S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/29/2016 - 08:20

ముంబయి, జనవరి 28: జనవరి నెల డెరివేటివ్స్ కాంట్రాక్ట్‌ల గడువు ముగిసన నేపథ్యంలో మదుపరులు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడంతో గత మూడు రోజులుగా లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలను చవి చూశాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ దాదాపు 23 పాయింట్లు నష్టపోయి 24,469.57 పాయింట్ల వద్ద ముగియగా, జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 13.10 పాయింట్లు నష్టపోయింది.

01/29/2016 - 08:20

న్యూఢిల్లీ, జనవరి 28: సావరిన్ గోల్డ్ బాండ్ పథకం రెండో విడత కింద ప్రభుత్వానికి దాదాపు రూ. 726 కోట్ల రూపాయల కలిగిన 2,790 కిలోల బంగారానికి ప్రభుత్వానికి దరఖాస్తులు అందాయి. ఇంతకు ముందు తొలి విడతతో పోలిస్తే ఇప్పుడు అందిన దరఖాస్తులు మూడు రెట్లు ఎక్కువ. రెండోవిడత గోల్డ్ బాండ్ పథకానికి రూ.

01/29/2016 - 08:18

న్యూఢిల్లీ, జనవరి 28: అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు గణనీయంగా తగ్గి గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి దిగిరావడంతో ముడి చమురు దిగుమతులపై మళ్లీ 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించి దాదాపు 18 వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

01/28/2016 - 16:51

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 23 పాయింట్లు నష్టపోయి 24,470 వద్ద ముగిసింది. నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 7,425 పాయింట్ల వద్ద ముగిసింది.

01/28/2016 - 07:56

న్యూఢిల్లీ, జనవరి 27: విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐ) ఈ నెలలో ఆసియా దేశాల స్టాక్ మార్కెట్ల నుంచి దాదాపు 48,000 కోట్ల రూపాయల (7 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఇందులో ఒక్క భారతీయ మార్కెట్ల నుంచి వెనక్కి వెళ్లిపోయినవే 11,000 కోట్ల రూపాయల (1.64 బిలియన్ డాలర్లు)కుపైగా ఉండటం గమనార్హం.

01/28/2016 - 07:54

న్యూఢిల్లీ, జనవరి 27: భారత తొలి యుద్ధవిమాన నౌక, ప్రతిష్ఠాత్మక ఐఎన్‌ఎస్ విక్రాంత్ నుంచి సేకరించిన లోహంతో దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ తయారుచేసిన మోటార్‌సైకిల్ అతిత్వరలో మార్కెట్‌లోకి రానుంది. వచ్చే నెల 1న ‘వి’ బ్రాండ్ పేరుతో ఈ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరిస్తోంది బజాజ్ ఆటో. ఈ మేరకు ఓ ప్రకటనలో బుధవారం బజాజ్ ఆటో స్పష్టం చేసింది.

01/28/2016 - 07:54

సింథియా(విశాఖ), జనవరి 27: విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డు (హెచ్‌ఎస్‌ఎల్) మరో కొత్త టగ్‌ను విజయవంతంగా పూర్తిచేసి నేవీకి అందజేసింది. బుధవారం షిప్‌యార్డు జనరల్ మేనేజర్ కెవి సూర్యారావు జెండా ఊపి టగ్‌ను జలప్రవేశం చేయించారు. భారత నావికాదళం అప్పగించిన మూడు టగ్‌ల్లో గతంలోనే ఒక టగ్‌ను పూర్తిచేసి అందించగా, బుధవారం మరో టగ్ ‘సహాయక్’ను అప్పగించారు.

01/28/2016 - 07:52

హైదరాబాద్, జనవరి 27: విశాఖపట్నంలోని పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోగల అలివిరా ఎనిమల్ హెల్త్ లిమిటెడ్ పరిశ్రమను తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా మూసివేయాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు ఆదేశించింది. ఈ నెల 25న అలివిరా ఎనిమల్ హెల్త్ లిమిటెడ్ ప్రాసెసింగ్ డెవలెప్‌మెంట్ ల్యాబ్ (బ్లాక్-2)లో జరిగిన అగ్నిప్రమాదంపై స్పందించిన బోర్డు విచారణ చేపట్టింది.

01/28/2016 - 07:51

హైదరాబాద్, జనవరి 27: సింగరేణి సంస్థలో పదవీ విరమణ చేసిన కార్మికులకు వైద్య సౌకర్యం కల్పించే ప్రతిపాదిత కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్‌మెంట్ మెడికల్ స్కీం (సిపిఆర్‌డి)కు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు స్వీకరించేందు గడువును ఫిబ్రవరి 20 వరకు పెంచినట్లు సింగరేణి యాజమాన్యం తెలిపింది. గత నెలలో ఈ పథకానికి దరఖాస్తు చేసేందుకు జనవరి 20 చివరి తేదీగా ప్రకటించిన యాజమాన్యం..

01/27/2016 - 07:09

న్యూఢిల్లీ, జనవరి 26: దేశ, విదేశీ ప్రతికూల పరిణామాల ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోందిప్పుడు. ఫలితంగా లక్షలాది కోట్ల రూపాయల మేర మదుపరుల సంపద ఆవిరైపోతోంది. ఈ నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నది తెలిసిందే. ముఖ్యంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ ఈ నెల ఆరంభం నుంచి ఇప్పటిదాకా 1,631.59 పాయింట్లు క్షీణించింది.

Pages