సబ్ ఫీచర్

నిలువెత్తు హుందాతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాలువా.. మూడే అక్షరాలు. రెండే మీటర్లు. కేవలం ఓ దీర్ఘ చతురస్రాకారపు వస్త్రం. కానీ అది పొందిగ్గా భుజాలమీద అమరితే అది అందమైన అలంకారం. అరుదైన పురస్కారం. నిండైన ప్రేమభావం, నిలువెత్తు హుందాలాంటిది.
మనదేశంలోనేకాక ప్రపంచ వ్యాప్తంగా అనేక సంప్రదాయాలకు సంకేతం ఈ శాలువ. ప్రార్థనలు, పండగల సందర్భాల్లో జ్యూయిష్ ప్రజలు తలిత్ అని పిలిచే శాలువాను ధరిస్తారు. జర్మనీ, లాటిన్ అమెరికా దేశాల్లో ఇప్పటికీ జానపద దుస్తుల్లో భాగంగా దీన్ని ధరిస్తారు. ఐరోపా మహిళలకు ఇది ఒక ఫ్యాషన్ వస్త్రం లాంటిది.
ఎప్పుడూ శాలువా లేని పురచ్చితలైవి జయలలితని, షీలా దీక్షిత్‌ను చూసేవాళ్లం కాదు. ఇప్పుడు సోనియా గాంధీ, మమతా బెనర్జీతోపాటు మరెందరో రాజకీయ, సినీ ప్రముఖులు దీన్ని కప్పుకోవడం, కప్పించుకోవడం తరచూ చూస్తుంటాం. కొందరు ప్రముఖులు చీర పమిటలా భుజంమీద వేసుకుంటారు. ఇదో అందం. నరేంద్ర మోడీలా, కాశ్మీర్ పురుషులకు శాలువా వస్తధ్రారణలో ఒక భాగమైతే, ఇంకొందరికి ఇష్టమైన
సంప్రదాయంగా మారింది. చలి బారినుండి రక్షించడమే వీటి ప్రధమ కర్తవ్యం. అయితే హుందాతనం, అలంకారం కోసం శాలువాను ధరిస్తారు. అభినందనలను, గౌరవ పురస్కారాలకు చిహ్నంగా శాలువాను వినియోగిస్తున్నారు. మనకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా శాలువ అనేకానేక సంప్రదాయాలకు సంకేతంగా మారింది. మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా వారి దుస్తుల్లో భాగంగా దీన్ని ధరిస్తున్నారు.
మన మహిళలకైతే ఇప్పుడిప్పుడే ఇదో అద్భుతమైన ఫ్యాషన్ గార్మెంట్‌లా మారుతోంది. ఇంతటి ప్రాచుర్యం పొందిన శాలువాలు, వాటి రకాల గురించి తెలుసుకుందాం.
19వ శతాబ్దంలో పాశ్చాత్య దేశాలలో ఖరీదైన ఫ్యాషన్‌గా రాజ్యమేలాయి. దాంతో అప్పటి మొఘల్ చక్రవర్తులు, బ్రిటీష్, డచ్, ఫ్రెంచ్ వ్యాపారులకు వీటిని బహుమతులుగా ఇచ్చేవారు. శాలువాల్లో ఒకే రంగు దారంతో అల్లినవీఐ రంగు రంగుల దారాలతో అల్లినవీ, ఎంబ్రాయిడరీతో చేసినవీ ఉంటాయి. ఎంబ్రాయిడరీ శాలువాలు ఎక్కువగా చైనాలోనే తయారవుతాయి.
అయితే శాలువాల తయారీకి కాశ్మీర్ పెట్టింది పేరు. ఇప్పటికే శాలువా కొనాలనుకున్నవాళ్ళెవరైనా కాశ్మీర్‌దే కావాలంటారు. అందుకే శాలువాకు కాశ్మీర్ ఇంటిపేరుగా స్థిరపడిపోయింది. పౌరాణిక పాత్రల్ని, హిమగిరుల సోయగాల్ని ముఖ్యంగా అక్కడ పెరిగే కోన్ ఆకారంలోని పైన్ చెట్లన్నీ కలిపిన డిజైన్లతో అల్లిన కాశ్మీర్ శాలువాలు ఎంతో అందంగా ఉంటాయి. వీటిల్లో సాదా ఊలు, పష్మీనా, పాతూష్ ఊలు అని మూడు రకాలవి ఉంటాయి. అన్నింటిలో పష్మీనాతో అల్లినవే ఉంటాయి. ఇవే అత్యంత మృదువైనవీ, ఖరీదైనవీనూ. దీని తరువాతదే పాతూష్. పష్మనాను టిబెటన్ భాషలో కష్మేరీ అని పిలుస్తారు. పషమే అంటే లోపలిభాగం అని అర్థం. దీన్నించి వచ్చిందే పష్మీనా. అంటే 12 నుంచి 14 వేల అడుగుల ఎత్తు వున్న హిమాలయ సానువుల్లో మాత్రమే పెరిగే కాప్రా హిర్కస్ మేకల పొట్ట భాగం నుంచి తీసినదానే్న కష్మేరీ లేదా పష్మీనా ఊలు అంటారు. ఈ మేకల ఊలులో అధికంగా వుంటే ప్రొటీన్ల కారణంగా అది మంచి మెరుపుతో మృదువుగా వుంటుంది. ప్రపంచలోకెల్లా ఉత్తమమైనదిగా పేరొందిన ఈ ఊలు కేవలం కాశ్మీర్‌లో మాత్రమే లభిస్తుంది.
