S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/30/2016 - 03:44

మైదుకూరు, మార్చి 29: కడప జిల్లా మైదుకూరు పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున పట్టే అయ్యవారయ్య (40), పట్టే నాగులు (35) దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. మైదుకూరులోని సాయినాథపురం రేణుకాయల్లమ్మ గుడి సమీపంలో అయ్యవారయ్య అలియాస్ అయ్యవారురెడ్డి, తన తల్లిదండ్రులు పెద్ద నరసింహులు, వెంకటసుబ్బమ్మ, భార్య నాగులు, కూతురు చంద్రలేఖ, కుమారుడు వెంకటేష్ కలిసి నివాసం ఉంటున్నారు.

03/30/2016 - 03:42

ఓబుళదేవరచెరువు, మార్చి 29:బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ చెక్‌డ్యాంలో పడి తల్లీకూతుళ్లు మృతి చెందిన సంఘటన మంగళవారం అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువులో చోటుచేసుకుంది. ఆ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు..

03/30/2016 - 03:40

ఒంటిమిట్ట, మార్చి 29: కడప జిల్లాలో వెలసి మరో అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. కోదండరామయ్య బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒంటిమిట్టలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం చదలవాడ పరిశీలించారు. అనంతరం స్వామివారి దర్శనార్థం రాగా అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.

03/30/2016 - 03:39

హిరమండలం, మార్చి 29: శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. మంగళవారం మండలంలోని రుగడ, కొమనాపల్లి గ్రామ పంచాయతీల పరిధిలోని గిరిజన గ్రామాల్లోకి చొరబడిన ఏనుగుల గుంపు అలజడి రేపాయి. తోటలు, ఇళ్లు ధ్వంసం చేయడంతో గిరిజనులు భీతిల్లారు. గుంపుగా వచ్చిన ఏనుగులు ఎగువ రుగడ, ఈతలగూడ గ్రామాల్లోని లక్ష్మణరావు, ధర్మారావు, రాజేశ్వరరావు, తోటయ్యకు చెందిన ఇళ్లను ధ్వంసం చేశాయి.

03/29/2016 - 18:33

హైదరాబాద్: పలు హిట్ చిత్రాలను నిర్మించిన తెలుగు సినీ నిర్మాత జయకృష్ణ మంగళవారం మరణించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘మనవూరి పాండవులు’తో ఆయన ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. సీతారాములు, ముద్దుల మనవరాలు, వివాహ భోజనంబు, మంత్రిగారి వియ్యంకుడు తదితర సినిమాలను జయకృష్ణ నిర్మించారు. రెబల్‌స్టార్ కృష్ణంరాజుకు వ్యక్తిగత మేకప్‌మేన్‌గా సినీరంగంలోకి వచ్చారు.

03/29/2016 - 18:32

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీలకు స్పోర్ట్సు కాలేజీని ప్రారంభిస్తామని, వారికి 50 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని, గిరిజన గ్రామాల్లో నీటి కొరతను నివారిస్తామని, విశాఖలో గిరిజన మ్యూజియంను ఏర్పాటు చేస్తామని ఎపి సిఎం చంద్రబాబు మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ప్రకటించారు. అరకులో ఉత్పత్తయ్యే కాఫీకి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

03/29/2016 - 18:32

హైదరాబాద్: రాయలసీమ వాసులకు మంచినీళ్లిచ్చే పట్టిసీమ ప్రాజెక్టుపై విపక్షనేత జగన్ ఎందుకు అడ్డుపడుతున్నారో తనకు అర్థం కావడం లేదని, ఆయన తీరు చూస్తుంటే ఈరోజు తనకు నిజంగా మతిపోతోందని ఎపి సిఎం చంద్రబాబు మంగళవారం అసెంబ్లీ సమావేశంలో అన్నారు. ‘జగన్ వితండవాది అని ఎవరు చెప్పినా వినరు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘నీళ్లు ఇస్తామంటే మీరు వద్దంటారా?

03/29/2016 - 18:31

హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకున్న ‘బాహుబలి’ సినిమా తెలుగువాళ్ల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందని ఎపి సిఎం చంద్రబాబు మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ప్రశంసించారు. జాతీయ ఉత్తమ చిత్రంగా ‘బాహుబలి’, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కంచె’ అవార్డులను సాధించడం పట్ల అభినందనలు తెలుపుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభలో ఏకగ్రీవంగా ఆమోదించారు.

03/29/2016 - 18:30

అనంతపురం: పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చేందుకు ఓ రైతు నుంచి మూడువేల రూపాయలు లంచం తీసుకుంటుండగా బ్రహ్మసముద్రం తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వెంకటేశులును ఎసిబి అధికారులు మంగళవారం పట్టుకున్నారు. నిందితుడిని ఎసిబి కోర్టులో హాజరు పరచనున్నట్లు అధికారులు తెలిపారు.

03/29/2016 - 16:43

హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధానిగా అవతరించే అమరావతిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, 125 అడుగుల పొడవుండే ఈ విగ్రహం రాజధానికే వనె్న తెస్తుందని ఎపి సిఎం చంద్రబాబు మంగళవారం అసెంబ్లీ సమావేశంలో చెప్పారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంబేద్కర్ జయంతి నాడు ఆరులక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు.

Pages