S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/05/2016 - 11:55

విజయవాడ : విజయవాడ - విశాఖ మధ్య ఈ నెల 8 నుంచి మళ్లీ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగుతాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాపు గర్జన సందర్భంగా గత ఆదివారం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ పూర్తిగా దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ రైలును పునరుద్ధరించేందుకు రెండు ఎ/సి చైర్‌కార్ బోగీలతోపాటు మరో 12 బోగీలు, పాంట్రీ కార్, రెండు లగేజీ బోగీలను సమకూర్చుకున్నట్లు అధికారులు తెలిపారు.

02/05/2016 - 11:53

కాకినాడ: కాపు కులస్థులకు రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శుక్రవారం ఉదయం 9 గంటలకు కిర్లంపూడిలోని తన స్వగృహంలో భార్యతో కలిసి ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఆయన్ను పలకరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఆందోళనకారులు భారీగా తరలి వస్తారని భావించిన పోలీసులు కిర్లంపూడిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దీక్షకు ముందు ముద్రగడ దంపతులను వైద్యులు పరీక్షించారు.

02/05/2016 - 04:52

కాకినాడ: కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ల సాధనకు ఆమరణ నిరాహార దీక్షకే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సన్నద్ధమవుతున్నారు. తమ డిమాండ్లకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి విస్పష్టమైన హామీ వస్తేనే దీక్ష విషయంలో పునరాలోచన ఉంటుందని ముద్రగడ తేల్చిచెప్పారు.

02/05/2016 - 04:48

విశాఖపట్నం: ‘మేక్ ఇన్ ఇండియా’ పేరుతో భారత ప్రభుత్వం స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నినాదాన్ని అందిపుచ్చుకుని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ నౌకలు, ఆయుధాలను తయారు చేయడంలో భారత నౌకాదళం తొలి అడుగు వేయటం ముదావహమని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

02/05/2016 - 04:43

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శాశ్వత నిర్మాణ పనులకు జూన్ 2న శంకుస్థాపన జరగనుంది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి మాత్రం ఈ నెల 12ఉదయం 4.15 నిమిషాలకు శంకుస్థాపన చేయలని సిఎం చంద్రబాబునాయుడు యోచిస్తున్నట్టు తెలిసింది. అన్ని కార్యాలయాలను తాత్కాలిక సచివాలయానికి తరలించిన తర్వాత వాటి నుండి అద్దె వసూలుచేయనున్నారు. అద్దె వసూలు నిర్వహణ బాధ్యతను సిఆర్‌డిఎకు ప్రభుత్వం అప్పగించింది.

02/05/2016 - 04:46

హైదరాబాద్: పబ్లిక్ సర్వీసు కమిషన్లు లక్ష్యాలను సాధిస్తూ, ప్రజల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించి వారి మెప్పు పొందాలని యుపిఎస్‌సి చైర్మన్ దీపక్ గుప్తా పిలుపునిచ్చారు. వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ల 18వ జాతీయ సదస్సు ప్రగతి రిసార్ట్సులో గురువారం ప్రారంభమైంది.

02/05/2016 - 04:32

విజయవాడ: రాష్ట్రంలో కాపులను బిసిల్లో చేర్చేందుకు వీలుకల్పించే సిఫార్సుల నివేదికను గడువులోగా సమర్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనను కలిసిన బిసి కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్‌ను కోరారు. వీలైన పక్షంలో తొమ్మిది నెలల కంటే నివేదికను ముందే అందజేసే విషయాన్ని పరిశీలించాలని ఆయన సూచించారు.

02/04/2016 - 18:09

విజయవాడ: ఏ సామాజిక వర్గానికీ అన్యాయం జరగకుండా నివేదిక ఇస్తానని బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ తెలిపారు. ఆయన గురువారం ఇక్కడ సిఎం చంద్రబాబును కలిసిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ, తనపై ఎంతో నమ్మకంతో ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిందన్నారు. కాపులకు సంబంధించి తగిన గణాంకాలు లేనందున అన్ని జిల్లాల్లో పర్యటించి సమాచారం సేకరించాల్సి ఉందన్నారు.

02/04/2016 - 18:08

విశాఖ: ఎపి సిఎం చంద్రబాబు నాయుడు గురువారం ఇక్కడి బీచ్‌రోడ్‌లోని ‘విక్టరీ ఎట్ సీ’ స్మారక స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అంతర్జాతీయ నౌకా విన్యాసాల (ఐఎఫ్‌ఆర్) సందర్భంగా ఆయన ఐఎఫ్‌ఆర్ గ్రామాన్ని ప్రారంభించారు. ఇందులో భారతీయ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా కళారూపాలను ఏర్పాటుచేశారు.

02/04/2016 - 18:07

కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్లు సాధించే విషయమై ఎవరితోనైనా తాను చర్చలకు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఆయన గురువారం కిర్లంపూడిలోని తన స్వగృహంలో విలేఖరులతో మాట్లాడుతూ, తన తరఫున ఎవరూ ఇంతవరకూ చర్చలకు వెళ్లలేదని, తనతో కూడా ఎవరూ చర్చలకు రాలేదన్నారు. కాపులకు న్యాయం జరుగుతుందని అనిపిస్తే చర్చలకు తాను అంగీకరిస్తానని, రిజర్వేషన్ల సాధనకు రాజీపడే ప్రసక్తే లేదన్నారు.

Pages