కృష్ణ

పాజిటీవ్ కేసు విషయంలో ఆందోళన వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనడం హర్షణీయమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం ఆయన తన ఇంటికే పరిమితమయ్యారు. ఉదయం నుండి రాత్రి వరకు ఇంట్లో ఉన్న ఆయన తనను కలిసేందుకు కూడా ఎవ్వరినీ ఇంటికి రావద్దని ముందుగానే చెప్పారు. దీంతో ఎప్పుడూ ప్రజలతో రద్దీగా ఉండే తన కార్యాలయం వెలవెలబోయింది. కుటుంబ సభ్యులతో ఇంటికే పరిమితమైన మంత్రి పేర్ని నాని తన ఆరాద్య దైవమైన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కిన యాత్ర సినిమాను వీక్షించారు. అలాగే వైర్‌లెస్ సెట్ ద్వారా నగరంలో కర్ఫ్యూ పరిస్థితిని తెలుసుకున్నారు. పారిశుద్ధ్య చర్యలు, మంచినీటి సరఫరాలపై నగర పాలక సంస్థ అధికారులకు వైర్‌లెస్ సెట్ ద్వారా పలు ఆదేశాలు జారీ చేశారు. వారం పది రోజుల పాటు క్రమం తప్పకుండా పారిశుద్ధ్య చర్యలు కొనసాగించాలన్నారు. ఎక్కడా కూడా అపరిశుభ్ర వాతావరణం లేకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి సరఫరాను కూడా మెరుగుపర్చాలని సూచించారు. అధికారులు తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియచేయాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మీడియా సందేశం ఇచ్చారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరారు. జిల్లాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నట్టు తెలిపారు. విజయవాడలో నమోదైన పాజిటీవ్ కేసుకు సంబంధించిన యువకుడికి ఎటువంటి ప్రాణాపాయం లేదన్నారు. ఆ యువకుడి తల్లిదండ్రులతో పాటు అతన్ని కలిసి ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు చేయిస్తున్నామన్నారు. త్వరలోనే ఆ యువకుడు పూర్తిగా కోలుకుంటాడన్న ఆశాభావాన్ని మంత్రి పేర్ని నాని వ్యక్తం చేశారు.