S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

11/18/2018 - 00:41

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీబీఐపై తమకు ఎలాంటి విశ్వాసం లేదని ప్రకటిస్తూ, తమ రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తులకు రాష్ట్ర అనుమతిని రద్దు చేయడం సంచలన నిర్ణయం. ఈ మేరకు అధికారికంగా ప్రభుత్వ ఆదేశం వెలువడింది. సీబీఐపై ఎవరైనా విశ్వాసం కోల్పోవడంలో వింత చెందాల్సింది ఏమీలేకున్నా, దాని ముందరికాళ్లకు బంధాలు వేయాలని భావించడం మాత్రం తీవ్ర నిర్ణయమే.

11/16/2018 - 00:14

విఖ్యాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన ప్రయోగాల్లో ‘బాహుబలి’ లాంటి భారీ జియో స్టేషనరీ ఉపగ్రహ వాహక ప్రయోగాన్ని పూనుకొన్న సమయంలోనే ‘గజ’ తుపాను అక్కడికి దగ్గరలోనే తీరం దాటుతుందని మొదట ఆందోళన నెలకొంది. అయితే, ‘బాహుబలి’ని చూసి గజరాజు గజ గజలాడినట్టుగానే గజ తుఫాన్ కూడా గబగబా దిశ మార్చుకున్నట్టుంది. భారత్ సంకల్పానికి ఆ విధంగా ప్రకృతి కూడా తన వంతు పూర్తి మద్దతు తెలిపినట్టయింది.

11/15/2018 - 00:56

అయోధ్యలో రామమందిరం నిర్మిస్తే అది సర్వమత సయోధ్యకు నిదర్శనంగా నిలుస్తుంది. జాతి శ్రేయస్సు దృష్ట్యా రామమందిరం నిర్మించాలి, రామరాజ్యం స్థాపించాలి. అందుకు అన్ని వర్గాల వారూ తప్పక సహకరించాలి. ‘రామ్‌ధరా భారత్’గా ఈ దేశం వర్థిల్లాలి. మానవతా నియమాలే రామధర్మ సందేశం. మమతానురాగాలను పాటించాలన్నది శ్రీరాముడి ఆదేశం. అయోధ్యలో రామమందిరం జాతి జనుల ఐక్యతకు నిదర్శనం కావాలి. అందుకే ‘రామ్‌ధరా భారత్’గా మరాలి ఈ దేశం.

11/13/2018 - 00:25

చాలాకాలంగా ఏపీ రాష్ట్ర రాజకీయాలకు పరిమితమైన ‘చంద్రుడు’ కక్ష్యను దాటి జాతీయ కక్ష్యలోకి ప్రవేశించి పరిభ్రమణం చేయసాగాడు. గతంలో యునైటెడ్ ఫ్రంట్, వాజపేయి సారథ్యంలోని ఎన్డీయే రోజుల్ని తలచుకొంటూ, తలపిస్తూ వేగంగా కదులుతూ వివిధ గ్రహాల్ని తాకుతూ ‘చంద్రయానం’ కొనసాగుతోంది.

11/10/2018 - 00:56

కర్నాటక శాసనసభ ఎన్నికల తర్వాతనైనా బీజేపీ ఆత్మవిమర్శ చేసుకోలేదు. అందుకే అక్కడ తాజా ఉపఎన్నికల్లోనూ ఆ పార్టీని ఓటమి వెంటాడింది. ప్రతిపక్షాల అనైక్యతే తమ బలంగా భాజపా భావిస్తున్నది కాని, ప్రజాబలం పెరిగేలా చర్యలు శూన్యం. ప్రధాని నరేంద్ర మోదీ తాను నిజాయితీపరుడినని, తనకు ప్రత్యామ్నాయ నేత లేడని భావించవచ్చు గాని, నిజమైన ప్రతిపక్షం- సామాన్య ప్రజలే.

11/04/2018 - 02:32

మున్సిపాలిటీల్లో పాలనను మెరుగుపరచేందుకు ఏపీ ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. గతంలో సాధారణ ఎన్నికలు ప్రకటించాక ఆపద్ధర్మ ప్రభుత్వాలు కొంత ఉదాశీనత వహించేవి. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లు గడచినా పౌర సేవలు సక్రమంగా అందటం లేదు. గుర్రం గుడ్డిదైనా దాణాకు లోటులేదన్న సామెతలా మున్సిపాలిటీలు పన్నులను మాత్రం వడ్డీ సహా ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి.

11/03/2018 - 00:24

ప్రైవేట్ టీవీ చానళ్లు లేని రోజుల్లో పరిమితమైన ప్రసారాలతో ప్రభుత్వ టీవీ ‘దూరదర్శన్’ వచ్చేది. ఒకటో, రెండో ధారావాహికలు, భారతీయ భాషలలోని ఏదైనా ఒక చలనచిత్రం వారానికి ఒకరోజు. ఒక రోజు పిల్లల కోసం కార్టూన్ షో వంటివి అలరించేవి. ఇలా పరిమిత ప్రసారాలను అందించే టీవీని ‘ఇడియట్స్ బాక్స్’అని ఎగతాళి చేసేవారు.

11/02/2018 - 00:23

నోరూరించే వివిధ రకాల పండ్లు మార్కెట్‌లోకి నేడు వస్తున్నాయి. త ర్బూజ, బొప్పాయి, అరటి పండ్లు బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాయి. రంగుల మేళవింపుతో సపోటా ఇంపుగా కనిపిస్తుంది. ఆపిల్ పండు చీకట్లోనైనా ఎరుపు రంగుతో వెలిగిపోతుంది. ఆయా సీజన్లలో లభించే పండ్లను తరచూ తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే, నిగనిగలాడే పండ్లను తినేముందు ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

10/30/2018 - 04:10

నేడు విద్యారంగానికీ నకిలీల బెడద వ్యాపించడం సిగ్గుచేటు. ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన మన దేశానికి సైతం ఈ వైపరీత్యం సోకడం ఎంతో బాధాకరం. నేటి చదువుల్లో డొల్లతనం- విద్యాప్రమాణాలు దిగజారిపోవడానికి, పాలకుల వైఫల్యానికి దర్పణం. ఎంతో విలువైన డిగ్రీ సర్ట్ఫికెట్లను చిత్తుకాగితాల లెక్కన అమ్మి సొమ్ముచేసుకోవడం, అత్యున్నత విద్యాలయాల్లో సైతం ఈ దందా నిరాఘాటంగా సాగడం వ్యవస్థలోని లొసుగులను చెప్పకనే చెబుతోంది.

10/27/2018 - 01:04

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థగా పేరుగాంచిన సీబీఐ విశ్వసనీయత గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అట్టడుగుకి చేరినట్టే. మరీ వేలెత్తి చూపలేని విధంగా ఆ సంస్థ పనితీరు ఎప్పుడూ లేదు. కానీ కాస్త పరువుమాత్రం ఉండేది. రాష్ట్రాల్లో పోలీసులు ఛేదించలేని కేసుల్లో అంతా సీబీఐ వైపు చూసేవారు.

Pages