S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/27/2016 - 08:11

న్యూఢిల్లీ, జూలై 26: జల్లికట్టు అనేది వందల సంవత్సరాల నాటి క్రీడ అయనంత మాత్రాన దాన్ని సమర్థించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. తాము ఇంతకుముందు ఇచ్చిన తీర్పు తప్పని సంబంధిత పార్టీలు కోర్టును ఒప్పించగలిగితే తాము ఈ వ్యవహారాన్ని మరింత విస్తృత ధర్మాసనానికి నివేదిస్తామని జస్టిస్ దీపక్ మిశ్రా, ఆర్‌ఎఫ్ నారిమన్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది.

07/27/2016 - 07:00

న్యూఢిల్లీ, జూలై 26:పధ్నాలుగు సంవత్సరాల లోపు వయసు పిల్లల్ని పనిలో పెట్టుకోవడాన్ని నిషేధిస్తూ పార్లమెంట్ మంగళవారం ఓ కీలక బిల్లును ఆమోదించింది. ఈ నిబంధన ఉల్లంఘించిన యాజమాన్యాలకు రెండేళ్ల జైలు శిక్ష విధించేందుకు, ఆ పిల్లల తల్లిదండ్రులపైనా జరిమానా వేసేందుకూ ఈ బిల్లు వీలు కల్పిస్తోంది.

07/27/2016 - 06:59

న్యూఢిల్లీ,జూలై 26: జిఎస్‌టి బిల్లుకు సంబంధించి రాష్ట్రాలు చేసిన అభ్యంతరాలను నివృత్తి చేయడంలో కేంద్రం విఫలమైందని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం విజ్ఞన్‌భవన్‌లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలో జరిగిన సాధికరిక కమిటీ సమావేశంలో యనమల మాట్లాడారు. ఈ బిల్లుపై రాష్ట్రాలు వ్యక్తం చేసిన ఆందోళనలకు కేంద్రం పరిష్కారాన్ని అందించలేదన్నారు.

07/27/2016 - 06:58

న్యూఢిల్లీ, జూలై 26: మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం వేలాది మంది రైతుల నుండి తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా భూములు తీసుకుంటోందని కాంగ్రెస్ సభ్యుడు ఎం.ఏ.ఖాన్ మంగళవారం రాజ్యసభలో ఆరోపించారు. రాజ్యసభ జీరో అవర్‌లో మల్లన్నసాగర్ రైతుల సమస్యల గురించి ప్రస్తావించేందుకు డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్‌తో ఖాన్ వాగ్వివాదానికి దిగారు.

07/27/2016 - 05:24

న్యూఢిల్లీ, జూలై 26: పధ్నాలుగేళ్లలోపు వయసు పిల్లల్ని పనిలో పెట్టుకోవడాన్ని నిషేధిస్తూ పార్లమెంట్ మంగళవారం కీలక బిల్లును ఆమోదించింది. ఈ నిబంధన ఉల్లంఘించిన యాజమాన్యాలకు రెండేళ్ల జైలు శిక్ష విధించేందుకు, ఆ పిల్లల తల్లిదండ్రులపైనా జరిమానా విధించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది.

07/27/2016 - 04:26

న్యూఢిల్లీ,జూలై 26: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించేందుకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రతిపాదించిన సవరణ బిల్లు ఆర్థిక అంశాలతో కూడుకున్నది కాబట్టి ఓటింగ్ సాధ్యం కాదని రాజ్యసభ నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.

07/27/2016 - 04:21

ఇంఫాల్, జూలై 26: ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిల(44) తన 16 సంవత్సరాల సుదీర్ఘ నిరాహార దీక్షను విరమించటానికి నిర్ణయించుకున్నారు. ఆత్మహత్యాయత్నం కేసులో జైలులో ఉన్న ఆగస్టు 9న దీక్ష విరమించటానికి నిర్ణయించుకున్నట్లు స్థానిక కోర్టులో హాజరవటానికి మంగళవారం వచ్చిన సందర్భంగా తెలిపారు. ‘నేను దీక్ష విరమిస్తాను. రాజకీయాల్లో చేరుతున్నాను.

07/27/2016 - 04:14

న్యూఢిల్లీ, జూలై 26: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సరిగ్గా పనిచేయని వారికి ఇకపై వార్షిక ఇంక్రిమెంట్లు కట్ అవుతాయి. ప్రమోషన్లు రావాలన్నా పనితీరుకు ‘గుడ్’, ‘వెరీ గుడ్’ అన్న కొలమానాలకు చేరుకోవలసి ఉంటుంది. ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలివి.

07/26/2016 - 18:49

దిల్లీ: ఎపికి ప్రత్యేకహోదా కోసం తమ పార్టీ ఎంపీ కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లును చర్చించాల్సిందేనని రాజ్యసభలో మంగళవారం నాడు కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన ప్రారంభించడంతో సభలో గందరగోళం మొదలైంది. వచ్చే శుక్రవారం ఈ బిల్లుపై చర్చిద్దామని డిప్యూటీ చైర్మన్ కురియన్ చెప్పినప్పటికీ కాంగ్రెస్ సభ్యులు వినిపించుకోలేదు.

07/26/2016 - 18:42

దిల్లీ: రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలుమళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో మంగళవారం బంగారం ధర రూ. 110 పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ. 30,790కి చేరింది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ ఎక్కువవడంతో ధరలు పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. వెండి ధర కూడా నేడు రూ. 320 పెరిగింది. దీంతో బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.

Pages