S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/10/2016 - 02:42

అమరావతి, నవంబర్ 9: ‘మోడీ మంచి పనిచేశారు. నల్లధనం తీసుకువచ్చేందుకు ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు. కొన్ని సమస్యలున్నా దీన్ని మనం స్వాగతించాలి’‘ఇదేం ప్రభుత్వం? చెప్పా పెట్టకుండా నిర్ణయం తీసుకుంటే మా గతేం కాను? పెద్దనోట్లు ఎవరూ తీసుకోకపోతే మా బతుకేం కాను? మెడికల్ షాపువాడు కూడా చిల్లర ఇవ్వడం లేదు... పెట్రోల్‌బంకువాడు మిగిలిన చిల్లర ఇవ్వనంటాడు.

11/10/2016 - 02:39

నంద్యాల, నవంబర్ 9: రండి బాబూ రండి.. ఆలసించిన ఆశా భంగం.. మంచి తరుణం మించిన దొరకదు.. మీ దగ్గర ఉన్న రూ. వంద నోట్లు తీసుకురండి.. మా వద్ద ఉన్న రూ.వెయ్యి, రూ. 500 నోట్లు తీసుకువెళ్లండి.. 30 శాతం కమిషన్ తీసుకోండి.. ఇదీ బడాబాబులు ఇస్తున్న బంపర్ ఆఫర్. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని తగ్గించుకునేందుకు కర్నాటకలోని బెంగళూరు, బళ్ళారిలోని కొంతమంది బడాబాబులు పెద్ద నోట్ల మార్పిడికి ఇస్తున్న డిస్కౌంట్ ధమాకా ఇది.

11/10/2016 - 02:08

కర్నూలు, నవంబర్ 9: అతని పేరు వెంకటరెడ్డి, కర్నూలు సమీపంలోని ఓ పల్లెటూరు వాసి. కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజుల క్రితం వెంకన్న దర్శనానికి తిరుమల వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో తిరుపతి బస్టాండ్‌కు చేరుకున్నాడు. కర్నూలుకు వెళ్లే బస్సు ఎక్కిన తరువాత పెద్ద నోట్ల రద్దు విషయం తెలిసింది.

11/10/2016 - 02:07

విజయవాడ, నవంబర్ 9: శాశ్వతంగా రాష్ట్ర ప్రజల హృదయాల్లో ఉండిపోవటానికే తాను రాత్రి పగలు శ్రమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలకు చేపట్టటమేగాక వాటిని అర్హులందరికీ చేరేలా నిరంతరం శ్రమిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

11/10/2016 - 01:51

విజయవాడ, నవంబర్ 9: దేశంలో రెండు వేల రూపాయల నోట్ల చలామణి అవసరమా? లేదా? అన్న అంశంపై చర్చ జరగాలన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తం చేశారు. విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ రెండు వేల రూపాయల నోట్లు రావని, వచ్చినా తక్కువ సంఖ్యలో రావచ్చన్నారు. దీనిపై మరింత వివరణ రావాల్సి ఉందన్నారు. రానున్న రోజుల్లో రెండు వందల నోటు ఉంటుందని తెలిపారు.

11/09/2016 - 07:55

ఉండి, నవంబర్ 8: ‘చెట్టులెక్కగలను...పుట్టలెక్కగలను.. చిటారు కొమ్మన చిగురు కోయగలను’ అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు నడుముకు మోకు కట్టుకొని కొబ్బరిచెట్టు ఎక్కి కొబ్బరి గెలను దింపి అలనాటి చెంచులక్ష్మి చిత్రంలోని పాటను మరోసారి గుర్తుచేశారు.

11/09/2016 - 07:54

గుంటూరు, నవంబర్ 8: రాష్ట్రప్రజల హక్కుగా భావిస్తోన్న ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయమని, ప్రజలను అవమానించేవిగా ఉన్నాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. మంగళవారం గుంటూరులోని ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో అంబటి మాట్లాడుతూ ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని వెంకయ్య మాట్లాడటం సరైంది కాదన్నారు.

11/09/2016 - 07:53

హైదరాబాద్, నవంబర్ 8: ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగు దేశం - బిజెపిల అధ్యాయాలు ముగిసాయని ఎపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి అన్నారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా రాహుల్ గాంధీ నాయకత్వంలోనే సాధ్యమవుతుందని రఘువీరారెడ్డి మంగళవారం పార్టీ నేతలు ఎస్. శైలజానాథ్, ఎన్. తులసిరెడ్డి, గిడుగు రుద్రరాజు తదితరులతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు.

11/09/2016 - 07:53

నెల్లూరు, నవంబర్ 8: నెల్లూరు జిల్లాలో మొదటి పంటకు గురువారం నుంచి సాగునీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో తొలి పంటకు సాగునీరు అందించేందుకు మంగళవారం నెల్లూరులో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో తీర్మానం చేస్తూ ప్రభుత్వ ఆమోదానికి పంపారు.

11/09/2016 - 07:52

అనంతపురం, నవంబర్ 8: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ గురువారం అనంతపురంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ విజయవంతానికి నిర్వాహకులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఈ సభ నిర్వహించనున్నారు.

Pages