S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/24/2015 - 18:17

హైదరాబాద్: తమిళనాడు రాష్ట్రానికి మరోసారి వర్షం ముప్పు తప్పేలా లేదు. ఈనెల 27, 28 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్రలో ఈనెల 28 నుంచి 30 వరకు భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.

11/24/2015 - 16:21

సింగపూర్‌ : సింగపూర్‌ ప్రధాన మంత్రి లీతో భారత ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, వాణిజ్య, రక్షణ అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సుమారు 10 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాధినేతల సమక్షంలో దౌత్య అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

11/24/2015 - 16:06

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 231 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు దాపురించాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొంది. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కరువు మండలాలలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

11/24/2015 - 14:24

హైదరాబాద్: వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్‌కు భారీ ఆధిక్యం లభిచండం పట్ల తెలగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు ఆశీర్వదించారని, వరంగల్‌ ఉప ఎన్నిక ఫలితాలే తెలంగాణ ప్రజల తీర్పు అని వ్యాఖ్యానించారు.

11/24/2015 - 14:23

హైదరాబాద్: వరంగల్‌ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్‌ భారి ఆధిక్యంతో గెలుపొందడం పట్ల రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ గులాబి గుబాళింపు ఖాయమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు వరంగల్‌ ఉప ఎన్నిక ఫలితాలు రెఫరెండమని పేర్కొన్నారు.

11/24/2015 - 13:57

హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ అన్నారు. వరంగల్ లోక్‌సభ ఉపఎన్నిక స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా సర్వే పోటీచేసిన విషయం తెలిసిందే.

11/24/2015 - 13:54

వరంగల్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ఘన విజయం సాధించారు. 4,59,092 ఓట్ల భారీ మెజార్టీతో పసునూరి గెలుపొందారు. ఉప ఎన్నికలో పసునూరి గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు.

11/24/2015 - 13:35

హైదరాబాద్ : వరంగల్‌లో ప్రజా తీర్పును శిరసావహిస్తామని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల ఫలితాలు ఎపుడూ ఈ విధంగానే వస్తాయని, 2019లో తెలంగాణలో టిడిపి గెలుపు తథ్యమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు.

11/24/2015 - 08:26

మంత్రి ఈటల వ్యాఖ్య

11/24/2015 - 08:25

సంగారెడ్డి, నవంబర్ 23: స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని నిరూపించడానికి మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామ ప్రజలు నడుంకట్టి సంపూర్ణ విజయం సాధించారు. ఈ గ్రామంలో మరుగుదొడ్డి లేని ఇల్లులేదు..నిర్మించుకున్న మరుగుదొడ్లను చిన్నపిల్లలతో సహా పండు వృద్ధుల వరకు వంద శాతం వినియోగించుకుంటున్నారు. దీంతో గ్రామంలో ఎక్కడ కూడా బహిరంగ మలవిసర్జన కనిపించడం లేదంటే అతిశయోక్తికాదు.

Pages