S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/12/2016 - 08:22

ఏలూరు, సెప్టెంబర్ 11: విజయదశమికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కాంక్రీటు పనులు ప్రారంభించాలనే మహాసంకల్పంతో ముందుకెళుతున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. 2018 సంవత్సరం నాటికి పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తిచేసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో అద్భుతాన్ని సృష్టించనున్నారన్నారు.

09/12/2016 - 08:00

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ఓటుకు నోటు కేసులో నిందితుడైన సెబాస్టియన్‌పై మరో కేసు నమోదైంది. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. నగరశివారులోని ఏజి కాలనీ సమీపంలోని వికాస్‌పురి కాలనీకి చెందిన ఫిలిప్స్ అనే వ్యక్తి ఇంట్లో సెబాస్టియన్ 2002 నుంచి అద్దెకు ఉంటున్నారు. కాగా ఇంటి యజమానికి, సెబాస్టియన్‌కు మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది.

09/12/2016 - 08:00

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ఓటుకు నోటు కేసులో నిందితుడైన సెబాస్టియన్‌పై మరో కేసు నమోదైంది. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. నగరశివారులోని ఏజి కాలనీ సమీపంలోని వికాస్‌పురి కాలనీకి చెందిన ఫిలిప్స్ అనే వ్యక్తి ఇంట్లో సెబాస్టియన్ 2002 నుంచి అద్దెకు ఉంటున్నారు. కాగా ఇంటి యజమానికి, సెబాస్టియన్‌కు మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది.

09/12/2016 - 07:51

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ప్రత్యేక హోదా సెంటిమెంట్ కాదని, ఇందులో ఎకనామిక్స్ ఉందని, తెలంగాణ ఉద్యమంలో సెంటిమెం ట్ ఉందని, ఎకనామిక్స్ లేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. హోదా కంటే ప్యాకేజీ వల్ల రాష్ట్రం లో మంచి అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రత్యేక ప్యాకేజీని ఏడాదిన్నర క్రితం తెచ్చి ఉంటే బాగుండేదని, ఆలస్యమైందని ఆయన అన్నా రు.

09/12/2016 - 07:48

హైదరాబాద్, సెప్టెంబర్ 12: ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని అన్ని వైపులా దెబ్బతీయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడు ఆ సామాజికవర్గం వైపు కనే్నశారు. జగన్‌కు సంప్రదాయ మద్దతుదారుగా ఉన్న రెడ్డి సామాజికవర్గాన్ని దరి చేర్చుకోవడం ద్వారా, వైసీపీని దెబ్బతీసే లక్ష్యంతో వ్యూహాలకు పదునుపెడుతున్నారు.

09/12/2016 - 07:46

అనంతపురం కల్చరల్, సెప్టెంబర్ 11: బిరుదులు, అవార్డులపై తనకు నమ్మకం లేదని చెప్పను కానీ, వాటిపై తాను మోజు పెంచుకోలేదని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కాశీనాథ్ విశ్వనాథ్ పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని శ్రీత్యాగరాజ సంగీతసభ 58వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం నిర్వహించగా కె.విశ్వనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

09/12/2016 - 07:45

హైదరాబాద్, సెప్టెంబర్ 11: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాని, ప్యాకేజీ కాని రాలేదని పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్, వైకాపా ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం ఇక్కడ లోటస్‌పాండ్‌లో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఉన్నా అక్కడేం అభివృద్ధి జరిగిందని చంద్రబాబు అనడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

09/12/2016 - 07:44

విజయవాడ, సెప్టెంబర్ 11: ప్రపంచంలోనే ఎప్పటికప్పుడు తెరపైకి వచ్చే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోటంలో రెండేళ్లుగా పోటీబడుతూ వస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, సీనియర్ ఐపిఎస్ అధికారి, డిజిపి నండూరి సాంబశివరావు చేరువ కావటంతోనే సరిగ్గా నెల రోజుల్లోనే వచ్చిన సత్ఫలితాలు ప్రపంచ దృష్టినే ఆకర్షింపబడుతున్నాయి. తొలిసారిగా కృష్ణా పుష్కరాల్లో చంద్రబాబు.. నండూరి..

09/12/2016 - 07:43

విశాఖపట్నం, సెప్టెంబర్ 11: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మాటమార్చిన బిజెపి, అందుకు వంత పాడుతున్న తెలుగుదేశం ప్రభుత్వాలకు ఎపి ప్రజలు గోరీ కడతారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. విశాఖలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విభజన సందర్భంగా ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చిన బిజెపి తీరా ఇప్పుడు ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకోవడం దారుణమన్నారు.

09/12/2016 - 07:42

దర్శి, సెప్టెంబర్ 11: రాష్ట్రంలోని పారిశ్రామిక కారిడార్ల నుండి జాతీయ రహదారుల వరకు నాలుగు లైన్ల రహదారుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఎపి ఆర్‌డిసి ఎండి జి జగన్నాధరావు అన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా దర్శిలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో జగన్నాధరావు మాట్లాడుతూ కారిడార్లలో పరిశ్రమలకు శంకుస్థాపనలు జరిగిన తక్షణమే రహదారుల ఏర్పాటుకు టెండర్లు పిలుస్తామన్నారు.

Pages