S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/07/2019 - 01:36

సామాన్య మానవుడి జీవితం ఎక్కడ చూసినా దుర్భరంగానే వుంది. అసలు విషయం వదిలి కొసరు విషయాల మీద ‘వాగ్యుద్ధం’ ఎక్కువై పోయింది. ఎల్.ఒ.సి. దగ్గర టెన్షన్ల సంగతి ఏమో గానీ, రాజకీయ పార్టీల మధ్య భయంకరమైన కక్షలూ, కావేషాలు పెరిగిపోతున్న దశలో సగటు మనిషి కంటినిండా నిద్రపోలేకపోతున్నాడు. పోనీ, ‘సినిమాలు చూద్దామా?’ అంటే బయోపిక్చర్ల సంకుల సమరం సాగుతోంది.

03/06/2019 - 02:08

ప్రజాగాయకుడిగా ప్రసిద్ధి చెందిన గద్దర్ ఇపుడు కొత్త అవతారం ఎత్తారు. ఆయనకు ‘గద్దెల’(పీఠం)పై మోహం తగ్గలేదు. దాంతో ఆయన ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్ ఫోరం’ అనే సంస్థను ఏర్పాటుచేశారు. దానికి కన్వీనర్‌గా ఆయనే వ్యవహరిస్తున్నారు. గత 45 సంవత్సరాలలో ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. బాపూజీ బుర్రకథ దళం, జన నాట్యమండలి, తెలంగాణ ప్రజాఫ్రంట్... ఇలా ఎన్నో వేదికలు- పీఠాలను ఆయన ఎక్కుతూ దిగుతూ ఉన్నారు.

03/03/2019 - 00:16

రేపు ‘మహర్షి’ జయంతి సందర్భంగా...
*
భారత స్వాతంత్య్ర పోరాట సమరయోధులు, త్యాగధనులు ఎందరో కనుమరుగైపోయారు. దేశం విస్మరించిన దేశభక్తుల జాబితా ఎంచలేనిది. వీరందరిలో బులుసు సాంబమూర్తి వంటి మహోన్నత వ్యక్తి జాడ తెలియకుండా కాలగర్భంలో కలిసిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.

03/01/2019 - 22:05

పుల్వామా వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో మన సాయుధులు 40 మంది చనిపోవడంతో మొత్తం దేశ ప్రజలు తీవ్రమైన ఆగ్రహనికి, ఉద్విక్తకు గురికాగా, 12 రోజుల తర్వాత మన వాయుసేన సరిహద్దు దాటి పాకిస్థాన్ ఆధీనంలో ఉన్న భూభాగంలో గల ఉగ్రవాద శిక్షణ కేంద్రాన్ని విధ్వంసం చేసి, పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైష్ కు చావు దెబ్బకొట్టారు.

02/28/2019 - 01:27

ఆధునిక కాలంలో జరిగిన పలు ఆవిష్కరణలకు అసలు మూలాలు భారతీయ శాస్త్రాలలోనే ఉన్నాయని కొందరు నమ్ముతూ ప్రచారం చేస్తున్నారు. మన పూర్వీకులకు ఏమీ తెలియదని ఎవరూ చెప్పడం లేదు. ప్రాచీన భారతీయులు ఖగోళ, గణిత శాస్త్రంలో కొంత ప్రగతిని సాధించిన మాట వాస్తవమే. ఆధునిక శాస్తవ్రేత్తలు ధృవీకరించక ముందే మనం ధ్యానం, యోగాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకొనే ప్రయత్నం చేశాం.

02/27/2019 - 04:00

విశాఖ రైల్వే జోన్ ఆంధ్రుల హక్కు. దశాబ్దాల కల. జోన్ ఏర్పాటు కేవలం ఉత్రరాంధ్ర ప్రజల డిమాండ్ మాత్రమే కాదు.. 5 కోట్ల ఆంధ్రుల అభీష్టం. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం భర్తీలో భాగంగా చేసిన చట్టంలో, ఇచ్చిన హామీలలో ఒకటి రైల్వే జోన్ ఏర్పాటు.

02/26/2019 - 04:43

కొన్ని ఒడిదుడుకులు వున్నప్పటికీ ఇండియా జాతీయ ఆదాయ పెరుగుదల నిలకడగా, సంతృప్తికర స్థాయిలో వుందనవచ్చు. దేశాభివృద్ధికి స్పష్టమైన సూచి మానవాభివృద్ధే. వెనుకబడిన కొన్ని ఆఫ్రికా దేశాలకన్నా విద్య, వైద్యరంగాల్లో ఇండియా దిగువనే వుండటం విచారకరం. ఉప ఖండంలోని పొరుగు పేద దేశాలు కూడా మనకన్నా మానవాభివృద్ధిలో ముందున్నాయి.

02/23/2019 - 21:51

2019 ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 3.15 గంటలకు జమ్మూనుండి శ్రీనగర్ వెళ్తూ పుల్వామా ప్రాంతం జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ‘సి.ఆర్.పి.ఎఫ్’ ట్రక్కులపై పాకిస్తాన్ తీవ్రవాది హఫీస్ సయ్యద్ ద్వారా శిక్షణ పొందిన కాశ్మీర్ యువకుడు ఆత్మాహుతికి సిద్ధపడి ‘‘200 కిలోల ఆర్‌డిఎక్స్’’ గల వాహనం ద్వారా దాడి చేయడంవల్ల దేశభక్తులైన దేశరక్షకులు 40 మంది జవానులు బలయ్యారు. అనేకమంది జవానులు క్షతగాత్రులైనారు.

02/23/2019 - 01:13

మనిషి, తన అనుభవాలనూ, ఆలోచనలనూ, ఆశలనూ వ్యక్తీకరించేది భాష. ఇంకోరకంగా చెప్పాలంటే మానవుడు సాధించిన జ్ఞానం అంతా నిక్షిప్తమై ఉండేది భాష. చరిత్ర అయినా, సామాజిక శాస్త్రం అయినా, సైన్స్ అయినా, సాహిత్యమైనా, తత్వశాస్తమ్రైనా- ఏదో ఒక భాషలో వ్యక్తీకరించబడాలి, నిక్షిప్తం కావాలి, భవిష్యత్తుకు దీపం కావాలి. వీటితో నేరుగా సంబంధమున్న వ్యక్తులు తమ మాతృభాషలో చెబితే అది మరింత సమగ్రంగా, శక్తిమంతంగా ఉంటుంది.

02/23/2019 - 01:12

రాబోయే పార్లమెంట్ కాంగ్రెసేతర బీజేపీయేతర పక్షాన్ని అధికారంలోకి తీసుకురావడానికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ యాత్ర చేపట్టడం వర్తమాన రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. 17 సీట్లు కలిగిన తెలంగాణ రాష్ట్రం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం సాధ్యమవుతుందా? కేసీఆర్ వ్యూహమేమిటి? కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం సాధించడంలో ఆయన సఫలీకృతులవుతారా?

Pages