S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/12/2016 - 11:32

హైదరాబాద్‌: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం చేపట్టిన స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై సోమవారం ఉదయం ఉమ్మడి హైకోర్టు స్టే విధించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆక్టోబర్‌ 31కి వాయిదా వేసింది. స్విస్‌ ఛాలెంజ్‌ నిబంధనలను బహిర్గతం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.

09/12/2016 - 11:19

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో కలుసుకున్నారు. శాసనసభ సమావేశాలు జరిగిన తీరు, రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ, పలు అంశాలపై గవర్నర్‌తో చంద్రబాబు చర్చించనున్నట్లు సమాచారం.

09/12/2016 - 08:35

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 11: ‘ముఖ్యమంత్రి గారూ మీ కుర్చీని కాపాడుకునేందుకు మా జాతిని విడగొట్టవద్దు.. మా జాతి నేతలతో తిట్టించవద్దు’ అని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్కడ నుంచి పారిపోయివచ్చి రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారన్నారు.

09/12/2016 - 08:28

కూచిపూడి, సెప్టెంబర్ 11: నాట్యక్షేత్రం కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిపాలనా కేంద్రంగా రూపుదిద్దేందుకు ప్రభుత్వం యోచిస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కూచిపూడి అమరావతి పరిధిలో ఉండటం ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు. విశ్వవిద్యాలయాన్ని మాత్రం రాజమండ్రి నన్నయ్య పీఠంలోకి మార్పుచేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.

09/12/2016 - 08:27

అమలాపురం, సెప్టెంబర్ 11: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డైరెక్షన్‌లో నడుస్తూ, కాపుల ఆత్మ గౌరవాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టుతున్నారని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

09/12/2016 - 08:27

విశాఖపట్నం, సెప్టెంబర్ 11: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ నుంచి ఆదివారం విశాఖ వచ్చిన ఆయనను విశాఖ విమానాశ్రయంలో అఖిలపక్ష నాయకులు ఘెరావ్ చేశారు. రాష్ట్రానికి హోదా స్థానే ప్యాకేజీ ప్రకటన, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుపై కొనసాగుతున్న సందిగ్ధతపై బిజెపి ఎంపిని అఖిలపక్షం నాయకులు అడ్డుకుని ఘెరావ్ చేశారు.

09/12/2016 - 08:26

గుంటూరు, సెప్టెంబర్ 11: దేశంలో కార్పొరేట్ శక్తుల పాలన సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. ఏమీ సాధించకుండానే ఢిల్లీలో నయవంచకులకు సత్కారం చేయడం పాలకుల దుర్నీతికి నిదర్శనమన్నారు. సత్కారం చేసిన వారికి రాష్ట్రంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. సిపిఐ గుంటూరు జిల్లా కార్యాలయం మల్లయ్యలింగంభవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

09/12/2016 - 08:24

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ఆంధ్ర, తెలంగాణ మధ్య జలవివాదాల పరిష్కారానికి ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం తేదీలపై సందిగ్ధత నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు కేంద్ర జలవనరుల శాఖ ఈ నెల 18 లేదా 19 తేదీల్లో అత్యున్నత సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. పై తేదీల్లో ఒక రోజు ఖరారు చేయాలని సూచించారు. 19న సమావేశానికి సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు కేంద్రానికి సమాచారం ఇచ్చారు.

09/12/2016 - 08:23

గుంటూరు (కల్చరల్), సెప్టెంబర్ 11: తొలినాళ్ల నుంచి సమాజానికి తమ మేధాశక్తిని ధారపోస్తున్న బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక, ధార్మిక, దైవిక, సామాజిక, సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థికంగా అండదండలందిస్తున్న ఆర్యవైశ్యులు సుసంఘటితం కావాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతైనా ఉందని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.

09/12/2016 - 08:23

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ఆంధ్రప్రదేశ్ భవితవ్యం కోసం కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బిజెపి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగా ముగ్గురు కేంద్రమంత్రులు, రాష్ట్ర బిజెపిలో జనంలో ఇమేజ్ ఉన్న ప్రముఖులతో బహిరంగసభలు నిర్వహించనుంది. టిడిపి-బిజెపి సంయుక్త బహిరంగ సభ, విలేఖరుల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.

Pages