S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/23/2016 - 21:34

‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి రచయితగా పనిచేసిన హుసేన్ షా కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందించిన చిత్రం ‘మీకు మీరే మాకు మేమే’. తరుణ్‌శెట్టి, అవంతిక మిశ్రా జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్లానెట్ గ్రీన్ స్టూడియో నిర్మిస్తోంది.

01/22/2016 - 21:08

సిద్ధార్థ్, త్రిష, హన్సిక, పూనమ్ బజ్వా ప్రధాన తారాగణంగా సర్వంతరామ్ క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ పతాకాలపై అందిస్తున్న చిత్రం ‘కళావతి’. తమిళంలో విజయవంతమైన ‘అరన్మణి-2’ చిత్రాన్ని తెలుగులో అనువదించారు. సుందర్.సి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 29న విడుదలకు సిద్ధమైంది.

01/22/2016 - 21:05

హనీ, ప్రణీ ఫిలింస్ పతాకంపై నంది వెంకటరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వేటపాలెం’. ప్రశాంత్, లావణ్య, శిల్ప ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత ఎ.వి.ఆర్.

01/22/2016 - 21:03

కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌పై నిర్మించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సంక్రాంతికి విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. నాగార్జున ద్విపాత్రాభినయంతో రూపొందిన ఈ సినిమా పండుగకు విడుదలైన సినిమాల్లో అగ్రగామిగా నిలిచింది. దీంతో ఈ చిత్ర ప్రదర్శనకు బయ్యర్లు ఆసక్తి చూపుతున్నారు.

01/22/2016 - 21:01

చెన్నై వరదబాధితుల సహాయార్థం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 5 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించి ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్‌కు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, కళలకు, కళాకారులకు ప్రాంతీయ భేదాలు లేవని, ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిగిన నడిగర్ ఎన్నికల్లో విశాల్ గెలిచాడని తెలిపారు.

01/22/2016 - 21:00

శ్రీవత్సా క్రియేషన్స్ పతాకంపై సంజయ్, చేతనా ఉత్తేజ్, కారుణ్య ప్రధాన తారాగణంగా వి.శశిభూషణ్ దర్శకత్వంలో కమల్‌కుమార్ పెండెం రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత కమల్‌కుమార్ మాట్లాడుతూ, ప్రేమన్నది ప్రపంచ వ్యాప్తంగా వున్న అందమైన అనుభవమని, ప్రేమ విషయంలో ప్రతి మనిషి తనదైన శైలిలో నిర్వచనం చెబుతూనే వుంటారని తెలిపారు.

01/22/2016 - 20:55

సునీల్ కథానాయకుడిగా వాసూవర్మ దర్శకత్వంలో రాజు రూపొందిస్తున్న చిత్రం ‘కృష్ణాష్టమి’.
ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఇటీవల విడుదలయ్యాయి. పాటలకు మంచి స్పందన లభిస్తోందని
దర్శకుడు వాసు వర్మ తెలియజేస్తున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ మిక్కి గల్రాణి, డింపుల్ చోప్‌డే

01/22/2016 - 20:51

హనూ రాఘవపూడి దర్శకత్వంలో నాని, మెహరన్‌కౌర్ జంటగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట రూపొందిస్తున్న చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని మహేష్‌బాబు విడుదల చేశారు.

01/22/2016 - 20:49

‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ఇంత విజయం సాధించడానికి నాలుగు మూలస్తంభాలు వున్నాయని, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, సుకుమార్, నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌లే ఆ నలుగురు అని, వారు లేకపోతే ఈ చిత్రం ఇంత గొప్పగా రూపొందేది కాదని, అంతే విజయాన్ని సాధించేది కాదని నటుడు ఎన్టీఆర్ తెలిపారు.

01/22/2016 - 20:46

ఒకప్పుడు టాలీవుడ్‌లోకి బాలీవుడ్ ముద్దుగుమ్మలు వలసలు కట్టేవారు. ఇప్పుడు ఈ వలసలు మలయాళ పరిశ్రమనుండి ఎక్కువయ్యాయి. ఇప్పటికే పలువురు భామలు టాలీవుడ్‌లో హంగామా చేస్తున్నారు. లేటెస్ట్‌గా మరో హీరోయిన్ పరిచయంకానుంది. ‘ప్రేమమ్’ సినిమాలో నటించిన మడోన సెబాస్టియన్ తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది.

Pages