S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/24/2016 - 05:02

టోక్యో, సెప్టెంబర్ 23: చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బొరా స్ట్రికోవాతో కలిసి మహిళల డబుల్స్ విభాగంలో పోటీపడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇక్కడ జరుగుతున్న టోరే పాన్ పసిఫిక్ ఓపెన్ టోర్నమెంట్ ఫైనల్ చేరింది. సెమీ ఫైనల్‌లో సానియా, స్ట్రికోవా జోడీ 6-2, 6-2 తేడాతో గాబ్రియేల డబ్రోవ్‌స్కీ (కెనడా), మరియా జోస్ మార్టినా సాంచెజ్ (స్పెయిన్) జోడీపై సునాయాసంగా గెలిచి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.

09/24/2016 - 05:01

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) 2015-16 ఆర్థిక సంవత్స రంలో 111.83 కోట్ల రూపాయలు లాభాన్ని ఆర్జించింది. ఇది భారీ మొత్తమే అయనప్పటికీ, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 55 కోట్ల రూపాయలు తక్కువ. ఖర్చుల కంటే రాబడి గత ఏడాది 166.87 కోట్ల రూపాయలుకాగా, ఈసారి లాభం తగ్గిందని బిసిసిఐ కోశాధికారి అనిరుద్ధ్ చౌదరి తెలిపాడు. బోర్డు ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని అన్నాడు.

09/24/2016 - 03:21

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత్‌లో ఉగ్రవాద దాడులను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌తో ఇప్పట్లో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే ప్రసక్తే లేదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) చైర్మన్ అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశాడు. శనివారం అతను పిటిఐతో మాట్లాడుతూ ఉగ్రవాదానికి పాక్ మద్దతునిస్తున్నదని, ఫలితంగానే ఉరీలోని భారత సైనిక స్థావరంపై దాడి జరిగిందని అన్నాడు.

09/23/2016 - 04:56

కాన్పూర్, సెప్టెంబర్ 22: భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైన 500వ టెస్టు మ్యాచ్ గురువారం ఆరంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది.

09/23/2016 - 04:53

భారత్ టెస్టు క్రికెట్ 500వ మ్యాచ్ మైలురాయిని చేరుకున్న సందర్భంగా కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో గురువారం జరిగిన సన్మాన కార్యక్రమానికి హాజరైన మాజీ కెప్టెన్లు. ఇంత వరకూ 499 టెస్టులు ఆడిన భారత్‌కు న్యూజిలాండ్‌తో ఆరంభమైన మ్యాచ్ 500వ టెస్టు.

09/23/2016 - 04:51

కాన్పూర్, సెప్టెంబర్ 22: ప్రస్తుతం న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికైన 15 మంది సభ్యులతో కూడిన జట్టు మరో పదేళ్లు టెస్టు క్రికెట్ ఆడుతుందని భారత మాజీ కెప్టెన్ సచిన్ తెండూల్కర్ వ్యాఖ్యానించాడు. భారత్ 500వ టెస్టు మ్యాచ్ కివీస్‌తో గురువారం ఇక్కడి గ్రీన్ పార్క్ స్టేడియంలో మొదలైంది.

09/23/2016 - 04:47

టోక్యో, సెప్టెంబర్ 22: జపాన్ ఓపెన్ బాడ్మింటన్‌లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. అయితే, అతను ముందంజ వేయడానికి మన దేశానికే చెందిన అజయ్ జయరామ్‌తో తలపడ్డాడు. తొలి సెట్‌ను 21-16 తేడాతో గెల్చుకున్నాడు. అయితే, కండరాలు పట్టుకోవడంతో జయరామ్ ఆటను కొనసాగించలేకపోయాడు. దీనితో శ్రీకాంత్‌కు క్వార్టర్స్‌లో స్థానం లభించింది.

09/23/2016 - 04:47

బార్సిలోనా, సెప్టెంబర్ 22: బార్సిలోనా సాకర్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ గాయం తిరగబెట్టింది. ఫలితంగా అతనికి మూడు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు ప్రకటించారు. స్పానిష్ సాకర్ చాంపియన్‌షిప్ లా లిగాలో భాగంగా అట్లెటిక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడుతున్నప్పుడు కాలి కండరాలు బెణకడంతో అతను మైదానాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది.

09/23/2016 - 04:46

రియో పారాలింపిక్స్‌లో పాల్గొని గురువారం స్వదేశానికి తిరిగి వచ్చిన జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝజారియా. జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన దేవేంద్రతోపాటు, పారాలింపిక్స్ విజేతలకు విమానాశ్రయంలో కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయల్ తదితరులు ఘన స్వాగతం పలికారు

09/22/2016 - 07:35

ముంబయి, సెప్టెంబర్ 21: తెలుగు వీరుడు, మాజీ వికెట్‌కీపర్ ఎమ్మెస్కే ప్రసాద్ భారత జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యాడు. ఐదుగురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీని బుధవారం ఇక్కడ జరిగిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) ప్రకటించింది. వీరిలో ఇద్దరికి టెస్టు క్రికెట్ ఆడిన అనుభవం లేకపోవడం గమనార్హం.

Pages