S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/05/2016 - 12:02

కర్నూలు: బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళుతున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం అర్ధరాత్రి దాటాక ఎసి కోచ్‌లో పదిమంది దొంగలు ప్రవేశించి మహిళల నుంచి 15 తులాల బంగారు నగలు దోచుకున్నారు. నంద్యాల సమీపంలోని దిగువమెట్ట వద్దకు రైలు రాగానే కొందరు చైన్ లాగడంతో దొంగలు ఎసి కోచ్‌లోకి ఎక్కారు. బాధితుల ఫిర్యాదుపై నంద్యాల రైల్వే పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.

04/05/2016 - 04:37

దేవరపల్లి, ఏప్రిల్ 4: పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో సోమవారం మధ్యాహ్నం సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో 38 తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక మూడేళ్ల బాలుడు సజీవ దహనమయ్యాడు. ప్రమాద బాధితులంతా క్వారీ కార్మికులే. వివరాలిలావున్నాయి... దుద్దుకూరు ఊరచెరువు గట్టుమీద క్వారీ కార్మికులు నివాసముంటున్నారు.

04/05/2016 - 04:37

విశాఖపట్నం, ఏప్రిల్ 4: శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టును ప్రైవేటురంగంలో అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం తుది దశకు చేరుకుంది. అనేక వడపోతల అనంతరం మూడు సంస్ధలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఏప్రిల్ 30 నాటికి ఆర్థిక, సాంకేతిక బిడ్లు ఆహ్వానించి మే మొదటి వారంలో ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది.

04/05/2016 - 04:36

అనంతపురం, ఏప్రిల్ 4 : రాయలసీమలో భానుడి ప్రతాపం కొనసాగుతూనే ఉంది. సీమలోమార్చి 18వ తేదీ నుంచీ ఎండ మండుతోంది. అప్పటి నుంచీ ప్రతి రోజూ 40 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అనంతపురంలో సోమవారం జిల్లా సగటు ఉష్ణోగ్రత 41.7 డిగ్రీలుగా నమోదయింది. అత్యధికంగా పుట్టపర్తిలో 46.7 డిగ్రీలు, జిల్లా కేంద్రమైన అనంతపురంలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

04/05/2016 - 04:35

తిరుపతి, ఏప్రిల్ 4: ఓటర్ల జాబితా క్షేత్రసాయి పరిశీలన కోసం పోలింగ్ స్టేషన్ల జాబితా, నమోదు కార్యక్రమాన్ని జూన్ మాసంలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు.

04/05/2016 - 04:34

మచిలీపట్నం, ఏప్రిల్ 4: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహం ధ్వంసంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రెండు రోజుల క్రితం రంగా విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పోలీసు ఉన్నతాధికారులు సోమవారం మచిలీపట్నం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

04/05/2016 - 04:33

విశాఖపట్నం, ఏప్రిల్ 4: సింహాచలంలో కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం మే 9న జరుగనుంది. ఈ సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనభాగ్యం భక్తులకు కలుగనుంది. సంవత్సరానికోసారి జరిగే అప్పన్నస్వామి నిజరూపదర్శనం ఏర్పాట్లను దేవస్ధానం అధికారులు చేపట్టారు. చివరి భక్తునికీ అప్పన్న నిజరూపదర్శనాన్ని కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం నాడిక్కడ వెల్లడించారు.

04/05/2016 - 04:31

విజయపురిసౌత్, ఏప్రిల్ 4: శ్రీశైలం జలాశయం నుండి నీటి చేరిక తగ్గుతుండటంతో సోమవారం సాయంత్రానికి నాగార్జున సాగర్ నీటిమట్టం 507.70 అడుగులకు చేరుకుంది. ఇది 127.7989 టిఎంసిలకు సమానం. సాగార్జున సాగర్ జలాశయం నుండి ఎడమ కాలువ ద్వారా 5064 క్యూసెక్కులు, మంచినీటి అవసరాల కోసం హైదరాబాద్ జంట నగరాలకు 808 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం అవుట్‌ఫ్లోగా 5872 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

04/05/2016 - 04:30

కాకినాడ, ఏప్రిల్ 4: అధికారం సాధించిన రెండేళ్లలోనే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. చంద్రబాబు జరిపించుకున్న రహస్య సర్వేలో ఈ విషయం వెల్లడైనందునే, తమ పార్టీ ప్రజాప్రతినిధులను కొనుగోలుచేస్తున్నారని ఆరోపించారు.

04/05/2016 - 04:30

విశాఖపట్నం, ఏప్రిల్ 4: సముద్రంలో వేట నిషేధ సమయంలో తీరప్రాంతంలోని మత్స్యకారులకు అందించే పరిహారం పెంచడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పరిహారాన్ని రెట్టింపు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 6 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు.

Pages