S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

01/08/2019 - 01:10

దారి తెలియని అజ్ఞానం కన్నా దారితప్పిన విజ్ఞానమే ఎక్కువ నష్టం కలిగిస్తుంది. సమాజంలో అసలైన విజ్ఞానం, శాస్ర్తియ దృక్పథం పెరిగేలా విస్తృత కృషి జరగాలి. విద్యాధికులు అందుకు ముందుండాలి. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాళ్లు మరింత శ్రద్ధగా ఆ పని చేయాలి. ఇప్పటికే మూఢ నమ్మకాలతో దిగజారుతున్న మన సమాజానికి మరిన్ని మూఢ నమ్మకాల్ని పరిచయంచేస్తూ ఇంకా గందరగోళ పర్చరాదు.

12/28/2018 - 00:47

దేశవ్యాప్తంగా అన్నదాతలు తరచూ రోడ్డెక్కడం బాధాకరం. గత రెండేళ్లుగా పంటలకు గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఆందోళనలకు దిగుతున్నా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. గత నెలలో వేలాది మంది రైతులు తమ డిమాండ్ల సాధనకు కిసాన్ ముక్తిమోర్చా పేరిట ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించినా, వారి సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైంది. నానాటికీ పెరుగుతున్న రుణభారంతో రైతు కుదేలైపోతున్నాడు.

12/25/2018 - 01:47

దేశములోని ప్రతిపక్ష ఐక్యకూటమి కేవలం అధికారం కోసమే గాని, దేశ భవిష్యత్తుకు మాత్రం గాదనేది నూటికి నూరు శాతము వాస్తవము. దేశంకోసం నిరంతరం శ్రమించే భారతీయ జనతాపార్టీని గద్దె దించాలనే మహాకూటమి దేశానికి కీడు తలపెట్టినదనేది నిజము. ఈ దేశము ఐక్యంగా వుండటము వారికి ఇష్టంలేదు. ప్రతి రాజకీయ వేత్తకు అధికారము కావాలి, ఆ తర్వాత సంపాయించుకోవాలి. రాజకీయ నాయకుల ఆస్తులు ఎలా పెరిగిపోయాయో విచారణ చేస్తే బయట పడతాయి.

12/21/2018 - 01:12

నేడు సమాజంలో నెలకొన్న అనేకానేక సమస్యలకు పుస్తక పఠనం అలవాటు లోపించడం ఒక కారణంగా పేర్కొనవచ్చు. పుస్తక పఠనం వల్ల ఎవరైనా ప్రశాంతమైన మనస్సుతో తమ జీవితం గురించి లోతుగా ఆలోచించి, తమ సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను ఎంచుకొనేవారిగా తయారవుతారు. మెదడు పనిచేసే తీరు గ్రంథ పఠనం వల్ల మెరుగవుతుంది. తమ పనులను చురుగ్గా చేసుకోగలుగుతారు. రోజుకు కనీసం అరగంట సేపు పుస్తక పఠనం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.

12/20/2018 - 01:51

ఏటా వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టే సందర్భంగా దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు భారీగా ఫీజులు చెల్లించాల్సి రావడం దారుణం. ముఖ్యంగా ఈ ఫీజులు ఓసీ, ఓబీసీ వర్గాల నిరుద్యోగులకు భారంగా పరిణమిస్తున్నాయి. ఓసీ, ఓబీసీ కేటగిరీలకు చెందిన వారంతా ధనవంతులు కారు. వీరు బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటేనే ఇప్పుడు భయపడుతున్నారు.

12/18/2018 - 01:56

వివాదాస్పదమైన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తరువాత సహజంగా కేంద్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆ అంశం పాలక బీజేపీని ప్రజలముందు దోషిగా నిలబెట్టే రాజకీయ ఆయుధంగా తయారైంది.

12/14/2018 - 22:42

ప్రతి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీతో పోటీ పడాలనేమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల వింత వింత నిర్ణయాలను తీసుకుంటున్నారు. గుజరాత్‌లో ‘ఉక్కుమనిషి’ సర్దార్ వల్లభభాయి పటేల్ భారీ విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి ప్రపంచ రికార్డును మోదీ నెలకొల్పారు. అదే తరహాలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించడం విస్మయం కలిగిస్తోంది.

12/14/2018 - 02:19

తెలంగాణ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెరాస అధినేత కేసీఆర్ తాను చంద్రబాబుకు ‘రిటర్న్ గిఫ్ట్’ ఇస్తాననడం ఏ రకంగా చూసినా మంచిదే. ముందస్తు ఎన్నికలకు వెళ్లి భారీ మెజారిటీతో మరోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కేసీఆర్ ఇప్పుడు ‘అప్‌డేటెట్ వెర్షన్’లా కనిపిస్తున్నారు. ‘రోబో’ సినిమా కన్నా ‘రోబో 2.0’పై సహజంగా అంచనాలు ఎక్కువ.

12/13/2018 - 03:53

కష్టకాలంలో రైతులకు అండగా ఉండాల్సిన పంటల బీమా పథకం (ఫసల్ బీమా) కార్పొరేట్ కంపెనీలకు కాసులు కురిపిస్తోందంటూ, ఈ పథకం ద్వారా లక్షల కోట్ల విలువైన ప్రజాధనం ఖర్చవుతున్నా వాస్తవానికి ప్రజలకు, రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదంటూ ‘కాగ్’ ఇటీవల తన నివేదికలో పేర్కొనడం ఆందోళనకర పరిణామం.

12/08/2018 - 00:12

పరిపూర్ణానంద స్వామి సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసి. అందరూ వదిలిపెట్టిన వాడిని ‘సన్నాసి’ అని, అందర్ని, అన్నింటిని వదలిపెట్టిన వాడిని ‘సన్యాసి’ అనడం లోకోక్తి. సన్యసించినవారు ఏ ప్రలోభాలకు ప్రాకులాడరు. లోకహితం కోసం, మంచిమార్గంలో ప్రజలు నడచుకునేలా తమ ప్రవచనాల ద్వారా దేశభక్తిని, జాతీయతను స్వామీజీలు నూరిపోయాలి. ఈ సత్ సంప్రదాయాన్ని గతంలో ఎంతోమంది సాధుపుంగవులు ఆచరించారు.

Pages