సుమారు రెండు వందల సంవత్సరాల క్రితమే యూరోపియన్లకు ఈ పష్మీనా శాలువాల ఘనత తెలిసింది. అయితే కాష్మేరీకి కాశ్మీర్‌కీ పలకడంలో పెద్ద తేడా లేకపోవడంతో దీనినే వాళ్లు కాశ్మీర్ షాల్‌గా పిలుస్తారు. ఉంగరంలో దూరిపోయేంత మృదువుగా వుంటే ఈ శాలువాలు, ఉలెన్ కోటుకన్నా ఎక్కువ వెచ్చదనాన్ని ఇస్తాయని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఎందుకుంటే హిమాలయాల్లో సంచరించే ఈ మేకల నుంచి తీసిన ఊలు పోగులు వాటిల్లోని అధిక ప్రొటీన్ల కారణంగా చలిని తట్టుకోగలవు. మనిషి వెంట్రుక మందం 75 మైక్రాన్లు వుంటే, వీటి మందం 12-14 మైక్రాన్లకి మించదు. అయినప్పటికీ వెచ్చదనం మాత్రం చాలా ఎక్కువ. దాంతో పష్మీనా ఊలుతో పైస్లీలోనూ శాలువాలు తయారుచేయడం ప్రారంభించారు. కానీ, అవి కాశ్మీరీ మహిళల పనితనానికి సాటిరావు. ఎంత గొప్ప మెషీన్లమీద చేసినవైనా ఒక్కో పోగునూ వేరుచేసి అల్లేవారి నైపుణ్యంముందు తీసికట్టే. అందుకే ఇప్పటికీ మన భారతీయ పష్మీనా శాలువాలకు డిమాండ్ ఎక్కువ. విదేశీయులకు కూడా మన శాలువాలపై తగని మక్కువ. అది షాల్, రాప్, స్టోల్ లేదా స్కార్ఫ్.. ఏదైనా సరే కాశ్మీరీదయితే చాలు. హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. పాశ్చాత్య దేశాల్లో కాశ్మీర్ శాలువాలు ఖరీదైన ప్యాషన్‌గా రాజ్యమేలుతున్నాయంటే ఆశ్చర్యపడక తప్పదు.
రంగులు - రకాలు
శాలువాల్లో మూడు రకాలున్నాయి. ఒకే దారంతో అల్లినవీ ఒకరకమైతే రంగు రంగుల దారాలతో అల్లినవి మరోరకం. ఎంబ్రాయిడరీతో చేసినవి మూడోరకం. రంగులెలా వున్నా శాలువాకి పలు రూపాలు కూడా ఉన్నాయి. పొడవు పెంచి మెడ చుట్టూ వేస్తే స్టోల్‌గా, సైజుని బాగా తగ్గించి తలమీదుగా ముడి వేస్తే స్కార్ఫ్‌గా చెప్పవచ్చు. పేర్లు వేరైనా వీటన్నింటి పరమార్థం ఒక్కటే. చలినుంచి కాపాడడం. ఇంకా చెప్పాలంటే బయట తిరిగేటప్పుడు అవసరార్థం ఫ్యాషన్‌గా ధరించే అదనపు వస్త్ర విశేషాలే ఇవి. అయితే ఈమధ్య శాలువా మరో కొత్త రూపాన్ని సంతరిచుకుందండోయ్.. అదే షాల్ షాంబస్. కప్పుకోనక్కరలేకుండా తొడుక్కునేందుకు వీలుగా వుంటే ఇవి యువతకి ఎంతో నచ్చేశాయి. ఏ దుస్తులమీదకైనా ఇవి చక్కగా ఒదిగిపోవడంతో అద్భుతమైన వింటర్ ఫ్యాషన్ గార్మెంట్‌గా అవతరించాయి.

-కంచర్ల