S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/28/2016 - 03:38

శ్రీకాంత్ కథానాయకుడిగా రాజా ఆర్ట్ ప్రొడక్షన్స్, ఎ.సుబ్రహ్మణ్యేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘మెంటల్ పోలీస్’. కరణం పి.బాబ్జి దర్శకత్వంలో వి.వి.ఎస్.ఎన్.వి.ప్రసాద్ దాసరి, వి.వి.దుర్గాప్రసాద్, అనగాని రూపొందిస్తున్న చిత్రం ఇది. చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

01/28/2016 - 03:37

‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాతో సంక్రాంతి హీరోగా మారిన నాగార్జున తాజా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై చర్చలు జరుగుతున్నాయి. రవితేజ హీరోగా వేణుశ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎవడో ఒకడు’ చిత్రాన్ని ఇప్పుడు నాగార్జునతో సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో విలన్‌గా నటించేందుకు క్రేజీ హీరో జగపతిబాబు సిద్ధమయ్యాడు.

01/28/2016 - 03:36

ఆది కథానాయకుడు ఎస్.ఆర్.టి. మూవీస్ హౌస్, శ్రీ ఐశ్వర్యలక్ష్మి పతాకాలపై రామూ తాళ్ళూరి, వెంకట్ తలారి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ ఈనెల 29 నుండి బ్యాంకాక్‌లో ప్రారంభం కానుంది.

01/28/2016 - 03:35

నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా జగదీష్ తలశిల దర్శకత్వంలో మయూఖా క్రియేషన్స్ పతాకంపై సాయిప్రసాద్ కామినేని నిర్మిస్తున్న చిత్రం ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 29న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు జగదీష్ తలశిల చెప్పిన విశేషాలు.

01/28/2016 - 03:34

ప్రముఖ నటుడు వెంకటేష్‌కి రీమేక్ సినిమాలపై ఆసక్తి వున్న విషయం తెలిసిందే. మంచి సినిమా ఎక్కడ ఉన్నా దాన్ని తెలుగులోకి రీమేక్ చేయడంలో ముందుంటాడు. ఇప్పటికే తమిళంలో సూపర్‌హిట్ అయిన ఎన్నో చిత్రాల్ని రీమేక్ చేసిన వెంకటేష్ ఈసారి సినిమా విడుదల కాకముందే ఆ సినిమాను రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. బాలీవుడ్‌లో మాధవన్ హీరోగా నటిస్తున్న ‘సాల ఖద్దూస్’ చిత్రాన్ని రీమేక్ చేస్తాడట.

01/28/2016 - 03:34

‘దేశముదురు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి క్రేజీ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ హన్సిక. అటుపై తమిళ పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టి అక్కడ కూడా తిరుగులేని ఇమేజ్‌ని తెచ్చుకుంది. ప్రస్తుతం రెండు భాషల్లో నటిస్తూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.

01/28/2016 - 03:33

నూతన నటీనటులు కార్తీక్, నిత్యాశెట్టి, శామ్ ప్రధానంగా చునియా దర్శకత్వంలో ఐయాన్ క్రియేషన్స్ పతాకంపై నాగార్జున ప్రోత్సాహంతో రూపొందించిన చిత్రం ‘పడేసావె’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీ హైదరాబాద్‌లో అక్కినేని నాగార్జున, కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు.

01/27/2016 - 01:43

‘గ్లామర్, నటన అనేవి నటికి రెండూ అవసరమే. అయితే మంచిపేరు రావాలంటే కమర్షియల్ చిత్రాల్లో నటించక తప్పదు. సినిమా పరిశ్రమలో సెటిల్ అయ్యాక ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాలి. అయితే ఇక్కడ నిర్ణయాలు మా చేతుల్లో వుండవు’ అంటోంది నటి పూనమ్ బజ్వా.

01/27/2016 - 01:41

సిద్ధాంశ్, రేయాన్ రాహుల్, తేజస్వి ప్రధాన తారాగణంగా కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో బి.రమేష్ రూపొందిస్తున్న చిత్రం ‘సినీ మహల్’ (రోజుకు 4 ఆటలు). ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను జరుపుతున్నారు.

01/27/2016 - 01:39

ఉత్తమ నటుడు మహేశ్‌బాబు, ఉత్తమ నటి శ్రుతిహాసన్, ఉత్తమ దర్శకుడు రాజవౌళి

మూడు అవార్డులు దక్కించుకున్న రంగీ తరంగ (కన్నడ) దర్శకుడు
అనూప్ భండారి

Pages