S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/12/2019 - 04:50

ఎన్నికలు జరిగే రోజు అన్ని మాధ్యమాల్లో తానే కన్పించడం ఎలా?- అని అనుకున్నాడు చంద్రబాబు. ప్రచారం ముగిశాక ప్రకటనలు, ప్రసంగాలు అంటే ఎన్నికల సంఘం ఒప్పుకోదు కాబట్టి ఆయన మెదళ్లో తటుక్కున ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. ఏదో ఒక నెపంతో ఏపీ ఎన్నికల సంఘం అధికారి ద్వివేదిని కలిసి, ధర్నా చేస్తే- పోలింగ్ రోజున అదే వార్తఅవుతుందని అనుకున్నాడు.

04/10/2019 - 05:16

బోధి వృక్షం (రావిచెట్టు) కింద కూర్చొని ‘ధ్యానం’ చేస్తే ‘జ్ఞానోదయం’ అవుతుందని బౌద్ధం ఆచరించేవారంటారు. అందుకే బిహార్‌లోని ‘బోధ్ గయ’లోని బోధి వృక్షం నీడలో- వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చినవారు ‘ధ్యానం’ చేస్తూ కనిపిస్తారు. దాదాపు రెండున్నర వేల సంవత్సరాలుగా ఇప్పటికీ ఈ దృశ్యం కనిపిస్తోంది. ఈ రెండున్నర వేల సంవత్సరాల్లో ఎందరికి జ్ఞానోదయమైందో, ఎంతమంది వికసించిన వివేకంతో విజ్ఞులయ్యారో తెలియదు.

04/07/2019 - 02:14

బుద్ధ జయంతి సందర్భంగా 1956 సంవత్సరంలో టిబెట్‌కు చెందిన దలైలామా, పంచన్‌లామా భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో వారికి గొప్ప ఆతిథ్యం లభించింది. బుద్ధగయ తదితర బౌద్ధక్షేత్రాలను వాళ్లు సందర్శించారు. తమ బౌద్ధ మూలాలను తిలకించి వారు ముగ్ధులయ్యారు. కొన్ని వారాల అనంతరం తిరిగి టిబెట్‌కు వెళ్ళారు.

04/05/2019 - 22:38

నేడు పాలనా యంత్రాంగంలో అవినీతిని నియంత్రించడానికి సమాచార హక్కు చట్టం ఓ బ్రహ్మాస్త్రంగా పనిచేస్తోంది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల అవినీతికి సంబంధించిన సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారానే కొందరు నేతలు పొందుతున్నారు. విద్యావంతులు, రాజకీయ పక్షాలు, మేధావులు మాత్రమే ఈ చట్టాన్ని వినియోగించుకుంటున్నారు.

04/03/2019 - 02:17

కులవ్యవస్థ పదఘట్టనల కింద నలిగిపోతున్న మన దేశ ప్రజానీకానికి ‘ భారత రాజ్యాంగం’ అనే వరాన్ని అందించాడు డా.బి.ఆర్.అంబేద్కర్. ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగంగా ఇది ప్రసిద్ధి చెందింది. స్వాతంత్య్రానంతరం 1949 నవంబర్ 26 నుండి అమల్లోకి వచ్చిన ఈ రాజ్యాంగం భారతీయ బహుజనులకు వరప్రదాయిని.

03/31/2019 - 04:31

ఈమధ్య ఒక చిన్న గ్రామం నుండి ఓ యువకుడు తన భూ సమస్యను వీడియో రూపంలో చిత్రీకరించి, సామాజిక మాధ్యమంలో పెడితే- అది కాస్తా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్లడం, ఆయన వెంటనే స్పందించడంతో ఆగమేఘాలపై రైతు సమస్య పరిష్కారం కావడం సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే ఎలాంటి తనిఖీలు చేయకుండానే అధికారులు ఏకపక్ష నిర్ణయం తీసుకుని కొందరిని మోసం చేశారనే విమర్శలు కూడా వినిపించాయి.

03/31/2019 - 04:28

నిపుణులైన వైద్యులను తయారు చేయాల్సిన వైద్య కళాశాలలు ఇపుడు బోధనా సిబ్బంది, వౌలిక వసతుల కొరతతో సతమతమవుతున్నాయి. గతంలో వలే వైద్య విద్యార్థులకు నేడు బోధన సరిగా అందకపోవడంతో అరకొర జ్ఞానంతో పట్టాలు అందుకున్న వారు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ప్రమాదం ఏర్పడుతోంది. వైద్య కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే ప్రజారోగ్యం మెరుగు పడుతుంది.

03/29/2019 - 22:48

రాజకీయ నాయకులకు ప్రజలంటే చులకన భావం (ఒక్క ఎన్నికల సమయంలో తప్ప) సహజం. ప్రజలకు మతిమరుపు ఎక్కువ అనేది చాలామంది నాయకుల ప్రగాఢ విశ్వాసం. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను ఆ తర్వాత తమతోపాటు జనం సైతం మరచిపోతారనేది నేతల గట్టి నమ్మకం. అందువల్లనే మన నాయకులు ఎన్నికల సమయంలో ఇష్టారాజ్యంగా హామీలు ఇచ్చి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

03/29/2019 - 05:17

తాము వ్యవసాయం చేస్తున్నామని రైతులు గర్వంగా చెప్పుకొనే రోజులుపోయి చాలా కాలమైంది. సేద్యంతో జీవనం సాగిస్తున్నానని చెప్పుకోవటానికి కర్షకులు సిగ్గుపడే పరిస్థితి ఎదురైంది. అయిదు ఎకరాల భూమి ఉన్న రైతు కుమారునికి కంటే నెలకు 5వేలు సంపాదించే బడుగు జీవుల పిల్లలకు పెళ్ళిళ్ళు కుదురుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

03/27/2019 - 04:11

కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ‘కలియుగం’ ప్రారంభమైందని విజ్ఞులు అంటారు. ఒక్కో యుగానికి ఒక్కో లక్షణముంటుందన్న భావన ఉంది. త్రేతాయుగ లక్షణాలు ద్వాపరంలో కనిపించవు, ద్వాపర యుగ లక్షణాలు కలియుగంలో కనిపించవన్నది జ్ఞాన విశారదుల మాట. కలియుగంలో సత్యం, ధర్మం, నిజం, వాస్తవాలకు ‘గ్రహణం’ పడుతుందన్న మాట విస్తృత ప్రచారంలో ఉంది.

Pages