S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/31/2016 - 07:39

న్యూఢిల్లీ, ఆగస్టు 30: డిజీల్ ఆధారిత వాహనాలపై నిషేధంతో గడచిన 8 నెలల్లో దేశీయ ఆటో పరిశ్రమకు 4,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో 2,000సిసి, అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇంజిన్లున్న వాహనాల అమ్మకాలపై సుప్రీం కోర్టు నిషేధం విధించినది తెలిసిందే.

08/31/2016 - 07:38

న్యూఢిల్లీ, ఆగస్టు 30: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) గరిష్ఠంగా 18 శాతంగా ఉండాలని, అంతకు మించరాదని, ఈ-కామర్స్ సంస్థలకు జిఎస్‌టి నుంచి మినహాయింపునివ్వాలని భారతీయ పారిశ్రామిక రంగం డిమాండ్ చేస్తోంది. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు జిఎస్‌టి రేటుపై సంప్రదింపులు మొదలు కావడంతో ఫిక్కీ, అసోచామ్, సిఐఐ వంటి పారిశ్రామిక సంఘాలు తమకున్న అభ్యంతరాలను తెలియజేస్తున్నాయి.

08/30/2016 - 16:41

ముంబయి: దేశీయ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67.06 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 440 పాయింట్లు లాభపడి 52 వారాల గరిష్ఠానికి చేరింది. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 28,343 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 137 పాయింట్ల లాభంతో 8,744 వద్ద ముగిసింది.

08/30/2016 - 04:30

న్యూఢిల్లీ, ఆగస్టు 29: మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీల్).. తమ స్పోర్ట్స్ చానెల్ టెన్ స్పోర్ట్స్‌ను అమ్మేయాలని చూస్తోంది. అయితే ఎంతకు అమ్మనుందో, ఎవరు కొనుగోలు చేయనున్నారో ఆ వివరాలు మాత్రం బయటకు రాలేదు. కానీ అమ్మకానికి సంబంధించి చర్చలు చురుగ్గా జరుగుతున్నాయని, త్వరలోనే ఫలప్రదం కావచ్చని చెప్పింది.

08/30/2016 - 04:30

న్యూఢిల్లీ, ఆగస్టు 29: తన ప్రత్యర్థి ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు పోటీగా స్నాప్‌డీల్ తమ కస్టమర్ల కోసం ఓ ప్రీమియం మెంబర్‌షిప్ సర్వీసును పరిచయం చేసింది. స్నాప్‌డీల్ గోల్డ్ పేరుతో వచ్చిన ఈ ఆఫర్‌లో కస్టమర్లకు స్నాప్‌డీల్ ఉచితంగా షిప్పింగ్ చేస్తుంది. మరికొన్ని ప్రయోజనాలనూ కస్టమర్లకు స్నాప్‌డీల్ అందించనుంది.

,
08/30/2016 - 04:29

నెల్లూరు, ఆగస్టు 29: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు నుంచి చైనాకు కంటైనర్ టెర్మినల్ మెయిన్‌లైన్ సర్వీసును మాస్కలైన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రాంక్ డెడెనిస్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డెడెనిస్ మాట్లాడుతూ కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్‌లో ప్రపంచ స్థాయి వౌలిక వసతులు కల్పించారని ప్రశంసించారు.

08/30/2016 - 04:26

న్యూఢిల్లీ, ఆగస్టు 29: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ దేశీయ టెలికామ్ రంగంలో పెను మార్పులకే వేదికవుతోంది. జియోకు చెక్ పెట్టేందుకు టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. తమ 4జి, 3జి మొబైల్ ఇంటర్నెట్ చార్జీలను 80 శాతం వరకు తగ్గించింది మరి. ఇందులో భాగంగానే ఒక గిగాబైట్ (జిబి)ను కేవలం 51 రూపాయలకే అందిస్తోంది.

08/30/2016 - 04:25

ముంబయి, ఆగస్టు 29: ద్రవ్యోల్బణం తగ్గితేనే వడ్డీరేట్ల తగ్గుదలకు అవకాశం ఉంటుందని, అప్పుడే అది సాధ్యపడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ సోమవారం స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం గణాంకాలు ఇప్పటికీ ఆర్‌బిఐ లక్ష్యానికి ఎగువనే ఉన్నాయన్నారు.

08/30/2016 - 04:24

న్యూఢిల్లీ, ఆగస్టు 29: భారత్-అమెరికా సిఇఒ ఫోరమ్ సమావేశం మంగళవారం జరగనున్న క్రమంలో సోమవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను దేశీయ అగ్రశ్రేణి సంస్థల సిఇఒలు కలిశారు. ఇంధనం, తయారీ తదితర కీలక రంగాలపై ఈ సందర్భంగా చర్చించారు. సైరస్ మిస్ర్తి, సునీల్ మిట్టల్, చందా కొచ్చర్, దీపక్ పరేఖ్, ఆనంద్ మహీంద్ర తదితర ప్రముఖులు సీతారామన్‌తో సమావేశమైన వారిలో ఉన్నారు.

08/30/2016 - 04:23

ముంబయి, ఆగస్టు 29: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 120.41 పాయింట్లు పెరిగి 27,902.66 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 34.90 పాయింట్లు అందుకుని 8,607.45 వద్ద నిలిచింది. నిజానికి ఉదయం ఆరంభంలో నష్టాల్లోనే కదలాడిన సూచీలు..

Pages