S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/14/2016 - 06:14

ప్రజాకాంక్షకు దీటుగా వ్యవస్థ ఎదగాలి
న్యాయమూర్తులకు రాష్టప్రతి ప్రణబ్ పిలుపు
సంక్షోభంలో విశ్వసనీయత: సిజె వ్యాఖ్య

03/13/2016 - 12:26

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్ నుంచి ఆదివారం డిల్లీకి తిరిగి వచ్చారు. ఆయన ఈ రోజు సాయంత్రం యమునా తీరంలో జరుగుతున్న సాంస్కృతిక ఉత్సవంలో పాల్గొనే అవకాశం వుంది.

03/13/2016 - 12:26

న్యుడిల్లి: దేశ రాజధానిలో యమునా నది తీరంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో జరుగుతున్న కళల కుంభ మేళాలో ఆదివారం వేలాది మంది కళాకారులు పాల్గొన్న భారీ సంగీత విభావరి ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. కేంద్ర హోమ్ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

03/13/2016 - 12:12

జల్‌పాయ్‌గురి: పశ్చిమ్‌ బెంగాల్లోని జల్‌పాయ్‌గురి ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. భయాందోళనతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు.

03/13/2016 - 06:01

బెంగళూరు, మార్చి 12: ఉద్దేశ్యపూర్వకంగా బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి దేశాన్ని వీడి వెళ్లిపోయిన ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను మాజీ ప్రధాన మంత్రి, జనతాదళ్ (సెక్యులర్) నేత హెచ్‌డి.దేవెగౌడ వెనకేసుకొచ్చారు. అంతర్జాతీయ వ్యాపారవేత్త అయిన విజయ్ మాల్యా దేశంనుంచి పారిపోలేదని, ఆయన ‘కర్నాటక ముద్దు బిడ్డ’ అని శనివారం దేవెగౌడ చెప్పారు.

03/13/2016 - 06:00

న్యూఢిల్లీ, మార్చి 12: దేశవ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో తయారైన వివిధ నూతన ఆవిష్కరణలను రాష్టప్రతి భవన్‌లో ‘ఇన్నోవేషన్ ఫెస్టివల్’ పేరుతో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్‌లో శనివారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రులు హర్షవర్ధన్, నజ్మాహెప్తుల్లా, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 65 నూతన ఆవిష్కరణలను ఈ ఎగ్జిబిషన్‌లో విద్యార్థులు ప్రదర్శించారు.

03/13/2016 - 05:59

బిహార్ పర్యటనలో మోదీ రాజకీయం

03/13/2016 - 05:59

న్యూఢిల్లీ, మార్చి 12: నాన్ ఇమ్మిగ్రెంట్స్ హెచ్1బి వీసాలు రద్దుచేయాలంటూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. అమెరికా ప్రజలకు ఉద్యోగ అవకాశాలను హెచ్1బి వీసాలే దెబ్బతీస్తున్నాయని ఆయన ఎన్నికల చర్చ సందర్భంగా స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున రేసులో ఉన్న ట్రంప్ చేస్తున్న ప్రసంగాలు వివాదాస్పదమవుతున్నాయి.

03/13/2016 - 05:58

ఎయిమ్స్ సర్వేలో వెల్లడి

03/13/2016 - 05:57

వాతావరణం మారిందనేది వాస్తవం
ఆ పాపం అభివృద్ధి చెందిన దేశాలదే
పరిష్కారంలో పాత్ర వహిస్తున్న భారత్
కేంద్ర పర్యావరణ మంత్రి జావడేకర్

Pages