రాష్ట్రీయం

యాగం జరిగే చోట చండీమాత ఆలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం
హైదరాబాద్, డిసెంబర్ 19: మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో అయుత చండీయాగం నిర్వహిస్తున్నచోట చండీమాత ఆలయం నిర్మించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. యాగంతో పవిత్రమవుతున్న ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాలకు ఆలయం అందుబాటులో ఉండేందుకు వీలుగా చండీమాత ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. పాలరాతి కట్టడంతో ఆలయాన్ని నిర్మించనున్నారు. గడిచిన రెండువందల సంవత్సరాల కాలంలో చండీయాగాన్ని ఇతరులు ఎవరూ నిర్వహించలేదు. 2011లో శృంగేరీ పీఠాధిపతి షష్టిపూర్తి సందర్భంగా చండీయాగం నిర్వహించారు. అయితే రెండువందల ఏళ్ల కాలంలో శృంగేరీ పీఠం వాళ్లు కాకుండా బయటివారు, రాజకీయ నేతలు ఎవరూ నిర్వహించలేదు. ఈ విషయాన్ని శృంగేరీ పీఠానికి యాగం గురించి చెప్పడానికి కెసిఆర్ వెళ్లినప్పుడు వారీ విషయం చెప్పారు. దాంతో భారీఎత్తున యాగాన్ని నిర్వహించడమే కాకుండా కలకాలం గుర్తుండేలా ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు.
ఎవరైనా ప్రత్యేక దుస్తులతోనే
మరో మూడు రోజుల్లో చండీయాగం ప్రారంభమవుతుంది. వేల సంఖ్యలో భక్తులు, ప్రముఖులు వస్తుండటంతో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్టప్రతి, ప్రధాని సైతం ప్రత్యేక దుస్తుల్లోనే యాగం జరిగే ప్రదేశానికి రావాల్సి ఉంటుంది. 1500మంది రుత్వికులు యాగం నిర్వహిస్తారు. అయితే యాగం నిర్వహించే వారి వద్దకు ఎవరినీ అనుమతించరు. రుత్వికుల వద్దకు వెళ్లడానికి రాష్టప్రతి, ప్రధాని ఎవరైనా ప్రత్యేక దుస్తులతో వెళ్లాలి. దానికోసం తాత్కాలికంగా ప్రత్యేక గదులు నిర్మించారు. యాగం నిర్వాహణకు నిధుల సమస్య ఉండదని, అయితే కఠినమైన నిష్టతో యాగం నిర్వహించాల్సి ఉంటుందని, దాన్ని కచ్చితంగా పాటించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.