S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/19/2019 - 21:50

స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ తీరు వంకపెట్టలేనిదేమీ కాదు. అలా అని ఆ సంస్థ నిర్ణయాలను నిందిస్తూ కూర్చున్నా ఫలితం ఉండదు. నిష్పక్షపాతంగా దాని పనితీరును మదింపుచేసి లోపాలను, బలహీనతల్ని అధిగమించేలా పనిచేసేలా ఎలా తీర్చిదిద్దాలో ఆలోచించాలి. ఈసీ పనితీరును ఎత్తిచూపే రాజకీయ పార్టీలు- తాము అధికారంలోకి వస్తే ఎలా దాన్ని బలోపేతం చేస్తామో చెప్పాలి. అందుకు తగ్గట్టు హామీ ఇవ్వాలి.

04/19/2019 - 02:07

జాతి పురోగతిలో ఉపాధ్యాయుల పాత్ర విస్మరించరానిది. ఏ దేశమైనా అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అక్షరాస్యత ముఖ్యమనే విషయం కాదనలేని అంశం. విద్యారంగం దేశానికి గుండె వంటిది. ఆ రంగం ఆగిపోతే దేశానికి కావాల్సిన రక్తప్రసరణ ఆగిపోయినట్లుగా ప్రముఖ విద్యావేత్తలు పేర్కొన్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్నప్పటికీ- నేటి విద్యారంగం దోపిడీకి లైసెన్స్ ఉన్న మాఫియా వ్యవస్థగా మారిందని చెప్పవచ్చు.

04/17/2019 - 02:14

ఎన్నికల బాండ్ల వివాదంపై మరోమారు విస్తృత చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషన్ తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఎన్నికల వ్యయం అపరిమితంగా పెరిగిపోవడం, అక్రమాలకు తావివ్వడం వంటి చర్యలను నిరోధించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్లను ప్రతిపాదించింది. దీనిద్వారా రాజకీయపార్టీలకు జవాబుదారీతనాన్ని తీసుకురావచ్చని, అకౌంట్లను పారదర్శకంగా నిర్వహించేలా చూడొచ్చనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన.

04/17/2019 - 02:09

రకరకాల చౌక వస్తువులతో ప్రపంచ మార్కెట్ వ్యవస్థను ముట్టడించిన చైనా తాజాగా తన పొగాకు ఎగుమతులతో ఘాటెత్తిస్తోంది. ఈ భూమి మీద పండే పొగాకులో 70శాతం చైనాలో పండిందే. అంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. ఆ తర్వాత స్థానం మాత్రం భారతదేశానిదే.

04/14/2019 - 05:16

నాటికీ నేటికీ దళితుల్లో పేదవారి సంఖ్య అధికంగానే ఉంది. ఐతే, దళితుల పేరుతో కొందరు రాజకీయ నేతలు వేల కోట్ల రూపాయలు దోచుకోవటం న్యాయమేనా? ఉత్తరప్రదేశ్‌లో బిఎస్పీ అధినేత్రి, మా జీ ముఖ్యమంత్రి మాయావతి వంటి నేతలు దళితుల పేరు చెప్పుకొని సంపదను భారీగా పోగుచేసుకున్నారు. ప్రస్తుతం మాయావతి రకరకాల కేసుల్లో కోర్టు చుట్టూ తిరుగుతున్నది. ఇవి యూపీఏ పాలన నాటివి.

04/12/2019 - 22:51

సరిగ్గా వంద సంవత్సరాల క్రితం నాటి మాట.. అది- ఏప్రిల్ 13, 1919 ఆదివారం ‘వైశాఖి’ పర్వదినం రోజు. అమృత్‌సర్ నగరంలో జనమంతా నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహవంతంగా జరుపుకొంటున్నారు. అక్కడి స్వర్ణ దేవాలయానికి కూతవేటు దూరంలో జలియన్‌వాలా బాగ్ మైదానంలో సభ జరుగుతోంది. పండుగ సందర్భంగా ఆలయానికి వచ్చిన సిక్కు, హిందూ మతాలకు చెందిన పురుషులు, స్ర్తిలు, పిల్లలూ ఆ మైదానంలో గుమిగూడారు.

04/12/2019 - 04:50

ఎన్నికలు జరిగే రోజు అన్ని మాధ్యమాల్లో తానే కన్పించడం ఎలా?- అని అనుకున్నాడు చంద్రబాబు. ప్రచారం ముగిశాక ప్రకటనలు, ప్రసంగాలు అంటే ఎన్నికల సంఘం ఒప్పుకోదు కాబట్టి ఆయన మెదళ్లో తటుక్కున ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. ఏదో ఒక నెపంతో ఏపీ ఎన్నికల సంఘం అధికారి ద్వివేదిని కలిసి, ధర్నా చేస్తే- పోలింగ్ రోజున అదే వార్తఅవుతుందని అనుకున్నాడు.

04/10/2019 - 05:16

బోధి వృక్షం (రావిచెట్టు) కింద కూర్చొని ‘ధ్యానం’ చేస్తే ‘జ్ఞానోదయం’ అవుతుందని బౌద్ధం ఆచరించేవారంటారు. అందుకే బిహార్‌లోని ‘బోధ్ గయ’లోని బోధి వృక్షం నీడలో- వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చినవారు ‘ధ్యానం’ చేస్తూ కనిపిస్తారు. దాదాపు రెండున్నర వేల సంవత్సరాలుగా ఇప్పటికీ ఈ దృశ్యం కనిపిస్తోంది. ఈ రెండున్నర వేల సంవత్సరాల్లో ఎందరికి జ్ఞానోదయమైందో, ఎంతమంది వికసించిన వివేకంతో విజ్ఞులయ్యారో తెలియదు.

04/07/2019 - 02:14

బుద్ధ జయంతి సందర్భంగా 1956 సంవత్సరంలో టిబెట్‌కు చెందిన దలైలామా, పంచన్‌లామా భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో వారికి గొప్ప ఆతిథ్యం లభించింది. బుద్ధగయ తదితర బౌద్ధక్షేత్రాలను వాళ్లు సందర్శించారు. తమ బౌద్ధ మూలాలను తిలకించి వారు ముగ్ధులయ్యారు. కొన్ని వారాల అనంతరం తిరిగి టిబెట్‌కు వెళ్ళారు.

04/05/2019 - 22:38

నేడు పాలనా యంత్రాంగంలో అవినీతిని నియంత్రించడానికి సమాచార హక్కు చట్టం ఓ బ్రహ్మాస్త్రంగా పనిచేస్తోంది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల అవినీతికి సంబంధించిన సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారానే కొందరు నేతలు పొందుతున్నారు. విద్యావంతులు, రాజకీయ పక్షాలు, మేధావులు మాత్రమే ఈ చట్టాన్ని వినియోగించుకుంటున్నారు.

Pages