S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

04/30/2019 - 01:21

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వోటర్లు డబ్బులివ్వాలని డిమాండ్ చేశారని, కొన్ని చోట్ల అభ్యర్థులు రూ. ఏభై కోట్ల వరకూ ఖర్చు చేశారని మాజీ మంత్రి జేసీ దివాకర రెడ్డి ఆందోళన చెందారు. కానీ, తప్పంతా వోటర్లదే కాదు. రాజకీయ పార్టీలు ‘గెలుపు గుర్రాల’ పేరిట సంపన్నులకే టిక్కెట్లు ఇస్తున్నందున వారు పోటాపోటీగా డబ్బు ఖర్చు చేస్తున్నారు.

04/26/2019 - 22:20

ఏటా వేసవిలో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి సమస్య తీవ్రతరం అవుతోంది. వర్షాభావ పరిస్థితులతో అన్ని ప్రాంతాల్లోనూ నీటికొరత అనివార్యమైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికీ తాగునీటిని అందివ్వడానికి ప్రతిష్టాత్మకంగా ‘మిషన్ భగీరథ’ కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ పనులు పూర్తికాక- ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. ముఖ్యంగా గ్రామీణ మహిళలు మంచినీటిని సుదూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

04/26/2019 - 02:04

పరీక్షా ఫలితాల్ని కంగాళీ చేసి, ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ఆటాడుకున్న విద్యాశాఖ, సంబంధిత బోర్డు, తెలంగాణ ప్రభుత్వం తమ బాధ్యతల్లో తీవ్ర వైఫల్యం చెందాయి. పదవుల్లో ఉన్నవాళ్లు ఒక బాధ్యతని ఎలా నిర్వహించకూడదో, తేలిగ్గా తీసుకోకూడదో చెప్పడానికి పాఠంలా పనికొస్తుంది వీటి నిర్వాకం. పరీక్షా ఫలితాలు ప్రకటించిన వెంటనే తీవ్ర లోపాలు బయటపడ్డాయి.

04/25/2019 - 01:33

అగ్రరాజ్యం అమెరికా తాజాగా తాఖీదు ఇచ్చింది. ఇరాన్ నుండి ముడి చమురు దిగుమతుల్ని భారత్ పూర్తిగా రద్దుచేసుకోవాలని లేదంటే తాము విధించే ఆంక్షలకు సిద్ధపడాలన్నది ఆ తాఖీదు సారాంశం. ఇరాన్‌తో అణుఒప్పందం విషయంలో ఏకపక్షంగా వైదొలిగిన తర్వాత అమెరికా ఆ దేశంతో అన్ని దేశాలూ వ్యాపార లావాదేవీలు మానుకోవాలని గతంలోనే హుకుం జారీచేసింది. మన దేశం సహా ఎనిమిది దేశాలకు ఆ హుకుం నుండి ఆరు మాసాల మినహాయింపు వచ్చింది.

04/24/2019 - 01:56

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడుల్లో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోవడం, 500 మంది తీవ్ర గాయాల పాలవ్వడం అత్యంత విషాదకరం. ఈస్టర్ రోజున చర్చిలను, విదేశీ పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని పలుచోట్ల మారణకాండకి పాల్పడడం ద్వారా తీవ్రవాదులు తమ విష వ్యూహాన్ని అమలు చెయ్యగలగడం నాగరిక ప్రపంచానికే అవమానం.

04/19/2019 - 02:05

2016లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించిన పెద్దనోట్ల రద్దు పథకం ఉన్న ఉద్యోగాల్ని ఊడబెరికి, దేశ ఆర్థిక వ్యవస్థపై మెరుపుదాడిగా తయారైంది. ఆ అర్ధరాత్రి ఆయన వేసిన బాంబు- ప్రకటిత లక్ష్యాలైన నల్లధనం అరికట్టడం, నకిలీ నోట్లు ఆపడం లాంటి వాటికి ఆమడ దూరంలో పడి సజావుగా నడుస్తున్న ఆర్థిక రంగాన్ని మాత్రం విచ్ఛిన్నం చేసింది.

04/12/2019 - 04:43

ఒక పార్టీలో టిక్కెట్టు దక్కని వారు రాజకీయ సిద్ధాంతాలకు, నైతిక విలువలకు తిలోదకాలిచ్చి పార్టీ ఫిరాయించడం, స్వప్రయోజనాల కోసం కండువాలు మార్చేయడం ప్రస్తుత ఎన్నికల్లో చూశాం. ఈ పరిణామాలు రాజకీయాలు ఎంత నీచానికి దిగజారాయో చెప్పకనే చెబుతున్నాయి. ఫిరాయింపుల నిషేధ చట్టం ఉన్నా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. కుల సమీకరణలు, ధనం, నేరచరిత్ర ఉందు విలువలు వెలవెలపోవడం దురదృష్టం.

04/07/2019 - 02:10

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 600 భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయని, గత 60 ఏళ్లలో 250కి పైగా భాషలు అదృశ్యమయ్యాయని నిపుణులు అంచనా వేశారు. ఒక భాష కనుమరుగైతే ఆ ప్రాంత సంస్కృతి కూడా అదృశ్యం అవుతుంది. ఏ ప్రాంతం వారైనా భాషాపరమైన వారసత్వాన్ని పరిరక్షించుకోవాల్సి ఉంది. సాంస్కృతిక వారసత్వ సంపద, మన భాషలను కాపాడడం రాజ్యాంగబద్ధమైన విధి.

04/05/2019 - 01:41

మంచి వ్యక్తిత్వం ఉన్నవారు, సచ్ఛీలురు, ప్రజాసంక్షేమమే పరమావధిగా పనిచేసే సమర్ధవంతమైన నాయకులు ఉన్నత పదవుల్లో వుంటేనే రాజ్యాంగ వ్యవస్థలు సజావుగా పనిచేసి దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నది మన రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్ష. కానీ, నేడు దేశంలో ఆ స్ఫూర్తి కొరవడుతోందని పలువురు రాజ్యాంగ నిపుణులు, సామాజిక విశే్లషకులు వాపోతున్నారు.

04/02/2019 - 02:59

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేస్తున్న రాజకీయ పార్టీల తీరు ప్రజలను అయోమయానికి గురిచేయడమే కాకుండా, ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేయించవలసిన ఈ తరుణంలో నిరంకుశత్వం వైపు సాగనంపుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేస్తున్నారు. ఎందుకంటే ఎంత అనుభవించినా తనివితీరని అధికార దాహం ఒకవైపుగా, మహాపాతకాలకు దారితీసే క్రోధం ఇంకోవైపూ, ఎలాగైనా గెలుపే ముఖ్యం అనే తలంపు ఆయా రాజకీయ పార్టీలలో చోటుచేసుకొంది.

Pages