రాష్ట్రీయం

మంత్రాలయంలో ఘనంగా పూర్వారాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, ఆగస్టు 16: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి 348వ సప్త ఆరాధనోత్సవాల్లో భాగంగా శుక్రవారం పూర్వారాధన వేడుకలు కన్నులపండువగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి మూలబృందావనానికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. రకరకాల పుష్పాలతో బృందావనాన్ని అందంగా అలంకరించారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు బృందావనాన్ని దర్శించుకుని పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా రాత్రి ప్రహ్లాదవరదుడిని సింహవాహనంపై ఊరేగించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం మధ్యారాధన వేడుకలు నిర్వహిస్తారు. ఆదివారం మహారథోత్సవం ఉంటుంది.