S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/13/2016 - 04:55

హైదరాబాద్, సెప్టెంబర్ 12: ప్రత్యేక హోదాపై ప్రజాబ్యాలెట్ నిర్వహించనున్నట్లు ఎపిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి తెలిపారు. విభజన చట్టంలోని అంశాల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసాన్ని బయట పెట్టనున్నట్లు ఆయన సోమవారం చెప్పారు. పార్టీ ఎంపి కెవిపి రామచంద్ర రావు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.

09/13/2016 - 04:54

హైదరాబాద్, సెప్టెంబర్ 12: స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు ‘స్టే’ ఇవ్వడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చెంప పెట్టు వంటిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సిఎం అమలు చేస్తున్న స్విస్ ఛాలెంజ్ విధానం అత్యంత లోపభూయిష్టంగానూ, పారదర్శకతకు ఆమడదూరంలో ఉందని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు.

09/13/2016 - 04:52

రొంపిచర్ల, సెప్టెంబర్ 12: గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని విప్పర్లపల్లి-వడ్లమూడి వారిపాలెం గ్రామాల మధ్య సోమవారం సాయంత్రం పోలీసులు బాంబులు స్వాధీనం చేసుకున్నారు.

09/13/2016 - 04:51

హైదరాబాద్, సెప్టెంబర్ 12: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. దాంతో మొత్తం ఐదుగురి పోస్టుల్లో మార్పులు వచ్చాయి. గనుల శాఖ కార్యదర్శిగా ప్రస్తుతం ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండిగా పనిచేస్తున్న బి శ్రీ్ధర్‌ను బదిలీ చేసింది. ఆ పోస్టును తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకూ సోలమన్ ఆరొకియా రాజ్‌ను పూర్తికాలిక అదనపు బాధ్యతల్లో నియమించింది.

09/12/2016 - 17:37

విజయవాడ: వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో దసరా నుంచి పూర్తిస్థాయిలో పాలన కొనసాగించేందుకు ఏపీ అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. ప్రభుత్వ శాఖల తరలింపు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ 16న ప్లానింగ్, 17న ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, 19న మున్సిపల్ శాఖ, మిగిలిన శాఖలన్నీ నెలాఖరులోగా తరలించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తొంది.

09/12/2016 - 17:10

విజయవాడ : కౌలు రైతులకు రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, వారికి రుణ అర్హత పత్రాలు జారీ చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన బ్యాంకర్లకు పలు సూచనలు చేశారు. బంగారం తాకట్టుపెట్టుకుని వ్యవసాయ రుణాలు ఇవ్వడాన్ని ప్రోత్సహించవద్దని, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌కు అనుగుణంగా రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు.

09/12/2016 - 17:02

చిత్తూరు : గుడిపాల మండలం కొత్తపల్లి వద్ద సోమవారం కారును మినీవ్యాన్‌ ఢీకొనడంతో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్‌ మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు.

09/12/2016 - 16:37

నెల్లూరు: జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం ప్రెషర్‌ కుక్కర్‌ బాంబు పేలడంతో క్లూస్‌టీం, బాంబ్‌స్క్వాడ్‌లతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఘటనాస్థలిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

09/12/2016 - 14:20

భీమవరం: భీమవరం మండలం తుందూరులో మెగా ఆక్వాఫుడ్ పార్క్ను వ్యతిరేకిస్తూ గ్రామస్తులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. ఫుడ్ పార్క్ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీసులు ముందస్తుగా గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళనలో ఏడు గ్రామాల ప్రజలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

09/12/2016 - 12:02

చిత్తూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు మరణించిన ఘటన బంగారుపాళ్యం మండలం మాధవతోపు వద్ద సోమవారం తెల్లవారు జామున జరిగింది. ఈ ఘటనలో గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. చీకటిగా ఉండడంతో బైక్‌ను ఢీకొన్న వాహనాన్ని స్థానికులెవరూ గుర్తించలేకపోయారు.

Pages