Others

దర్శకత్వంపైనే నా ఫోకస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా అంటే పిచ్చి. ఆ ఫీల్డ్‌లో ఇదే చేయాలన్న రూల్సేంలేవు. కాకపోతే -దర్శకత్వంపై ఆసక్తి అంతే. ఒకవేళ నేను చేసిన సినిమాలు ఫ్లాపైతే క్యారెక్టర్ ఆర్టిస్టుగానైనా చేస్తా. అదీకాకుంటే చాయ్ అమ్ముకుని బతుకుతా. బట్, నచ్చిందే చేస్తా -అంటున్నాడు దర్శకుడు, హీరో తరుణ్ భాస్కర్. తరుణ్, వాణీభోజన్, అనసూయ ప్రధాన పాత్రలుగా హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా తమిళ దర్శకుడు షామీర్ సుల్తాన్ తెరకెక్కిస్తోన్న చిత్రం -మీకు మాత్రమే చెప్తా. విడుదలకు సిద్ధమవుతోన్న సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం తరుణ్ భాస్కర్ మీడియాతో మాట్లాడాడు.
మీకు మాత్రమే చెప్తా సినిమాకు నువ్వే హీరో అని విజయ్ చెప్పినపుడు -నమ్మలేదు.
ఓ మధ్య తరగతి కుర్రాడి పాత్ర నాది. గ్లామరస్ రోల్ కాదు. అందుకే -్ఫజిక్‌మీద ఫోకస్ లేదు. నువ్వెలా ఉంటావో అలాగా ఉండొచ్చు అన్నాడు విజయ్. సరే అన్నా. ప్రీప్రొడక్షన్స్ పూరె్తైన తరువాత మాత్రం -కొంచెం తగ్గితే బావుంటుందేమో అన్నాడు. అప్పుడూ తప్పలేదు. కష్టపడి తగ్గా.
దర్శకుడు షామీర్ సుల్తాన్. తమిళంలో ఓ షార్ట్ఫిల్మ్ మేకర్. ఆయన విజయ్‌కి స్టోరీ చెప్పినపుడు నచ్చిందట. ఇప్పుడున్న ఇమేజ్‌కు, బిజీ షెడ్యూల్‌తో పాత్ర చేయాలనుకోలేదు. బట్, స్టోరీ వదలుకోలేదు. అందుకే ప్రాజెక్టు ఇలా కనె్వర్ట్ అయ్యింది.
విజయ్ చేయాల్సిన క్యారెక్టర్ అననుగానీ, తను పిక్ చేసుకున్న క్యారెక్టర్. అలాగే, మహానటిలో నేను చేసిన చిన్న రోల్ షామీర్ చూశాడట. అలా యాంగ్జైటీ చూపించాల్సిన పాత్ర ఇది. అందుకే ఆయన ఓకే చేసుకున్నాడు.
కెరీర్‌కి సంబంధించి ప్రత్యేకమైన ప్రణాళిక అంటూ ఏమీ లేదు. నేనొచ్చిన బ్యాగ్రౌండ్ ప్రభావం నాపై ఉంటుంది కనుక -అలాంటి ప్రణాళికలైతే ప్రస్తుతానికి లేవు. దర్శకత్వం, నటన, డిపార్ట్‌మెంట్ ఫ్రెండ్స్‌కి హెల్ప్, తమిళ స్క్రిప్ట్‌ల ట్రాన్స్‌లేషన్, లిరిక్స్.. ఇలా ఏదైనా చేస్తా. ప్రతి విషయంలో నేర్చుకుంటా. బట్, ఫోకస్ మాత్రం డైరెక్షన్‌పైనే.
ప్రైవసీని ఫోకస్ చేస్తూ డిఫరెంట్ యాంగిల్స్‌లో డిస్కషన్ జరిపే కథ ఇది. ఆ విషయానే్న ఎంటర్‌టైనింగ్ యాంగిల్‌లో చెప్తున్నాడు దర్శకుడు.
ఈ ప్రాజెక్టుకి తెలుగు డైలాగ్స్ నేనే రాశాను. తమిళ ట్రాన్స్‌లేషనే కానీ, కొంచెం ఇంప్రొవైజేషన్ చేసి చూపించా.
దర్శకుడిగా విజయ్‌లో ఆర్టిస్ట్‌ని చూశా. ఇప్పుడు నిర్మాతగా అతని మల్టీ టాస్క్ టాలెంట్స్ చూస్తున్నా. కొన్ని క్రియేటివ్ చాయిసెస్ బాగా చేయగలడు. ప్యాకేజింగ్, మార్కెటింగ్.. ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్‌లానే ఉంటాడు.