కృష్ణ

కమిషనరేట్ పరిధిలో లాక్‌డౌన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ క్రైం: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై మన దేశం యుద్ధాన్ని ప్రకటించటంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న భద్రతాపరమైన చర్యల్లో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ నెల 31వరకు లాక్‌డౌన్ పాటించాలని పోలీసు కమిషనర్ ద్వారకాతిరుమలరావు ఆదివారం రాత్రి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన క్రమంలో అప్రమత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 23న జరిగే స్పందన కార్యక్రమం ఉండదని, ఏవైనా సమస్యలుంటే ప్రజలు పోలీసు వాట్సాప్ నంబర్ 7328909090, 100 లేదా సమీపంలోని పోలీసు స్టేషన్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాలని చెప్పారు. అనవసరంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లరాదని సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయట తిరగవద్దని, మరీ ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్త వహించాలన్నారు. నిత్యావసర వస్తువులు, వైద్యం, ఔషధాల కోసం మాత్రమే బయటకు రావాలని కోరారు. వ్యాపారస్తులు ఎవరైనా నిత్యావసర వస్తువులైన పాలు, కూరగాయలు, మాస్క్‌లు, శానిటైజర్లు, ఇతర సామగ్రిని ఎక్కువ ధరకు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాపార దృక్పథంతో వ్యవహరించ రాదన్నారు. ప్రజలు రాష్ట్ర సరిహద్దులు దాటే ప్రయాణాలు అత్యవసరం అయితే తప్ప చేయరాదని, ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గుళ్లు, మసీదులు, చర్చీలకు భక్తులను అనుమతించరాదని ఆయా ప్రార్థనా మందిరాల్లో పూజా, నైవేద్య కార్యక్రమాలు తప్ప ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. విదేశాల నుండి వచ్చినవారు ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వారి దగ్గరలోని వైద్యులను లేదా అధికారులు సంప్రదించాలన్నారు. లేదా 104కు సమాచారం ఇవ్వాలని, విదేశాల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా 14రోజుల వరకు వారి ఇళ్లల్లో హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప ఆటోలు, టాక్సీలు, వాడరాదన్నారు. నీరు, కూరగాయలు, పాలు, ఎలక్ట్రిసిటీ, టెలికాం, మందుల షాపులు, పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్‌లలో రెండు మీటర్ల దూరం పాటింటాలన్నారు. ప్రతిఒక్కరూ లాక్‌డౌన్ పాటించి కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి సహకరించాలని పోలీసు కమిషనర్ ద్వారకాతిరుమలరావు విజ్ఞప్తి చేశారు.