S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/17/2019 - 01:56

ఆరు దశాబ్దాల క్రితం ‘మదర్ ఇండియా’ అనే హిందీ చలనచిత్రం విడుదలైంది. ఆ చిత్రానికి నిర్మాత-దర్శకుడు మెహబూబ్‌ఖాన్, చిత్రానువాదం (స్క్రీన్‌ప్లే)- మెహబూబ్‌ఖాన్, వజాహత్ మిర్జా, ఎస్. అలీరజా. సంగీతం- నౌషద్. ప్రధాన పాత్రధారి నర్గీస్. ఈ చిత్రాన్ని దేశ పౌరులందరూ ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు.

12/15/2019 - 02:33

నేడు పొట్టి శ్రీరాములు వర్ధంతి
*

12/15/2019 - 00:13

ప్రస్తుత ఉరుకులు, పరుగులు జీవనంలో మానవుల పని సులువుగా సాగడంలో ఇంధనం ప్రముఖ స్థానాన్ని పోషిస్తోంది. ఉదయం తేనీరు తయారీ మొదలుకుని రాత్రి పడుకునే గదిలో తిరిగే ఫ్యాన్ వరకు వివిధ రూపాల్లో ఇంధనంతోనే మన జీవనం ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో ఇంధన పొదుపు ఆవశ్యకతను వివరిస్తూ 2001నుంచి ఏటా డిసెంబర్ 14నుంచి 20వరకు ఇంధన పొదుపు వారోత్సవాలుగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

12/11/2019 - 05:09

ప్రపంచంలో మనిషిని, మనిషిలా చూసేది భూమి ఒక్కటే! మట్టి కాళ్లను ముద్దాడుతుంది. నీరు దాహాన్ని తీరుస్తుంది. వాయువు ప్రాణాన్నిస్తుంది. అగ్ని ఒకేలా వెలుగునిస్తుంది. ఈ సృష్టిలో శాశ్వతమైన పంచభూతాలకు లేని ఏ గర్వం, స్వార్థం అశాశ్వతమైన జీవికి మనిషికి ఎందుకు ఈ దుర్మార్గపు పనులు. అవసరానికి మించిన ఆశలు, ఆశలకు మించిన దురాశలు.. సహజత్వాన్ని మరిచిపోతూ.. కాలుష్యాన్ని పెంచుతూ పోవడమే మనిషి దురదృష్టం.

12/10/2019 - 23:46

మానవ హక్కులు అనేవి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులకు ఉద్దేశించబడినవి. ప్రపంచంలో పౌర, రాజకీయ హక్కులకు సంబంధించి అంతర్జాతీయ ఒడంబడికలపై అవగాహన పెంచటానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’ జరుపుకుంటున్నాం.

12/10/2019 - 23:37

భారతీయ సైనిక సిబ్బందికి జాతి యావత్తూ సహాయ సహకారాలు అందించాలన్న సంకల్పంతో ఏటా డిసెంబర్ 7న ‘సాయుధ దళాల పతాక దినోత్సవం’ పాటిస్తున్నాం. సైనిక సిబ్బంది సంక్షేమం కోసం ఈజున విరాళాలు వసూలు చేస్తారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక రక్షణ సిబ్బంది సంక్షేమ నిర్వహణ అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది.

12/10/2019 - 23:31

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోడ్లను నిర్మిస్తున్నా, భద్రత రీత్యా మోటారు వాహనాల ప్రమాణాలు పెంచుతున్నట్టు సంబంధిత కంపెనీలు గొప్పలు చెబుతున్నా- రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రతినిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల ఎందరో మరణిస్తున్నారు, ఇంకెందరో క్షతగాత్రులవుతున్నారు, ఎన్నో కుటుంబాలు విషాదం పాలవుతున్నారు.

12/03/2019 - 00:44

వైకల్యం అనేది ఒక చేదు ఘటన మాత్రమే కాని సమస్య కాదు, అంటువ్యాధి అంతకన్నా కాదు అనే విషయం పట్ల సమాజాన్ని చైతన్యపరచవలసిన అవసరం ఉంది. లక్ష్యాన్ని సాధించడంలో, ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో, నవీన ఆవిష్కరణల్లో వైకల్యం అడ్డురాదని నిరూపించినవారు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. లక్ష్యసాధనలో దివ్యాంగులు ముందుండాలి.

12/01/2019 - 22:18

తరతరాలుగా అంటరానితనం అనుభవిస్తూ, బానిసత్వం, పీడనలకు గురైన వర్గాలవారి కోసం తన జీవితమంతా అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నత స్ర్తిమూర్తి ఈశ్వరీబాయి. సికింద్రాబాద్‌లోని చిలకలగూడ ప్రాంతానికి చెందిన బల్లెపు బలరామస్వామి, రాములమ్మ దంపతులకు 1918 డిసెంబర్ 1న జన్మించిన ఈశ్వరీబాయికి విద్యాభ్యాసం రోజుల్లోనే అప్పటి దురాచారాల ప్రకారం తన 13వ ఏటనే పూణెకు చెందిన డా.జె.లక్ష్మీనారాయణతో వివాహం జరిగింది.

12/01/2019 - 04:44

తెలుగుజాతి నాది- తెలుగువాడను నేను
అమ్మభాష నాది- అచ్చతెలుగు
అమ్మభాష చదివి- అభివృద్ధి చెందితి
తెలుగుభాష రుణము- తీర్చకొంటి

ప్రాణమమ్మభాష- ప్రగతికది పునాది
అమ్మభాష చదవ- అన్యభాష
లభ్యసింప సులభమనిరి నిపుణులెల్ల
బాషలందు తెలుగు భాష లెస్స

Pages