ఉత్తరాయణం

తెలంగాణపై రైల్వేశాఖ సవతి తల్లి ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణా రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయడంలోను, ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులకు పనులు వేగవంతం అయ్యేందుకు తగిన నిధులు ప్రణాళికాబద్ధంగా విడుదల చేయడంలోనూ కేంద్ర ప్రభుత్వం బహుశా రాజకీయ అవసరాల కారణంగా తీవ్ర అలక్ష్యం ప్రదర్శిస్తోంది. కాజీపేట ఇంటెగ్రల్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బీబీనగర్-నడికుడిల మధ్య రెండో రైల్వేలైను, భద్రాచలం-ఖమ్మం- రాజమండ్రిల మధ్య కొత్త రైల్వేమార్గం, రాష్ట్రంలో 15 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ ప్రాజెక్టుల ఊసే అసలు లేదు. ఇవికాక దాదాపుగా 15 కొత్త రైళ్ళ మంజూరు, 12 వీక్లీ రైళ్ళను డైలీ సర్వీసులుగా మార్పు వంటివి సంవత్సరాలుగా పెండింగ్‌లో వున్నాయి.
దేశంలోనే అతి చౌక రవాణాసాధనం అయిన మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం (ఎంఎంటీఎస్) రెండవ దశ విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో 45 కిలోమీటర్ల పొడవున లింగంపల్లి-నాంపల్లి, సికిందరాబాద్- ఫలక్‌నుమాల మధ్య తిరిగే ఎంఎంటీఎస్ రైళ్ళలో నిత్యం 1.6 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. టికెట్ ధర తక్కువగా వుండడంవలన ఈ రైళ్ళకు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఈ నేపథ్యంలో ఈ రైళ్ళను నగరం శివార్లలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం 2014లోనే నిర్ణయించి అందుకనుగుణంగా ఏడు మార్గాలలో 84 కిలోమీటర్లమేర విస్తరణ పనులు చేపట్టేందుకు రైల్వేశాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకయ్యే మొత్తం 816 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం 544 కోట్లు, రైల్వేశాఖ 272కోట్లు భరించేలా ఒప్పందం అయిదేళ్ళక్రితమే కుదిరింది. 2019 జనవరికల్లా పనులు పూర్తిచేసి ట్రయల్ రన్ ప్రారంభించాలన్నది డిపిఏఆర్ షెడ్యూల్. అయితే 2015 సెప్టెంబరులోనే ఈ విస్తరణ పనులు లాంఛనంగా ప్రారంభమైనా పనులు నత్తనడకన నడుస్తున్నాయి. మారిన రాజకీయ సమీకరణల నేపధ్యంలో నిధులు మంజూరుచేయడంలో రైల్వేశాఖ తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికి 65 శాతం పనులు మాత్రమే పూర్తికాగా మిగతా పనులు పూర్తయ్యేందుకు మరొక సంవత్సరం పట్టవచ్చునని, ఈ ఆలస్యం కారణంగా ప్రాజెక్టువ్యయం ఎంతో పెరగవచ్చునని, ఈ పెరిగిన వ్యయాన్ని రైల్వేశాఖ భరించకపోతే, అదనపు భారం అంతిమంగా ప్రయాణికులపైన పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
- సి.సాయిప్రతాప్, హైదరాబాద్