్తూ విపక్షాలు చేపట్టిన రాష్ట్ర బంద్‌లో విద్య, వ్యాపార సంస్థలను మూసివేయించారు. ఆర్టీసీ బస్సులను రోడ్డెక్కనివ్వలేదు. బంద్ కారణంగా ఆర్టీసీ దాదాపు 7కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోయింది. అయితే, బంద్ సందర్భంగా ఆందోళనకారులు రైల్వే స్టేషన్ల దరిదాపులకే పోలేదు. రైల్‌రోకో అన్న మాటే వారి నోట వినిపించలేదు.

02/07/2018 - 05:42

మ న దేశంలో ప్రజలు పీల్చేగాలి నానాటికీ విషపూరితమవుతోందని, ఫలితంగా సగటున నిమిషానికి ఇద్దరు మరణిస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఏటా పది లక్షల మందికి పైగా భారతీయులు వాయు కాలుష్యంతో మృత్యువాత పడుతున్నారనీ, ప్రపంచంలోనే అత్యధికంగా కలుషితమైన నగరాలలో కొన్ని భారత్‌లో ఉన్నాయనీ ‘ది లానె్సట్’ మెడికల్ జర్నల్ పేర్కొంది. ‘ది లానె్సట్ కౌంట్‌డౌన్’ పేరుతో ఆ జర్నల్ ఏటా నివేదికను వెలువరిస్తోంది.

02/03/2018 - 00:23

కేన్సర్ వ్యాధి నివారణకు ప్రపంచ ప్రజలంతా చైతన్యవంతం కావాలని శాస్తవ్రేత్తలు చాలాకాలంగా పిలుపుఇస్తూనే ఉన్నారు. ఆధునిక వైద్య విజ్ఞానం అందుబాటులోకి వచ్చినా ఈ వ్యాధి బారిన పడుతూ నిత్యం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. క్యాన్సర్ నివారణకు సమగ్ర కార్యాచరణను నిర్దేశించేందుకు 2000లో పారిస్‌లో మొదటి శిఖరాగ్ర సమావేశం జరిగింది.

01/31/2018 - 21:56

తరగతి గది ప్రతి అంశాన్ని వడపోస్తుంది. ముద్రించిన ప్రతి అక్షరం నిజం కావాల్సిన అవసరం లేదు. పుస్తకంలో ఉండే ప్రతి అక్షరాన్ని వడపోసే లక్షణాన్ని ఉపాధ్యాయుల్లో పిల్లల్లో కలిగిస్తుంది. అందుకే తరగతి గదికి వెళ్లకముందు ఉపాధ్యాయుడు ఆ అంశానికి సంబంధించిన ప్రతి పుస్తకాన్ని చదవాలి. విమర్శించుకోవాలి. విమర్శన అంటే విశే్లషణ చేయడం, విడమరిచి చెప్పడం. ఆ అంశానికి సంబంధించిన సత్యాసత్యాలు బేరీజు వేసుకోవడం జరగాలి.

01/31/2018 - 00:18

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పి.ఎఫ్.ఐ) ఓ తీవ్రవాద, ముస్లిం మతోన్మాద సంస్థ. 2006లో ఏర్పడింది. దేశంలో మానవహక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పోరాటం జరుపుతామనే ఈ సంస్థ, ప్రజల జీవించే హక్కునే శాసిస్తున్నది. ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను, అసమానతలను సరి చేస్తామనే పీఎఫ్‌ఐ నిషేధిత ‘సిమి’ (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా)కి మారు రూపమే.

01/30/2018 - 00:17

మహాత్మునిగా భారత జాతికే కాకుండా ప్రపంచ మానవాళికి ఆరాధ్యనీయులైన గాంధీజీ మన జాతిపిత, మాతృదేశ స్వాతంత్య్రానంతరం కేవలం అయిదు నెలల పదిహేను రోజులు జీవించారు. బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్య్ర సాధనలో, మూడు దశాబ్దాలకుపైగా సత్యాగ్రహ, అహింసాయుత గాంధేయ సిద్ధాంత ప్రవక్తగా సారథ్యం వహించిన గాంధీజీ 79 సంవత్సరాలు, భూమిపై ఉన్నారు.

01/27/2018 - 00:06

రాజకీయ ప్రయోజనాల కోసం అర్ధంతరంగా రాష్ట్ర విభజన చేసి అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని నాటి యూపీఏ ప్రభుత్వం నడిసముద్రంలో పడవేసింది. ఆ తరువాత ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ సైతం మాట నిలుపుకోలేదు. కనీసం విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను నెరవేర్చడంలో శ్రద్ధ చూపకపోవడం దారుణం.

01/24/2018 - 22:16

మనిషి మాతృభాష నేర్చుకోవడానికి కష్టపడవలసిన అవసరం ఉండదు. అది సహజసిద్ధంగా వస్తుంది. కొంతమందికి ఒక భాష నేర్చుకుంటే రెండో భాష నేర్చుకోవడం సులభం కావచ్చును. భాషల్లో కూడా సారూప్యత ఉంటుంది. తెలుగువచ్చిన వారికి కన్నడం వస్తుంది. దానినే మనం సోదర భాషలు అంటాం. మాతృభాష మరచిపోయే అవకాశం ఉంటుందా? అని అడగవచ్చును. రెండు సంవత్సరాల వయసులో మాతృభాష మాట్లాడతాడు. కానీ అది అలా గుర్తుండిపోతుందని లేదు.

01/24/2018 - 01:18

ఒక్క ఓటు గెలుపు ఓటముల నిర్ధారణ జరిగే ఎన్నికల వ్యవస్థ మనది. ఓటర్లు చురుకైన భాగస్వామ్యమే ప్రజాస్వామ్యయుత ఎన్నికల వ్యవస్థ విజయానికి కీలకం. ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడంలోతే సరిపెట్టకుండా ఓటర్ల నమోదును చురుకుగా నిర్వహిస్తూ ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఏ రాజకీయ పక్షానికి తలవంచక స్వతంత్రంగా తన విధులు నిర్వహిస్తోంది.

01/21/2018 - 00:31

గ్రామాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుంది. రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలను బలోపేతం చేసే నూతన పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. నిధులు, విధులు లేక ఇన్నాళ్లూ గాడితప్పిన ఈ వ్యవస్థను చక్కదిద్దడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించడం అభినందనీయం. కానీ ఈ వ్యవస్థను సమూలంగా మార్చడం, గ్రామ పంచాయతీ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో నిర్వహించాలన్న ఆలోచనలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Pages