కృష్ణ
కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల్లో మళ్లీ పెరుగుదల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మచిలీపట్నం : గత ఐదు రోజులుగా స్థిరంగా ఉన్న కరోనా పాజిటివ్ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. ఐదు రోజులుగా 35 పాజిటివ్ కేసులకే పరిమితమైన జిల్లాలో సోమవారం ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదైంది. అది కూడా విజయవాడ నగరంలో కావడం విశేషం. గతంలో పాజిటివ్ వచ్చిన భర్త నుండి భార్యకు వ్యాధి సంక్రమించింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 36కు చేరింది. పాజిటివ్ వచ్చిన వారిలో ఇప్పటికే నలుగురు పూర్తి స్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ కాగా మిగిలిన 32 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కరోనా లక్షణాలతో ముందుకు వచ్చిన వారి సంఖ్య వెయ్యి దాటింది. సోమవారం ఒక్క రోజే 51 మంది అనుమానితులు కోవిడ్-19 ఆస్పత్రిలో చేరడం విశేషం. జిల్లాలో మొత్తం 1179 మంది కరోనా లక్షణాలతో బాధ పడుతుండగా వీరి రక్తనమూనాలను వైద్యులు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 749 మందికి నెగిటివ్ రిపోర్టు రాగా మరో 394 మందికి సంబంధించిన రిపోర్టులు రావల్సి ఉంది.
జిల్లాలో మొత్తం 32 క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయగా 16 క్వారంటైన్‌లలో 420 మంది అనుమానితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 2443 మంది విదేశాల నుండి జిల్లాకు వచ్చి గృహ నిర్బంధంలో ఉండగా వీరిలో 1735 మంది హెల్త్ ప్రోటోకాల్ ప్రకారం 28 రోజుల గృహ నిర్బంధాన్ని పూర్తి చేసుకున్నారు. మరో 708 మంది 28 రోజుల లోపు గృహ నిర్బంధాన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంది. కాగా కేసుల తీవ్రత ఉన్న ప్రాంతాల్లో రెడ్‌జోన్ కొనసాగుతోంది. ఆయా ప్రాంతాల ప్రజల ఆరోగ్య సమస్యలపై ఇప్పటికే రెండు విడతలు సర్వే పూర్తి చేయగా మూడవ విడత సర్వే వేగవంతంగా సాగుతోంది. రెడ్ జోన్ ప్రాంత వాసులను అధికారులు ఇళ్లకే పరిమితం చేశారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నింటినీ డోర్ డెలివరీ చేయిస్తున్నారు. కేసుల తీవ్రతను తగ్గే వరకు రెడ్ జోన్ అమలు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.