ఉత్తరాయణం

ఏపీకి మరోసారి మొండిచెయ్యి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్యే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మరోసారి మన రాష్ట్ర అభివృద్ధికి చెప్పుకోదగ్గ రీతిలో ఏ మాత్రం నిధులు కేటాయించకుండా మరోసారి మొండి చెయ్యి చూపించి మన రాష్ట్ర ప్రజానీకాన్ని తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసింది. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించక పోవడం, మరోవైపు జిల్లాల అభివృద్ధికి గతంలో 50 కోట్లు కేటాయించిన ప్రభుత్వం గత రెండేళ్లుగా వాటి ఊసెత్తక పోవడం, ఎయిర్‌పోర్ట్, రైల్వేల అభివృద్ధికి ఏమాత్రం బడ్జెట్‌లో ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వెరసి యధారాజా తదాప్రజా అన్నట్లుగా మరోసారి నిధుల కేటాయింపు విషయంలో మన రాష్ట్రాన్ని నట్టేట ముంచివేసింది ఈ కేంద్ర ప్రభుత్వం అనడంలో ఎలాంటి అవాస్తవం లేదు. ఇక ఈసారి బడ్జెట్‌లో సైతం షరామామూలే అన్న విధంగా కార్పొరేట్ శక్తులకు లాభం చేకూరేలా రెడ్ కార్పెట్ పరచడం, మరోవైపు భారీ పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేలా బడ్జెట్ ఉండాల్సిందిపోయి, ఉన్న నిరుద్యోగ సమస్యను మరింత పెంచేలా బడ్జెట్ వుండటం తీవ్ర అసంతృప్తిని కలిగించే విషయం. ఇంకా చెప్పుకుంటూపోతే ట్రిపుల్ ఐటీడీఎం, రక్షణశాఖ కేంద్రం ఏర్పాటు వంటి వాటిపట్ల తీవ్ర నిర్లక్ష్యం చేసింది కేంద్రం పొందుపరిచిన ఈ బడ్జెట్. ఇక కొద్దోగొప్పో గుడ్డిలోమెల్ల అన్నట్లు వ్యవసాయ, సంక్షేమ, ఆరోగ్య, ఉపాధి రంగాలకు ఒక మాదిరి ఉపయోగపడేలా ఈ బడ్జెట్ వున్న రాష్ట్రంలోని అన్ని రంగాలకు మాత్రం న్యాయం చేకూరేలా ఈ బడ్జెట్ లేదు అనేది జగమెరిగిన సత్యం. ఏది ఏమైనా ఎప్పటిలాగే మన రాష్ట్ర ప్రభుత్వం, అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు మరోసారి మన రాష్ట్ర అభివృద్ధికి నిధులు రాబట్టే విషయంలో కేంద్రం చేతిలో మరోసారి ఘోరాతిఘోరంగా మోసపోయినట్లయింది. విఫలం చెందినట్లయితే. దీన్నిబట్టి రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా మన రాష్ట్రప్రజల బ్రతుకు చిత్రం మాత్రం ఏమాత్రం మారకపోవడం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం చేసుకొన్న అత్యంత దురదృష్టకరమైన అంశంగా ముమ్మాటికీ చెప్పుకోవచ్చు.
- బుగ్గన మధుసూదనరెడ్డి, బేతంచెర్ల, కర్నూలు జిల్లా.