రాష్ట్రీయం

నిరుద్యోగ యువతకు ‘సైబర్ సెక్యూరిటీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ట్రైనింగ్

విజయవాడ, డిసెంబర్ 6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే బృహత్ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2029వ సంవత్సరం లక్ష్యంగా, ప్రపంచంలో భారతదేశాన్ని, రాష్ట్రాన్ని అగ్రపథాన నిలబెట్టేలా విజ్ఞాన, నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమైంది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీ (ఎన్‌ఎఎస్‌ఎస్‌సిఓఎం), ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్‌ఎస్‌డిసి) సంయుక్తంగా సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి సాంకేతిక సంబంధమైన కోర్సుల్లో యువతకు శిక్షణ ఇప్పించి సురక్షిత, సుశిక్షిత సమాజ నిర్మాణానికి తమవంతు ప్రయత్నం చేయనున్నాయి. ఈ నైపుణ్యమైన శిక్షణ కార్యక్రమాన్ని యువతకు అందించడానికి, 2015వ సంవత్సరానికి గాను 77 మిలియన్ అమెరికన్ డాలర్లని ఖర్చు పెట్టడమే కాక ప్రతి సంవత్సరం 8 శాతం అధికంగా ఖర్చు పెట్టడానికి ఐటి సెక్యూరిటీ మార్కెట్ అంచనాలను సిద్ధం చేసింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అవసరమైన శ్రామిక బలం కన్నా 1.5 మిలియన్ల మంది తక్కువగా, 4 మిలియన్ల మందిగా ఉన్న కార్మిక శక్తిని 2019 సంవత్సరం వరకు 6 మిలియన్లకు పెంచడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. భారతదేశంలోని సాఫ్ట్‌వేర్ రంగంలో ఐటీ సెక్యూరిటీ మార్కెట్ ఒక్క శాతం ఉంది. 2015 చివరికల్లా ఐటీ సెక్యూరిటీ మార్కెట్ అమాంతం పెరిగి 250 మిలియన్ల అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని తేనుంది. అప్లికేషన్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షల మందికిపైగా ఉద్యోగాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఏపిఎస్‌ఎస్డీసీ, ఎన్‌ఏఎస్ ఎస్సీఓఎంలు రెండు చోట్ల సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిస్ట్ కోర్సులపై విడతల వారిగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలని నిర్వహించాలని ప్రతిపాదించింది. ఈ కోర్సులు అభ్యసించడం ద్వారా సెక్యూరిటీ అనలిస్ట్, అసోసియేట్ - అనలిటిక్స్ వంటి చోట్ల ఉద్యోగాలు లభించడంతో పాటు మరిన్ని ఇతర సంస్థల్లో కూడా ఉద్యోగాలు పొందవచ్చని ప్రాథమికంగా గుర్తించారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 36 విద్యాలయాలు యూఎస్‌తో భాగస్వామ్యమై నియమించిన నిపుణులైన ప్యాకల్టీతో ఎంఓటి ప్రోగ్రామ్ నిర్వహించి శిక్షణ ఇప్పించనుంది. ఈ మొదటి మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్ ఎన్‌ఎఎస్ ఎస్సీఓఎం సహకారం అందించనుంది. శిక్షణ పూర్తయ్యాక, ప్రీ ఫైనల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు కోర్సులు నేర్చుకునే అవకాశం కల్పించనున్నారు.
ఎన్‌ఎ ఏఎస్‌ఎస్సీఓఎం నిపుణుల సహాయంతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ కోర్సులని విద్యార్థులకు నేర్పించనున్నారు. మొదటి మాస్టర్ ఆఫ్ ట్రైనింగ్‌ని హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీ క్యాంపస్‌లో ఉన్న సీఆర్ రావ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈనెల 7 నుంచి డిసెంబర్ 11వరకు ఏపిఎస్‌ఎస్ డిసి, ఎన్‌ఏఎస్‌ఎస్సీఓఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు సంస్థ డెప్యూటీ సీఈవో యూ అపర్ణ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 36 విద్యాలయాల్లోని యువతకు సైబర్ సెక్యూరిటీ కోర్స్ చెప్పడానికి 33 మందికి పైగా ప్రావీణులైన అధ్యాపకులు, డేటా అనలిటిక్స్ కోర్సుని 34 మందికి పైగా ఉద్దండులైన ప్యాకల్టీతో అసక్తిగల వారికి శిక్షణ ఇవ్వనున్నామని నిర్వాహకులు ప్రకటించారు.