కృష్ణ

కార్పొరేట్లకు దోచిపెడుతూ దేశభక్తిగా చెప్పుకోవడం సిగ్గుచేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ : కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతూ దీనే్న దేశభక్తిగా చెప్పుకోవడం సిగ్గుచేటని సీపీఎం, సీపీఐ రాష్ట్ర నేతలు వీ వెంకటేశ్వర్లు, బుట్టి రాయప్ప అన్నారు. ఆదివారం స్థానిక కొత్త మున్సిపల్ కార్యాలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. దేశంలో రూ.1.76 లక్షల కోట్లను వ్యవసాయం, పరిశ్రమలకు ఖర్చు పెట్టడం ద్వారా పెద్దఎత్తున ఉపాధి కల్పించవచ్చనే వాస్తవాన్ని విస్మరించి కార్పొరేట్లకు ధారదత్తం చేశారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ మతతత్వ విధానాలను బీజేపీ అనుసరిస్తూ ఆంక్షలు విధిస్తోందన్నారు. సామాన్యులపై భారాలు మోపుతున్నారన్నారు. ఉపాధి రంగాలతో పాటు రోడ్లు, వంతెనలు వంటి వౌలిక సదుపాయాలకు ప్రభుత్వరంగ పెట్టుబడులను పెంచి ప్రజల ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. కులం, మతం, భాష తదితర రూపాల్లో ప్రభుత్వం రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందన్నారు. గత కేంద్ర ప్రభుత్వం ఆరు విమానాశ్రయాలను ప్రైవేట్‌పరం చేస్తే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఏకంగా 25విమానాశ్రయాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిందన్నారు. దీంతో పాటు రైల్వేను కూడా ప్రైవేటీకరించడం దారుణమన్నారు. పరిశ్రమల రంగంలో కూడా 49శాతాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతామని ప్రకటించడం సరికాదన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్నిరంగాల్లో కోట్లాది మంది ప్రజలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి దాపురించిందన్నారు. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాలు, 18న నిరసనలు, రాస్తారోకోలు జరుగుతాయన్నారు. ఈ సభలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్‌సీపీ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం తూర్పు కృష్ణా కార్యదర్శి ఎం రాజేష్, సీపీఐ గుడివాడ ఏరియా కార్యదర్శి గూడపాటి ప్రకాష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.