ఉత్తరాయణం

మోడల్ స్కూళ్లపై వైఖరి ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లోని మోడల్ హైస్కూళ్ల ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బంది సమస్యలు ప్రభుత్వ స్థాయిలో మాత్రమే పరిష్కారం అవుతాయి. సర్వీస్ నిబంధనలు, కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారి న్యాయమైన కోర్కెలను కొత్త ప్రభుత్వమైనా పరిశీలించాలి. ప్రతి మండలంలో మోడల్ హైస్కూళ్లను ఏర్పాటు చేయాలనుకొన్నా, 164 మండలాలకు మాత్రమే ఇవి పరిమితమయ్యాయి. వీటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొనడం, రెగ్యులర్ ఉపాధ్యాయుల సర్వీస్, జీతాలు తదితర అంశాలపై శాసనమండలి సభ్యులు, విద్యాశాఖ అధికారులతో కమిటీ వేసినప్పటికీ గత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. ఎమ్మెల్సీ కమిటీ సిఫార్సులకు విలువ లేకుండా పోయింది. ఆరేళ్ల సర్వీస్ పూర్తిచేసినప్పటికీ టీచర్లకు తగిన ఆర్థిక ప్రయోజనాలు అందడం లేదు. వేతన సవరణ మొదలు అన్ని అంశాలలో వీరు వివక్ష ఎదుర్కొంటున్నారు. నూతన ముఖ్యమంత్రి ఈ సమస్యలపై దృష్టి సారించాలి. పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ మోడల్ స్కూల్ టీచర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి.
-బి.సురేష్, శ్రీకాకుళం