S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

11/15/2019 - 01:28

అయోధ్యలోని మందిర్-మసీదు వివాదంపై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు దశాబ్దాల సమస్యకు శాశ్వత ముగింపు పలికే విధంగానే ఉంది. అయోధ్యలో శ్రీరాముడి పుట్టుకపై, బాబర్ కట్టడంపై వాదనలు ఎలా ఉన్నా, అయోధ్య హిందువులకు పవిత్రమైనదిగా అందరూ అంగీకరిస్తారు. శ్రీరాముడిని నమ్మేవారైనా, నమ్మనివారైనా తమ బిడ్డలు అలా ఆదర్శంగా ఉండాలనుకుంటారు. ఇక, పురావస్తు శాఖ పురాతన కట్టడంపై మసీదు నిర్మించినట్లు తన అధ్యయనంలో తేల్చింది.

11/10/2019 - 00:23

అయోధ్యలోని రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై దేశ ప్రజలంతా దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కీలక తీర్పును సర్వోన్నత న్యాయస్థానం ఏకగ్రీవంగా వెలువరించడం శుభపరిణామంగా భావించాలి. సుప్రీం తీర్పును అన్ని వర్గాల వారూ గౌరవించాలి. మతం పేరిట విద్వేషాలను రెచ్చగొట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రజలందరూ శాంతియుతంగా సంయమనంతో ఉండాల్సిన తరుణం ఇది.

11/08/2019 - 01:52

మహిళలు నేడు అన్ని రంగాలలో చొచ్చుకొని వెళ్తున్నారు. మహిళలకు సాధికారత అంటూ ఒకవైపుపాలకులు, పౌర సమాజం మహిళల గురించి ప్రశంసిస్తూనే.. మరొకవైపు వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా భావిస్తున్నారు. మహిళలపై కొందరు అమానుషంగా దురాగతాలకు పాల్పడడం చూస్తుంటే నేటి సమాజం ఎటువైపు పోతున్నదో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

11/05/2019 - 22:32

‘రీజినల్ కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్’ ఒప్పందం విషయమై భారత్ వ్యతిరేకించడం, వైదొలగడం సరైన చర్య. 16 ఆసియా పసిఫిక్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యాన్ని నెలకొల్పేదిశగా 2013 నుండి ప్రతిపాదనల్లో వున్న ఒప్పందం ఖరారైతే భారత్ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ రీతిలో ఉండేది. ప్రపంచ జనాభాలో సగం మంది నివసిస్తున్న ఈ దేశాల గ్రూపులో ప్రపంచ వాణిజ్యం మొత్తంలో 40 శాతం నడుస్తూ వుంది.

11/01/2019 - 21:12

నోరూరించే వివిధ రకాల పండ్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. వేసవిలో మామిడి, మిగతా సీజన్లలో తర్బూజ, బొప్పాయి, అరటిపండ్లు బంగారు వర్ణంలో మన కళ్లు చెదిరేలా మెరిసిపోతుంటాయ. లేత నారింజ, ఎరుపు రంగుల సమ్మేళనంతో సపోటా ఎంతో ఇంపుగా కనిపిస్తుంది. యాపిల్ పండు చీకటిలో పెట్టెనా ఎరుపు రంగుతో వెలిగిపోతుంది. పండ్లు ప్రతినిత్యం తింటే ఆరోగ్యకరం అంటున్నారు వైద్యులు. అలాగని తియ్యతియ్యని పండ్లు తినేద్దామనుకుంటున్నారా?

10/25/2019 - 21:20

కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు కరవుభత్యం పెంచిన ప్రతిసారీ రాష్ట్ర ప్రభుత్వం కూడ తమ ఉద్యోగులకు, లక్షలాది మంది పెన్షనర్లకు కూడ దాన్ని పెంచే ఆనవాయితీ కొనసాగుతూ వున్నది. గత ప్రభుత్వం పదకొండవ వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) అమలులోకి వచ్చేదాక తాత్కాలిక భృతిని 20 శాతంగా ప్రకటించి, ఆ మేరకు జీతాలు, పెన్షన్లు ఇచ్చారు. జనవరి 2018కి సంబంధించి డీఏ సైతం ఇచ్చారు. జూలై 2018 నుంచి ఇవ్వవలసిన డీఏ ఆగిపోయింది.

10/24/2019 - 01:37

నేడు మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు ప్రజాసమస్యలపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి. అధికారంలో ఉన్నపుడు కార్మికుల, ఉద్యోగుల సమ్మెలను వ్యతిరేకించటం, అధికారం లేనిచోట బేషరతు మద్దతులు పలకటం పరిపాటిగా మారింది. ప్రజాప్రయోజనాలకంటే రాజకీయ ప్రయోజనాలే నేతలకు ప్రాధాన్యంగా కనిపిస్తున్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కింది తరగతి ఉద్యోగుల పరిస్థితి దారుణంగా వుండేది.

10/18/2019 - 21:25

‘ప్రపంచ ఆకలి సూచీ’ ప్రకారం మన దేశం 112 దేశాల్లో 102వ స్థానంలో ఉంది. పిల్లల ఎదుగుదల, పౌష్టికాహార లభ్యత, శిశుమరణాల రేటు ప్రాతిపదికన ఈ ర్యాంకింగ్‌లను ఏటా ఇస్తున్నారు. ఐదేళ్ల లోపు బాలలు వయసుకుతగ్గ బరువు లేకపోవడం, వయసుకు తగ్గ ఎత్తుకి ఎదగక పోవడం లాంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం కూడా మన దేశంలో బాలల ఆరోగ్యం తీసికట్టుగానే ఉంది.

10/18/2019 - 01:21

ప్రభుత్వ బడులలో చదివే పిల్లలకు విద్యాసంవత్సరం మొదలై 5 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ రెండు జతల ఉచిత యూనిఫామ్ (ఏకరూప దుస్తులు) రాకపోవడం పట్ల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దయనీయ స్థితిలో ఉన్న ప్రభుత్వ బడులలో బడుగు, బలహీనవర్గాల పిల్లలే ఎక్కువగా చదువుతున్నారు.

10/15/2019 - 00:05

లాంచీలను పరిశీలించకుండా పర్యాటక శాఖ అధికారులు అనుమతులు ఇవ్వడంతో నదుల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వరద హెచ్చరికలను లెక్కచేయకుండా ధనార్జనే ధ్యేయంతో లాంచీలను నడపటంతో ఇటీవల పాపికొండల యాత్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఎప్పుడూ వెళ్ళే దారిలో కాకుండా వేరే మార్గంలో గోదావరిలో బోటు నడపడం వల్ల ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయి.

Pages