S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/03/2016 - 11:23

గుంటూరు, ఏప్రిల్ 2: గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ కార్యాలయంగా మార్చేందుకు అవసరమైన పత్రాలను స్వీకరించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు శనివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన అధికార ప్రతినిధులకు సమ్మతి తెలియజేస్తూ పత్రాలను అందజేశారు.

04/03/2016 - 02:25

హైదరాబాద్, ఏప్రిల్ 2: వైకాపా ఎమ్మెల్యే రోజా మభ్యపెట్టాలనుకుంటే మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. శనివారం నాడు ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డి ప్రజాసమస్యలను గాలికొదిలేసి అసెంబ్లీ ముందు రోజా జబర్దస్తీ స్కిట్లు ప్రదర్శిస్తూ అసెంబ్లీ సమయాన్ని వృథా చేశారని విమర్శించారు.

04/02/2016 - 16:41

విజయవాడ:రాబోయే రోజుల్లో దశలవారీగా 20వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చాలాకాలంగా ఖాళీగా ఉండిపోయిన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. లక్షలాదిమంది నిరుద్యోగులకు ఇది తీపికబురే.

04/02/2016 - 14:04

నెల్లూరు:అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో సబ్‌రిజిస్ట్రార్ చిక్కారు. నెల్లూరు శాంతినగర్‌లో సబ్‌రిజిస్ట్రార్ నందకిషోర్ ఇంటిపై ఎసిబి అధికారులు దాడులు చేశారు. అతడి స్నేహితులు, బంధువుల ఇళ్లపై ఒకేసమయంలో దాడులు కొనసాగాయి. సుమారు 2 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు.

04/02/2016 - 14:04

నెల్లూరు:నెల్లూరు రూరల్ నియోజికవర్గం పరిథిలోని అల్లిపురంలోని శివాలయంలో పూజారి దంపతులు హత్యకు గురయ్యారు. పూజారి చంద్రవౌళీశ్వర రావు, అతడి భార్య పుష్పవేణిలను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. హత్యకు గల కారణాలు వెల్లడికాలేదు.

04/02/2016 - 14:02

వాషింగ్టన్: అమెరికా మరోసారి తన ద్వంద్వవైఖరిని వెల్లడించింది. నిన్నమొన్నటివరకు జరిగిన ప్రపంచ అణుసదస్సులో భారత ప్రధాని నరేంద్రమోదీతో చెట్టపట్టాలు వేసుకు తిరిగిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇవాళ చేసిన ప్రకటన అమెరికా వైఖరిని మరోసారి బట్టబయలు చేసింది.

04/02/2016 - 14:00

నిజామాబాద్:జిల్లాలోని భీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ వేంకటేశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న సుదర్శనయాగంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ దంపతులు పాల్గొన్నారు. ఆయనతోపాటు మంత్రి పోచారం దంపతులుకూడా పూజలు నిర్వహించారు.

04/02/2016 - 05:01

విజయవాడ, ఏప్రిల్ 1: రాష్ట్ర కేబినెట్ సమావేశం శనివారం విజయవాడలో జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా జూన్, జూలై నెలల్లో విజయవాడకు సుమారు 12 వేల మంది ఉద్యోగులను తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. వారికి కావల్సిన వౌలిక సదుపాయాల ఏర్పాటు తదితర అంశాలపై క్యాబినెట్‌లో చర్చించనున్నారు.

04/02/2016 - 04:55

హైదరాబాద్, ఏప్రిల్ 1: అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను ఈ-వేలం ద్వారా విక్రయించి ఆ సొమ్మును వినియోగదారులు, ఏజెంట్లకు వడ్డీతో సహా చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని అఖిల భారత అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కె రంగారెడ్డిని ఎన్నుకున్నట్లు తెలిపింది. శుక్రవారం నగరంలోని ఒక హోటల్‌లో అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం జరిగింది.

04/02/2016 - 04:48

హైదరాబాద్, ఏప్రిల్ 1: గ్రామీణ వైద్యు ల విధి విధానాల రూపకల్పనకు రాష్ట్రప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని నియమించిందని ఎపి వైద్య, ఆరోగ్యమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు.

Pages