S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/02/2016 - 04:47

ప్రస్తుతం యస్.జె.సూర్య దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న పవన్‌కళ్యాణ్ త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలిసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా వచ్చే నవంబర్ నుంచి ప్రారంభం అవుతుంది. పవన్‌కళ్యాణ్ త్వరలో సినిమాలు చేయడం మానేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అందువల్ల పవన్ వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నారు.

06/02/2016 - 04:46

హాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా అప్పట్లో దుమ్ము రేపిన సంచలన తార ఎవరంటే.. అందరూ టక్కున చెప్పే సమాధానం ఒక్కటే.. అదే ఏంజిలినా జోలీ? అందాలతో కుర్రకారుకి మతులు పోగొట్టిన ఈ భామ ఇప్పుడు విడాకులు తీసుకునేందుకు సిద్ధం అయింది? ఎంజిలినా జోలి బ్రాడ్ పిట్‌తో దాదాపు 11 సంవత్సరాలు కలిసి వుంది. రెండేళ్ళ క్రితమే వీరిద్దరూ వివాహం కూడా చేసుకున్నారు.

06/02/2016 - 04:44

తెలంగాణ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాల్ని కాపాడడం కోసం ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం ఒక కారణజన్ముని సారథ్యంలో తెలంగాణ సమాజం సాగించిన విజయగాథను కథాంశంగా చండీయాగం అనే టైటిల్‌తో పూర్తిస్థాయి సోషియో ఫాంటసీ తరహాలో హెగియో గ్రాఫికల్ సినిమాగా నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుగుతున్నవేళ చండీయాగ చిత్రాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా వుందని నిర్మాత తెలియజేశారు.

06/02/2016 - 04:43

తెలంగాణ రాష్ట్ర అవతరణ దిన్సోవం సందర్భంగా ఓ ప్రముఖ టీవీ చానెల్ సమర్పణలో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో పూర్ణచందర్ దర్శకత్వంలో మిట్టపల్లి సురేందర్ సంగీత, సాహిత్యం సమకూర్చిన ‘మునుము’ అనే ప్రత్యేక గీతాన్ని మంగళవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు.

06/02/2016 - 04:41

బాలీవుడ్‌లో నవ్వుల రారాజుగా వెలుగొందిన హాస్య నటుడు రజాక్‌ఖాన్ కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా గుండె సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నారు. ముంబాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. దాదాపుగా 90కి పైగా చిత్రాల్లో నటించి బాలీవుడ్ ప్రేక్షకుల్ని రజాక్‌ఖాన్ ఆకట్టుకున్నారు.

06/02/2016 - 04:40

గతంలో పన్నారాయల్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన కాలింగ్‌బెల్ చిత్రానికి సీక్వెల్ రూపొందుతోంది. ఈ చిత్రానికి కాలింగ్‌బెల్-2 అనే పేరును ఖరారు చేశారు. డ్రీమ్‌కేచర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అశోక్, రాజ్‌దలవాయి రూపొందించనున్నారు. ఈనెలలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది.

06/02/2016 - 04:39

నటిగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న మహేష్‌బాబు సోదరి మంజుల ఇప్పుడు మరో బాధ్యత తీసుకునేందుకు రెడీ అయ్యింది. ఇప్పటివరకూ నటిగా షో, కావ్యాస్ డైరీ లాంటి చిత్రాల్లో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా మహేష్ కథానాయకుడిగా నటించిన నాని, పోకిరితోపాటు షో, కావ్యాస్ డైరీ, ఏమాయ చేసావె తదితర చిత్రాల్ని నిర్మించారు మంజుల.

06/02/2016 - 04:38

దక్షిణాదిలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి.. ఆ తరువాత బాలీవుడ్‌కి చెక్కేసిన హాట్ భామ ఇలియానాకు అక్కడ తీవ్ర నిరాశే మిగిలింది. చేసిన నాలుగు సినిమాలు ఢమాల్‌మనడంతో అవకాశాలు రావడం ఆగిపోయాయి. దాంతో మళ్లీ గ్లామర్ పెంచి మాగజిన్‌లకు హాట్‌హాట్ ఫోజులిచ్చి సౌత్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ట్రైచేసినా పెద్దగా లాభం లేకపోయింది. దాంతో ఇక పెళ్లిచేసుకునేందుకు రెడీ అయినట్టు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి!

06/02/2016 - 04:37

శ్రీనువైట్ల, వరుణ్‌తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘మిస్టర్’ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ 28న స్పెయిన్‌లో ప్రారంభం అవుతుందని తెలిసింది. నిజానికి మొదట ఈ సినిమా మే 15 నుంచి స్పెయిన్‌లో షూటింగ్ మొదలు కావాల్సి ఉన్నా అది జరుగలేదు. ప్రస్తుతం లాస్‌వేగాస్‌లో విశ్రాంతి తీసుకుంటున్న వరుణ్‌తేజ్ మరికొద్ది రోజుల్లో ఇండియాకు రానున్నారు.

05/31/2016 - 22:21

తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించేందుకు స్వదేశీ గ్రూప్ ముందుకొచ్చింది. దాదాపు 1000 కోట్లతో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికోసం రివాల్వింగ్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు స్వదేశీ గ్రూప్ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మోటూరి కృష్ణప్రసాద్ తెలియజేశారు. హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో తమ స్వదేశీ గ్రూప్ నుంచి భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను ఆయన వివరించారు.

Pages