రాష్ట్రీయం

త్వరలోనే డిఎస్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ
ఉచిత విద్య నిజం చేస్తాం
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడి
హైదరాబాద్ , డిసెంబర్ 19: త్వరలోనే డిఎస్సీ నిర్వహిస్తామని, రాబోయే విద్యా సంవత్సరములోపు ఖాళీగావున్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీఇచ్చారు. 2016-17లో నాణ్యమైన విద్యను బాలబాలికలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల్లో శనివారం రెండో రాష్టస్థ్రాయి క్రీడోత్సవాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సిఎం కెసిఆర్ మానస పుత్రిక కేజీ టు పీజీ విద్యను నిజం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా విద్యా వ్యవస్థ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలు సాధించడానికి అధికారులకు మార్గనిర్దేశం చేయడం జరిగిందన్నారు. తెలివి ఎవరి సొత్తూకాదని, అగ్రవర్ణాలకు చెందిన కుటుంబాల్లో జన్మిస్తేనే బాగా చదువు కోగలమనేది అవాస్తమని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న పిల్లలు రుజువు చేస్తున్నారన్నారు. చదువుకోవడానికి అనువైన వాతావరణం కల్పించడం ద్వారా పేద పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి, నివేదిక ఆధారంగా ప్రభుత్వ వసతి గృహాల్లో విద్య అభ్యసిస్తున్న పిల్లలకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ప్రవీణ్‌కుమార్‌లాంటి అధికారులు ఇరవై మంది ఉంటే బంగారు తెలంగాణ సాధించడం అసాధ్యమేమీ కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాధిస్తున్న అభ్యున్నతి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కావాలని అభిలషించారు. డిప్యూటి స్పీకర్ పద్మా దేవెందర్‌రెడ్డి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ వసతి గృహాలను మరింత బలోపేతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు వెళ్తుందన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేజీ టు పీజీ విద్య దేశంలోని ఇతర రాష్ట్రాలకు సైతం మార్గదర్శకం చేయాలని అభిలషించారు. అక్షరజానం లేని కుటుంబాల నుంచి వచ్చిన నిరుపేద పిల్లలు మంచి క్రమశిక్షణ కలిగిన సైనికులుగా మారడం అభినందించదగిన పరిణామమన్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించడం ద్వారా బంగారు భవిష్యత్‌కు పునాది వేయాలని విద్యార్థినీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. కొండలను సైతం ఢీ కొనగలమనే ఆత్మస్థయిర్యం పిల్లల కళ్లల్లో కనిపిస్తోందన్నారు. మరో ఒలంపిక్స్ మాదిరిగా పిల్లల చేత మార్చ్ఫాస్ట్ చేయించడం సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల నైపుణ్యానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ తదితరులు పాల్గొన్నారు.