S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/29/2016 - 04:05

న్యూఢిల్లీ, ఆగస్టు 28: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవహారంలో విచారణను మరింత విస్తృతం చేస్తోంది వైట్-కాలర్ నేరాల దర్యాప్తు సంస్థ ఎస్‌ఎఫ్‌ఐఒ. ఇందులో భాగంగానే పలు బ్యాంకుల మాజీ అధిపతులను విచారిస్తోంది. ఇందులో ప్రైవేట్‌రంగ బ్యాంకులతోపాటు, ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లున్నారు.

08/29/2016 - 04:05

వాషింగ్టన్/ముంబయి, ఆగస్టు 28: సంస్కరణలతో వాణిజ్యం బలోపేతమవుతుందని, వ్యాపార నిర్వహణ సులభతరమవుతుందని అగ్రరాజ్యం అమెరికా అభిప్రాయపడింది. భారత్‌తో విదేశాలకున్న ఆర్థిక సంబంధాలు కూడా బలపడతాయంది. అమెరికా వాణిజ్య మంత్రి పెన్ని రిట్జ్‌కర్ సోమవారం నుంచి మూడు రోజులపాటు భారత్‌లో పర్యిటించనున్న క్రమంలో ఆదివారం అమెరికా పైవిధంగా స్పందించింది.

08/28/2016 - 04:38

న్యూఢిల్లీ, ఆగస్టు 27: వస్తు, సేవల పన్ను నెట్‌వర్క్ (జిఎస్‌టిఎన్)ను మరోసారి అధికార బిజెపి ఎంపి సుబ్రమణ్యన్ స్వామి లక్ష్యంగా చేసుకున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ దాడిని తీవ్రతరం చేశారు. పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాతోపాటు దేశంలోని బిజెపి పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులకు జిఎస్‌టిఎన్‌ను వ్యతిరేకిస్తూ లేఖలు రాస్తానని శనివారం తెలిపారు.

08/28/2016 - 04:38

హైదరాబాద్, ఆగస్టు 27: ప్రైవేట్‌రంగ గృహ రుణాల అగ్రగామి సంస్థ దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ఈ నెల 29వ తేదీన వెయ్యి రూపాయల ముఖ విలువ కలిగిన సెక్యూర్డ్ రీడీమబుల్ నాన్ కన్వర్టబల్ డిబెంచర్స్ (ఎన్‌సిడి)ను పబ్లిక్ ఇష్యూ కింద జారీ చేస్తోంది. ఆ సంస్థ ఎండి కపిల్ వాద్వాన్ శనివారం ప్రకటించారు. 2 వేల కోట్ల రూపాయల సైజు కలిగి ఉన్న డిబెంచర్స్‌కు 8 వేల కోట్ల రూపాయల ఓవర్ సబ్‌స్క్రిప్షన్ అవకాశం ఉంచుకున్నామన్నారు.

,
08/28/2016 - 04:37

సిరిసిల్ల, ఆగస్టు 27: ఆత్మహత్యలతో ‘ఉరిశిల్ల’గా మారిన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉపాధి మార్గాలు పెంచి ‘సిరిశాల’గా తీర్చిదిద్దాలన్న తలంపుతో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొలి టెక్స్‌టైల్ పార్కు క్రమంగా మూతకు దారితీస్తోంది.

08/28/2016 - 04:34

న్యూఢిల్లీ, ఆగస్టు 27: దేశీయ పారిశ్రామికరంగ దిగ్గజాల వారసులు వ్యాపార రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే వచ్చినవారు కొందరైతే, ఇప్పుడిప్పుడే వస్తున్నవారు మరికొందరు.. రావాల్సినవారు ఇంకొందరున్నారు. ప్రముఖ సంస్థల అధిపతులైన అంబానీలు, అదానీ, మిట్టల్, బిర్లా, సంఘ్వీ, పూనావాలా, నాడర్, పిరామల్, మూర్తి, ప్రేమ్‌జీలు తమ వారసులను పరిచయం చేశారు.

08/28/2016 - 04:31

న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో దేశ జిడిపి వృద్ధిరేటు దాదాపు 8 శాతం నమోదవుతుందని భావిస్తున్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అన్నారు. వరుసగా రెండేళ్లపాటు వర్షాభావ పరిస్థితులున్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరం (2015-16) 7.6 శాతం వృద్ధిరేటు నమోదైందని గుర్తుచేసిన ఆయన ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున అంతకుమించి నమోదు కాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

08/28/2016 - 04:31

విజయవాడ, ఆగస్టు 27: నూతన రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా తన్నుకొస్తున్నాయి. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారు. పరిశ్రమలు నెలకొల్పడంతో పాటు, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించడానికి కూడా సిద్ధమవుతున్నాయి.

08/27/2016 - 06:04

విజయవాడ, ఆగస్టు 26: మోసపూరిత పథకాలతో ఏటా దేశవ్యాప్తంగా లక్షలాది మంది వేల కోట్ల రూపాయల్లో తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారు. అమాయకుల అత్యాశే.. అక్రమార్కుల వ్యాపారమవు తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ నకిలీ దందా అధికమే.

08/27/2016 - 06:02

రాజమహేంద్రవరం, ఆగస్టు 26: ఆకుపచ్చని తివాచీ కప్పుకుని అణువణువూ ప్రకృతి సోయగాన్ని నింపుకున్న ప్రాంతమే తూర్పు వాకిలి. జీవ వైవిధ్యమే కాదు భౌగోళిక వైవిధ్యం కూడా ఈ ప్రాంత ప్రత్యేకత. గోదావరి గలగలల నడుమ పాపికొండల అందాలు ఈ ప్రాంతానికి తలమానికం. పంట పొలాలు.. పిల్ల కాలువలు.. గోదావరి ఇసుక తినె్నలు ఇక్కడికి రారమ్మని పర్యాటకులను నిత్యం ఆహ్వానం పలుకుతూనే ఉంటాయి.

Pages