S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/08/2016 - 02:54

విజయవాడ (క్రైం), నవంబర్ 7: కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించి ఖాతాదారులను మోసగించిన అభయ గోల్డ్ కేసులో సిఐడి సోమవారం మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. మరోవైపు సీజ్ చేసిన సంస్థ ఆస్తులను వేలంలో విక్రయించి బాధితులకు పంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది.

11/08/2016 - 03:40

హైదరాబాద్, నవంబర్ 7: విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న సంజీవయ్యకు చెందిన హైదరాబాద్‌లోని ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి మొత్తం రూ. 3 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ సంజీవయ్య ప్రస్తుతం విజయవాడలోని ఐజీఆర్‌ఎస్ స్టాంప్స్‌లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు.

11/08/2016 - 02:51

విజయవాడ, నవంబర్ 7: రాయలసీమలో బలిజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియచెప్పడానికి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ ‘బలిజ శంఖారావం’ పేరుతో ఇడుపులపాయ నుండి పులివెందుల మీదుగా కడప వరకు పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 16న మంత్రి గంటా శ్రీనివాసరావు జెండా ఊపి పాదయాత్రను ప్రారంభిస్తారని రామానుజయ తెలిపారు.

11/08/2016 - 02:50

నాగార్జున యూనివర్శిటీ, నవంబర్ 7: రాష్ట్రంలో ఉన్నత విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రానున్న రోజుల్లో కీలక చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా తెలిపారు. సోమవారం గుంటూరుకు సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన విశ్వవిద్యాలయాల ఉప కులపతుల సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు.

11/08/2016 - 02:49

హైదరాబాద్, నవంబర్ 7: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పార్టీ జనచైతన్య యాత్రలో పాల్గొంటున్నట్టు తెలుగుదేశం జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన లోకేష్ మీడియాతో మాట్లాడారు. మూడు వారాల పాటు తొమ్మిది జిల్లాల్లో తాను జనచైతన్య యాత్రలో పాల్గొంటానని వివరించారు.

11/08/2016 - 02:48

హైదరాబాద్, నవంబర్ 7: దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో 21 మంది నిందితులకు శిక్షలు ఖరారు కానున్నాయి. ఇందుకు సంబంధించిన వాదనలు చర్లపల్లి జైలులోని ఎన్‌ఐఎ కోర్టులో ఇప్పటికే పూర్తయ్యాయి. ఎ-1 అసదుల్లాహ అక్తర్, ఎ-2 యాసిన్ భత్కల్, ఎ-3 తహసిన్ అక్తర్, ఎ-4 జియావుర్ రెహ్మన్ (పాక్), ఎ-5 ఐజాజ్ షేక్ సహా 157మంది ఇతర సాక్షులను కోర్టు విచారించింది.

11/07/2016 - 07:16

విజయవాడ, నవంబర్ 6: ఒక వైపు బిసి సంక్షేమానికి కేటాయించిన రూ.6వేల కోట్లు మురిగిపోతుంటే మరోవైపు కొన్ని కులాలకు చెందిన ఫెడరేషన్ చైర్లన్లు సన్మానాల కోసం వెంపర్లాడుతున్నారు. బిసిల సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వం 2016-17 సంవత్సరానికి దాదాపు 9వేల కోట్ల రూపాయలు కేటాయించింది.

11/07/2016 - 07:15

విశాఖపట్నం, నవంబర్ 6: విశాఖ సాగరతీరంలో తూర్పునౌకాదళం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నేవీ మారథాన్ ఉత్సాహంగా జరిగింది. తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి హరీష్‌చంద్ర సింగ్ బిస్ట్, వైస్-అడ్మిరల్ ఏకె జైన్ పాల్గొని కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ మారథాన్‌లో 10కెఎం, 5కెఎంలతోపాటు 42 కిలోమీటర్లు, 21 కిలోమీటర్ల పోటీలను నిర్వహించారు.

11/07/2016 - 07:13

విజయవాడ, నవంబర్ 6: కెనడాలో విస్తృతంగా ఉపాధి, విద్యా అవకాశాలు ఉన్నాయని కెనడా ఇమ్మిగ్రేషన్ చట్టాల నిపుణుడు ఆడం మోరిస్ తెలిపారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ కెనడా ఇమ్మిగ్రేషన్ చట్టాలపై అవగాహన ద్వారా వాటిని అందిపుచ్చుకునే వీలు ఉంటుందని తెలిపారు.

11/07/2016 - 07:00

జంగారెడ్డిగూడెం, నవంబర్ 6: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చోటు దక్కింది.

Pages