కృష్ణ

గిరిజనులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రభు త్వం గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ఎన్నో ప్రోత్సాహకాలు, పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. శనివారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో గిరిజనుల జీవన శైలి, విద్యపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ గిరిజనుల వెనుకబాటు తనానికి పేదరికం, నిరక్షరాస్యత కారణాలన్నారు. వారిని విద్యావంతులుగా చేయుట తద్వారా ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతగానో కృషి చేశారన్నారు. అదే స్ఫూర్తితో నేడు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారన్నారు. బందరు నియోజకవర్గంలో ఎన్నో యేళ్లుగా నివశిస్తున్న గిరిజనులకు వారి పిల్లలు ఉన్నత చదువులకు అండగా ఉంటామన్నారు. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఉగాది నాటికి నివేశన స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేస్తామన్నారు. గిరిజనులకు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయడంలో గల ఇబ్బందులు తొలగించేందుకు వారం రోజుల్లో రెవెన్యూ అధికారులతో కుల పెద్దలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. రిక్షాలు, తోపుడు బండ్లతో జీవనం సాగిస్తున్న 30 మంది లబ్ధిదారులకు మోటారుతో కూడిన కొత్త ప్లాట్‌ఫాం రిక్షాలతో పాటు గతంలో తీసుకున్న 20 పాత ఫ్లాట్ ఫాం రిక్షాలకు కూడా మోటార్లు బిగించి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ విధంగా మొత్తం 50 రిక్షాలను త్వర లో లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ఎఎండీ ఇంతియాజ్ రూ.19లక్షలు మంజూరు చేశారన్నారు. అనంతరం జిల్లా గిరిజన సంక్షేమశాఖ ముద్రించిన గిరిజన సంక్షేమ పథకాల సమాచారంతో కూడిన కరపత్రాలను మంత్రి విడుదల చేశారు. గౌరవ అతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర వైఎస్‌ఆర్ సీపీ ఎస్‌సీ సెల్ అధ్యక్షుడు కుంభ రవిబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన జనాభా 35 లక్షల మంది ఉ న్నారని, మాకున్న సమాచారం మేరకు ప్రస్తుతం జిల్లాలో 1.47లక్షల గిరిజన జనాభా ఉందన్నారు. ఉప ముఖ్యమం త్రి పదవి గిరిజనులకు ఇచ్చి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా, ఆర్డీఓ ఎన్‌ఎస్‌కె ఖాజావలి, గృహ నిర్మాణ శాఖ పీడీ ధనుంజయుడు, మత్స్యశాఖ ఏడీ రమణ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఎం ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.