S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/28/2016 - 14:21

అనంతపురం: ఆంధ్ర- కర్నాటక సరిహద్దుల్లోని టోల్‌గేట్ వద్ద సోమవారం ఉదయం పోలీసులు ఓ లారీలో తరలిస్తున్న సుమారు మూడు టన్నుల ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. దుంగల విలువ సుమారు 80 లక్షల రూపాయలను తెలిసింది.

03/28/2016 - 14:20

అనంతపురం: వీడ్కోలు పార్టీ సందర్భంగా విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక విద్యార్థి మరణించిన సంఘటన బుక్కరాయ సముద్రంలో ఆదివారం రాత్రి జరిగింది. పార్టీలో ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య గొడవ ఫలితంగా ధనంజయ్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడ్ని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.

03/28/2016 - 12:29

ఒంగోలు: అద్దంకి మండలం వెంకటాపురం వద్ద నాగార్జున సాగర్ కాలువకు సోమవారం ఉదయం గండి పడి సాగునీరు వృథాగా పోతోందని రైతులు నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

03/28/2016 - 12:25

హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసుపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని వైకాపా ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో ఎపి అసెంబ్లీ సమావేశం సోమవారం రెండుసార్లు వాయిదా పడింది. సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని వైకాపా సభ్యులు కోరగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు అందుకు అంగీకరించలేదు.

03/28/2016 - 04:33

విజయవాడ, మార్చి 27: కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఉంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పరిస్థితి. పార్టీకి రాజీనామా చేయకుండా టిడిపిలో చేరిన భూమా బృందంపై అనర్హత వేటు వేయించడానికి వైకాపా అధ్యక్షుడు జగన్ చేయని ప్రయత్నం లేదు. ఇందులో భాగంగా చివరి అస్త్రాన్ని జగన్ మంగళ, బుధవారాల్లో అసెంబ్లీలో ప్రయోగించనున్నారు.

03/28/2016 - 04:31

హైదరాబాద్, మార్చి 27: శాసనసభ సమావేశాల్లో భాగంగా ఈనెల 29, 30 తేదీల్లో ద్రవ్య వినిమయ బిల్లు చర్చకు వస్తున్నందున తప్పకుండా హాజరవ్వాలని తన పార్టీ ఎమ్మెల్యేలకు వైకాపా విప్ జారీ చేసింది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా చర్చలో పాల్గొని ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందిగా విప్ జారీ చేసినట్లు విప్ అమరనాథ్ రెడ్డి ప్రకటించారు.

03/28/2016 - 04:30

విజయవాడ, మార్చి 27: జగన్ బిసి వ్యతిరేకి అనే ముద్ర వేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా, ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా వ్యూహం రూపొందిస్తున్నారా? ఇందు కోసం పార్టీ ఎమ్మెల్యేలకు ఇప్పటికే తగిన శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తోంది. ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లులో బిసిలకు కేటాయిస్తున్న నిధులు ఏవిధంగా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేయాలన్న అంశాన్ని ప్రధానంగా చేర్చారు.

03/28/2016 - 04:28

హైదరాబాద్, మార్చి 27: ఆంధ్రప్రదేశ్‌లో బలహీన వర్గాల గృహ నిర్మాణంలో ప్రగతి అంతంతమాత్రంగానే కొనసాగుతోంది. భారీ ఎత్తున బడ్జెట్‌లో నిధులు కేటాయించినా ఆశించిన స్థాయిలో లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 93,962 ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే, కేవలం 47,782 ఇళ్లను పూర్తి చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే బడ్జెట్ ప్రణాళిక ప్రకారం కేటాయించిన రూ.

03/28/2016 - 04:27

హైదరాబాద్, మార్చి 27: విద్యుత్ వినియోగంలో పొదుపు మంత్రాన్ని పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోంది. ఎల్‌ఇడి బల్బులను వినియోగించి విద్యుత్ వినియోగంలో పెద్ద ఎత్తున పొదుపు చేసి విజయం సాధించి జాతీయ స్థాయిలో అందరినీ ఆకర్షించడంతో ఏపి ప్రభుత్వం త్వరలో మరికొన్ని విద్యుత్ పొదుపు చర్యలకు తెరతీయబోతోంది.

03/28/2016 - 02:35

విజయవాడ, మార్చి 27: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మితం కావాల్సివున్న సచివాలయం, శాసనసభ, శాసనమండలి, రాజ్‌భవన్, ఇతర ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన వివిధ దేశ, విదేశీ కంపెనీలు రూపొందించిన డిజైన్లలో రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన జపాన్‌కు చెందిన మాకీ అండ్ అసోసియేట్స్ డిజైన్ పట్ల అత్యధికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Pages