S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/03/2016 - 18:51

విజయవాడ: గుంటూరు జిల్లా వెలగపూడి, మల్కాపురంలో నిర్మించ తలపెట్టిన తాత్కాలిక సచివాలయానికి సంబంధించి రెండు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సిఆర్‌డిఎ) అధికారులు బుధవారం నాడు బిడ్లను తెరిచారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి, షాపూర్జి పల్లోంజి సంస్థ బిడ్లను దాఖలు చేశాయి. సకాలంలో నిర్మాణం పూర్తి చేసేందుకు కఠిన నిబంధనలు విధించి టెండర్లను ఆహ్వానించారు.

02/03/2016 - 17:41

కాకినాడ: కాపుగర్జన సందర్భంగా గత ఆదివారం తుని వద్ద జరిగిన హింసాకాండకు సంబంధించి తుని రూరల్ పోలీసు స్టేషన్‌లో 57, అర్బన్ పోలీసు స్టేషన్‌లో 7, రైల్వే పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో ఎ1 (మొదటి నిందితుడు)గా మాజీ మంత్రి పద్మనాభం పేరును నమోదు చేశారు.

02/03/2016 - 15:06

విజయవాడ: నగరంలోని రాజీవ్ గాంధీ పార్కు సమీపంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు వంద గుడిసెలు కాలిపోయాయి. ఈ సంఘటనలో ఓ వృద్ధురాలు సజీవ దహనమైంది. పక్కనే ఉన్న మరో 30 గుడిసెలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను సకాలంలో చేపట్టారు. రాష్ట్ర మంత్రి నారాయణ, కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు, ఇతర అధికారులు సంఘటన ప్రాంతానికి వచ్చి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

02/03/2016 - 11:51

విజయవాడ: అమరావతి ప్రాంతంలో తాత్కాలిక రాజధాని నిర్మాణానికి సిఆర్‌డిఏ అధికారులు ఈ రోజు టెండర్లు తెరవనున్నారు. టెండర్ దాఖలు చేసేందుకు మూడు రోజుల గడువు పెట్టారు. తొలి దశలో జి+ వన్ నిర్మాణాలను పూర్తి చేస్తారు. జూన్‌లోగా ఎ.పి. ఉద్యోగులందరినీ హైదరాబాద్ నుంచి తాత్కాలిక రాజధానికి రప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

02/03/2016 - 11:51

విజయవాడ: కాపు గర్జన సందర్భంగా తునిలో జరిగిన హింసాకాండకు వైకాపా కారణమని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి నారాయణ ఆరోపించారు. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌తోపాటు, పోలీసుస్టేషన్‌ను దగ్ధం చేయడానికి అల్లరి మూకలను వైకాపా ప్రోత్సహించిందని అన్నారు. ముందస్తు వ్యూహం ప్రకారమే విధ్వంసకాండ జరిగిందన్నారు.

02/03/2016 - 11:48

విశాఖ: పాడేరు ఘాట్ రోడ్డులో బుధవారం ఉదయం ఓ కారు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు మహిళలు గాయపడ్డారు. నిద్రమత్తులో డ్రైవర్ కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు చెబుతున్నారు.

02/03/2016 - 11:48

కడప: మైలవరం మండలం బోగాలతట్ట గ్రామ సమీపంలో బుధవారం ఉదయం పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లిన తండ్రీ కొడుకులు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించారు.

02/03/2016 - 11:48

నెల్లూరు: మర్రిపాడు వద్ద అటవీ శాఖ అధికారులు బుధవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేసి, 50 ఎర్రచందనం దుంగలను, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న 24 మంది కోసం గాలిస్తున్నారు. అటవీ ఉద్యోగికి చెందిన బైక్‌పై ముగ్గురు స్మగ్లర్లు పరారయ్యారు.

02/03/2016 - 11:47

విశాఖ: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ ఏడాది నిర్వహించే ఐసెట్‌కు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 16న ఎంట్రన్స్ నిర్వహించి, 19న ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తారు. 27న ఫలితాలు ప్రకటిస్తారు. ఐసెట్‌కు ఈ నెల 6 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

02/03/2016 - 11:47

శ్రీకాకుళం: మందస మండలం పొత్తంగి - సిరిపురం బిసి హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి టి.బాలకృష్ణ (14) హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకోవడాన్ని బుధవారం ఉదయం సిబ్బంది గమనించారు. మంగళవారం రాత్రి మిగతా విద్యార్థులతోపాటు హాస్టల్ గదిలో పడుకున్న బాలకృష్ణ బుధవారం ఉదయం ఎంత లేపినా లేవలేదు. దీంతో ఆందోళన చెందిన సహచర విద్యార్థులు వార్డెన్‌కు సమాచారం అందించారు.

Pages