Others

అలా.. అన్నమాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తి జాతిలో విప్లవ జ్వాలలు రేకెత్తించే విభిన్న కథాంశంతోకూడి జమున మొట్టమొదటిసారిగా నటించిన చిత్రం రాజా ప్రొడక్షన్స్ ‘పుట్టిల్లు’ (1953). ప్రజానాట్య మండలిలో ప్రముఖ పాత్ర వహించిన డాక్టర్ గరికపాటి రాజారావు కథ తానే వ్రాసుకొని దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం యిది. హీరో వేషం కూడా రాజారావే వేశారు. తొలి చిత్రంలోనే జమున ‘గ్లామర్‌గర్ల్’గా పేరుతెచ్చుకుంది. పెరుమాళ్లు, చదలవాడ, అల్లు రామలింగయ్య, మిక్కిలినేని, సురభి కమలాబాయి యితర పాత్రలలో నటించారు. నటి దేవిక కాలేజి స్టూడెంట్ వేషం వెయ్యడం విశేషం. సుంకర రచన సంగీతం మోహన్‌దాస్. ప్రజాదరణ పొందలేకపోయిందీ చిత్రం.
*
చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించిన అశోకావారి చిత్రం ‘నా చెల్లెలు’ (1953), అమర్‌నాథ్, సూర్యకళ, రామశర్మ, జి.వరలక్ష్మి, చలం నటించారు. బలవత్తరమైన కారణాలు చూపకయే అనవసరంగా చిత్రాన్ని విషాదాంతం చేయడంతో ప్రజాదరణకు నోచుకోలేకపోయింది. ‘ఎన్‌తంగై’అనే తమిళ చిత్రాన్ననుసరించి రుూ చిత్రం నిర్మించారు. ఈ కథనే సుఖాంతంచేసి ‘్ఛటేబహెన్’పేరుతో హిందీలో నిర్మించి యల్.వి.ప్రసాద్ అఖండ విజయం సాధించారు. ఈ హిందీ చిత్రం ఆధారంగానే యన్.టి.ఆర్, చంద్రకళలతో కె.హేమాంబరధరరావు దర్శకత్వంలో ‘ఆడపడుచు’ (1967) నిర్మించటం జరిగింది. శత దినోత్సవాలు జరుపుకొందీ చిత్రం.
*
తెలుగులో నిర్మించిన తొలి తెలుగు కలర్ సాంఘిక చిత్రం ‘తేనె మనసులు’ (1965). అంతా కొత్త తారలతో నిర్మించిన చిత్రమిది. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు చేసిన సాహసవంతమైన ప్రయోగంగా పత్రికలన్నీ అభివర్ణించాయి. పత్రికా ప్రకటనలిచ్చి, ఇంటర్వ్యూలు, టెస్టులు జరిపి ప్రధాన పాత్రలకు కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి అనే వారిని సెలెక్ట్‌చేశారు. ఆదుర్తి సుబ్బారావు, కె విశ్వనాథ్, ముళ్లపూడి వెంకటరమణ, టి మాధవరావు వంటి ప్రముఖులు చేసిన ఈ సెలెక్షన్‌లో తగిన పాత్రలకై ప్రయత్నించి ఇంటర్వ్యూలకు హాజరైన హేమమాలిని, జయలలితవంటి వారిని యెన్నిక చేయకపోవటం ఆశ్చర్యకరమైన విషయం. ‘పదండి ముందుకు’, ‘కులగోత్రాలు’ చిత్రాల్లో కొన్ని దృశ్యాల్లో కన్పించిన కృష్ణను ముఖ్య నటుడిగా ఎన్నిక చేశారు. చిన్న పాత్రలకు కూడా కొత్తవారినే తీసుకున్నారు. చిత్రం విడుదల రోజున విజయవాడలో విమానం నుంచి కరపత్రాలను వెదజల్లారు. చిత్రం విడుదలైన మూడు వారాలకే దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కొత్త తారలను వెంటబెట్టుకొని ప్రతి కేంద్రంలో వారిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. జయశ్రీ అనే కొత్త నర్తకి చిత్రంలో ‘ఎవరో ఎవరో నీవారు’ అంటూ చక్కని నృత్యం చేసింది. ఆత్రేయ, దాశరథి వ్రాసిన పాటలకు కెవి మహదేవన్ కూర్చిన బాణీలు పాపులర్ అయ్యాయి. చిత్రం శతదినోత్సవాలు జరుపుకుంది. ఈ చిత్రం ఆధారంగా హిందీలో ఆదుర్తి సుబ్బారావు స్వయంగా నిర్మించిన చిత్రం మాత్రం పరాజయం పాలైంది.
*
అన్నపూర్ణావారి ‘చదువుకున్న అమ్మాయిలు’ (1963) విడుదలైన రెండవ రోజునే హైదరాబాద్‌లోను, గుంటూరులోను మెడికల్ రెప్రజెంటేటివ్స్ కొందరు కేసువేశారు. చిత్రంలో పద్మానాభం మెడికల్ రెప్రజెంటేటివ్. అతను ఇ.వి.సరోజ వెంటపడి యేడ్పిస్తూంటే కాలి చెప్పు విసిరేస్తుంది. ఆ చెప్పును అలాగే బ్యాగులో పెట్టుకొని పరుగెత్తుతాడు పద్మనాభం. ఈ కారణంగా కోర్టుకెక్కి మెడికల్ రెప్రజెంటేటివ్స్ పరువు తీశారు. వెంటనే సినిమా ప్రదర్శనను నిలిపివేయాల్సిందిగా వాదించారు. అయితే రుూ కేసు సిల్లీ అయినదిగా భావించి కోర్టు కొట్టివేసింది.

-పూజారి నారాయణ, అనంతపురం