S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/08/2016 - 03:47

విజయవాడ/శ్రీకాకుళం, నవంబర్ 7: వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై మంత్రులు తీవ్రస్థాయలో విరుచుకుపడ్డారు. అధికారం కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కింజరాపు అచ్చెన్నాయుడు, పి.నారాయణ, పరిటాల సునీత విరుచుకుపడ్డారు.

11/08/2016 - 03:38

శ్రీశైలం, నవంబర్ 7: శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక రెండవ సోమవారం, కోటి సోమవారాన్ని రాన్ని పురస్కరించుకుని లక్ష దీపార్చన నిర్వహించారు. దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు ఎంతో విశేషంగా లక్ష దీపార్చన కార్యక్రమాన్ని ఆలయ అర్చక వేదపండితులు ఇవో సమక్షంలో కన్నులపండువగా నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట ఉసిరి చెట్లవద్ద లక్ష దీపార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు.

11/08/2016 - 03:36

శ్రీ కాళహస్తి, నవంబర్ 7: కార్తీక సోమవారం సందర్భంగా సోమవారం శ్రీ కాళహస్తీశ్వరాలయం తెల్లవారుజామునుంచే భక్తకోటితో నిండిపోయింది. కార్తీక మాసం 2వ సోమవారం కావడం, అందులోనూ కోటి సోమవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. కార్తీకమాసం సోమవారం శ్రవణా నక్షత్రం, సప్తమీతిధి ఇవన్నీ కలిసివచ్చిన రోజును కోటి సోమవారం అంటారు.

11/08/2016 - 03:35

కర్నూలు, నవంబర్ 7: ఇ-యంత్రం ద్వారా రేషన్ బియ్యం స్వాహా చేస్తున్న ముగ్గురు రేషన్ డీలర్లు, మరో ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లను అరెస్టు చేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ ఆకే.రవికృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా అక్రమాలు జరిగిన 19 రేషన్ షాపులను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.

11/08/2016 - 03:31

విజయవాడ, నవంబర్ 7: ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా విద్యుత్‌ను పొదుపు చేస్తే ప్రోత్సాహకాలు, లేకుంటే జరిమానా విధించేలా త్వరలో చట్టం రూపొందించనున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ, సిఆర్‌డిఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ వెల్లడించారు. ప్రపంచ బ్యాంక్ రూపొందించిన నివేదికలో దేశంలో ఇంధన సామర్థ్యంలో రాష్ట్రానికి మొదటి స్థానం దక్కిందని తెలిపారు.

11/08/2016 - 03:31

విజయవాడ, నవంబర్ 7: తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని రైతులకు రబీలో పంటలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ ఈమేరకు రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పారు. వర్షాలు కురవకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి వల్ల రైతులకు సాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోగలిగామన్నారు.

11/08/2016 - 03:29

విజయవాడ, నవంబర్ 7: సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన సహాయార్థులు, సందర్శకులు, కృతజ్ఞతలు తెలుపుకునేందుకు వచ్చిన ఉద్యోగులతో సోమవారం ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం కోలాహలంగా మారింది. కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన నూతక్కి వేణుగోపాల్‌కు గుండె శస్తచ్రికిత్స కోసం ఆర్థిక సాయాన్ని చంద్రబాబు అందజేశారు.

11/08/2016 - 03:29

శ్రీకాకుళం, నవంబర్ 7: గత ఇరవై రెండేళ్ల నుంచి బిసిల జాబితాల్లో చేర్చమంటూ బిసి-బి, సి, డి కేటగిరీలు కమిషన్ వద్ద చేసుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, చట్టాలకు లోబడే కమిషన్ ఉంటుందని, ఆ మేరకే పనిచేస్తుందంటూ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ కెఎల్ మంజునాథ్ పేర్కొన్నారు. సోమవారం జిల్లాలో బిసి కులాలతో నిర్వహించిన బహిరంగ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

11/08/2016 - 03:28

రాజమహేంద్రవరం, నవంబర్ 7: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు శివారు జంగాల కాలనీలో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదల కాలనీ భస్మీపటలమైంది. మొత్తం 95 గుడిసెలు దగ్ధం కాగా, సుమారు రూ. 2 కోట్ల వరకు ఆస్తినష్టం ఉంటుందని ప్రాథమికంగా అంచనావేశారు. 95 కుటుంబాల వారు కట్టుబట్టలతో మిగిలారు.

11/08/2016 - 02:59

విజయవాడ, నవంబర్ 7: ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేసేందుకు తిరుపతిలో 50 ఎకరాలు స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ మ్యూజియానికి జనవరి 3న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

Pages