ఉత్తరాయణం

నిగనిగల వెనుక.. విషం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోరూరించే వివిధ రకాల పండ్లు మార్కెట్‌లోకి నేడు వస్తున్నాయి. త ర్బూజ, బొప్పాయి, అరటి పండ్లు బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాయి. రంగుల మేళవింపుతో సపోటా ఇంపుగా కనిపిస్తుంది. ఆపిల్ పండు చీకట్లోనైనా ఎరుపు రంగుతో వెలిగిపోతుంది. ఆయా సీజన్లలో లభించే పండ్లను తరచూ తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే, నిగనిగలాడే పండ్లను తినేముందు ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంటికి కనిపించేదంతా నిజం కాదని మిలమిలలాడే పండ్లు మనల్ని హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న పండ్లన్నీ రసాయనాలతో మాగబెట్టినవే. ప్రత్యామ్నాయం లేక.. తప్పనిసరి పరిస్థితులలో వాటిని మనం కొంటున్నాం. ద్రాక్ష, అరటి, ఆపిల్, బొప్పాయి, మామిడి, జామ.. ఇలా ప్రతి పండునూ రసాయనాలతో మాగబెడుతున్నారు. సీజన్ కాకపోయినప్పటికీ తర్బూజా, మామిడి పండ్లను విక్రయిస్తున్నారు. వ్యాపారులు లాభార్జన కోసం ప్రమాదకరమైన పద్ధతులను పాటిస్తున్నారు. బొప్పాయి, అరటి గెలలకు ఇథనాల్ లిక్విడ్, కార్బోహైడ్రేడ్ మందును విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈ పండ్లను తింటే క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు సంభవిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. వైద్యుల సూచన మేరకు- మార్కెట్‌లో దొరికే పండ్లను తొక్కతీసి తినడం ఆరోగ్యకరం అన్న ప్రచారం జరుగుతోంది. వీటిని ఉప్పునీటితో కడిగి మరీ తినమంటున్నారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ విరివిగా దొరికే అరటి పండ్లు అశాస్ర్తియంగా పండుతున్నవే. కార్బోహైడ్రేడ్ పొగను వేయడం, గెలలను ఇథనాల్ లిక్విడ్‌లో ముంచి తీయడం, పౌడర్‌ను చల్లడం వంటి పద్ధతులతో అరటిని మాగబెడుతున్నారు. బొప్పాయిని కూడా ఇదే విధానంలో పండబెడుతున్నారు. కాయ మొత్తం ఒకేసారి పసుపురంగు వచ్చిందంటే అది కార్బోహైడ్రేడ్ ద్వారా పండిందేనని గుర్తుపట్టవచ్చు. తెలుగు రాష్ట్రాలకు ఆపిల్స్ ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి అవుతున్నాయి. వాటిని వ్యాపారులు తైలంతో కడిగి, స్టిక్కర్లు వేస్తున్నారు. ఆ ఆపిల్స్ ఆకర్షణీయంగా ఉండడంతో ధర ఎంతైనా సరే కొనాలనిపిస్తుంది. మన దేశంలో ఆపిల్ పండ్లకు పై పొరపై మైనం పూస్తున్నారని అధికారులు చెబుతున్నారు. చిన్న పట్టణాల్లో, నగరాల్లో ఎక్కడ చూసినా పండ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. రహదారుల వెంబడి స్టాళ్లను ఏర్పాటుచేసి వీటిని విక్రయిస్తున్నారు. మరోవైపు పండ్ల ధరల విషయంలో ఎలాంటి నియంత్రణ లేదు. పండ్లు అమ్మేవారు చెప్పిందే వేదం. రసాయనాల వాడకం, అధిక ధరలకు సంబంధించి అధికారులు ఎలాంటి దాడులు చేయడం లేదు. పండ్లు తింటే ఆరోగ్యం బాగుపడుతుందంటే, అంతకన్నా ఎక్కువ రోగాలు రావడం తథ్యం అనిపిస్తుంది. ప్రజలలో అవగాహన లేదు. స్వచ్ఛంద సంస్థలు, మేధావులైనా స్పందించి ఈ విషయమై సమాజంలో చైతన్యం తీసుకురావాలి. పండ్ల వ్యాపారుల ఆగడాలపై నిఘావేసి వారిని చట్టపరంగా శిక్షించాలి.

--కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట