రాష్ట్రీయం

నిజామాబాద్‌లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్షణ మంత్రి పారికర్‌కు విజ్ఞప్తి చేసిన తెరాస బృందం
హైదరాబాద్, డిసెంబర్ 3: నిజామాబాద్‌లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీతో పాటు సైనిక రిక్రూట్‌మెంట్ కార్యాలయాన్నీ, బాలికల సైనిక్ స్కూలును ఏర్పాటు చేయాలని నిజామాబాద్ ఎంపి కవిత నేతృత్వంలో బృందం రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌ను కోరింది. గురువారం ఎంపిలు కవిత, జితేందర్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఈటెల రాజేందర్ బృందం రక్షణ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉన్న నిజామాబాద్‌లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. సైనిక రిక్రూట్‌మెంట్ కార్యాలయం సికింద్రాబాద్‌లో ఉండడం వల్ల శివారు జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఉద్యోగాల ఎంపికకు రావడం కష్టంగా ఉన్నందున నిజామాబాద్ కేంద్రంగా సైనిక రిక్రూట్‌మెంట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే మహిళలకు రక్షణ శాఖలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నందున బాలికలను ప్రోత్సహించేందుకు నిజామాబాద్‌లో బాలికల సైనిక స్కూలు ఏర్పాటు చేయాలని కోరారు. డిమాండ్లను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారని కవిత కార్యాలయం తెలిపింది.