Others
ముద్దపప్పేం కాదు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేకుండా ఇప్పటికే బాగా పాపులరైన వెబ్ సిరీస్ ఇది. కొత్త ఏడాదిలో సంక్రాంతికి ప్రారంభమైన ఈ వెబ్ సిరీస్ అంటే యూత్ పడి చేస్తున్నారు కూడా. అందుక్కారణం -నాగబాబు కూతురు నీహారికే. యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నీహారిక -ఈ వెబ్ సిరీస్‌కు స్పెషల్ అట్రాక్షన్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫస్ట్ సిరీస్‌కు పది లక్షల లైకులు పడితే, సెకెండ్ సిరీస్‌కు 8 లక్షల లైకులు సంపాదించి నీహారిక ఇప్పటికే ఇమేజ్ క్లౌడ్ లైన్లో దూసుకుపొతోంది. కొద్దిరోజుల క్రితం రిలీజ్ చేసిన సిరీస్ 3కి సైతం ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా లైకులు వచ్చిపడ్డాయట. నీహారిక, ప్రతాప్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు ప్రణీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. వెబ్ సిరీస్ సక్సెస్‌తో మంచి జోష్‌మీదున్న నీహారిక -తాజాగా చరణ్ కామెంట్‌తో మరింత ఆనందం వ్యక్తం చేస్తోందట. నీహారిక ప్రయత్నాన్ని బ్రదర్ రామ్‌చరణ్ మెచ్చుకుంటూనే -ముద్దపప్పు ఆవకాయ్ టీంకి అభినందనలు తెలుపుతూ ఎఫ్‌బిలో ఒక పోస్ట్ చేశాడట. చరణ్ పోస్టుతో ఈ వెబ్ సిరీస్‌కు మరింత ఊపు రానుందని టీం మొత్తం ఆనందం వ్యక్తం చేస్తోంది. మరోకోణంలో చెప్పాలంటే -నీహారిక్ వెబ్‌సిరీస్‌ను చూడమని చరణ్ నర్మగర్భంగా ప్రమోట్ చేస్తున్నాడన్న మాట. బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ మార్కులు సంపాదించుకున్న నీహారిక -ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్‌తోనూ మంచి మార్కులే కొట్టేసింది. సిల్వర్ స్క్రీన్ మీదకు అడుగు పెట్టడానికి ముందు తనకంటూ -ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి నీహారిక చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నట్టే. క్యూట్ లుక్కులు, ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇక -బిగ్ స్క్రీన్ మీద ఎంతవరకూ రాణిస్తుందో చూద్దాం.